India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజల ఫిర్యాదుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే విధంగా దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు. సోమవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘గ్రీవెన్స్’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించుకున్నారు. సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

ఆదిలాబాద్ విద్యానగర్‌కు చెందిన నారాయణరెడ్డి-రజనీ దంపతుల కుమారుడు సుచెంతన్ రెడ్డి ప్రత్యేక కోటాలో మల్టీ జోన్-1 విభాగంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్(ATW)గా ఎంపికయ్యారు. ప్రత్యేక స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్‌తో వినడం ద్వారా పరీక్షకు సన్నద్ధమై గ్రూప్-2 పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. డ్రగ్ రియాక్షన్ కారణంగా నాలుగో తరగతిలో కంటి చూపు కోల్పోయారు. తన లక్ష్యం సివిల్స్ సాధించడమేనని
తెలిపారు.

గ్రూప్ – 2 ఫలితాలల్లో ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ తీసుకున్న అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం నలుగురు ఉద్యోగాలు సాధించారని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బి.ఉదయ్(డిప్యూటీ తహశీల్దార్), అవినాశ్ (ఎంపీఓ), నందిని (ఎంపీఓ), వాణి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఉద్యోగాలు సాధించినట్లు వెల్లడించారు. స్టడీ సర్కిల్ నుంచి ఇంతమందికి ఉద్యోగాలు రావడం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ నూతన డీజీపీగా నియమితులైన బి.శివధర్ రెడ్డి (ఐపీఎస్ 1994) తన కెరీర్ ఆరంభంలోనే కీలక బాధ్యతలు నిర్వహించారు. మావోయిస్టుల ఏరివేతకు పనిచేసే ఎలైట్ దళమైన గ్రేహౌండ్స్‌లో స్క్వాడ్రన్ కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా కూడా సేవలు అందించారు. ఆయన నల్గొండ, గుంటూరు సహా పలు జిల్లాలకు ఎస్పీగా కూడా పనిచేశారు.

ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో పోలీసులు జిల్లాలోని పలు మండలాల్లో అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడి చేసిన విషయం తెలిసిందే. పోలీసులు ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, పాస్‌బుక్‌లు, స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకొని 18 కేసులు నమోదు చేయడంతో అక్రమ వ్యాపారుల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది. పలువురు వడ్డీ వ్యాపారులు తమ ఇళ్లకు తాళం వేసి పరారు కాగా.. మరికొంత మంది తాకట్టు పెట్టుకున్న పత్రాలను దాచే పనిలో పడ్డారు.

అధిక వడ్డీలతో రైతులు, ప్రజల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 43 బృందాలతో 13 మండలాల్లో శుక్రవారం దాడులు చేశారు. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో 18కేసులు నమోదు చేశామన్నారు. దాడులలో వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్ బుక్కులు, బాండ్ పేపర్స్, సేల్ డేట్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని జూనియర్ కళాశాలలకు ఈనెల 27 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నట్లు DIEO జాధవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ముందుగా ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల కాగా, ఇప్పుడు ఒక రోజు ముందు నుంచే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు అతివలకు రెండేసి చొప్పున చీరలు ఇస్తామని నిర్ణయించిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల చీరలను ఇప్పుడు ఒకటి.. సంక్రాంతి లోపు మరొకటి ఇస్తామని పేర్కొంది. అయితే ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సిన చీరలు ఇంకా చేరుకోలేదు. జిల్లాలో 10 గోదాములను అధికారులు గుర్తించగా.. 1.48 లక్షల చీరలను ప్రభుత్వం మంజూరు చేసింది. అవి వస్తే స్వయం సహాయక సంఘాల సభ్యులకు అధికారులు పంపిణీ చేస్తారు.

ADB జిల్లాలో గురువారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బేల 24.8 mm, ఉట్నూర్ 21.8, ఆదిలాబాద్ రూరల్ 21.3, ఇచ్చోడ 21.0, గాదిగూడ 19.3, ఇంద్రవెల్లి 19.0, తలమడుగు 18, మావల 17.3, బోథ్ 17.3, బజార్హత్నూర్ 17.0, నేరడిగొండ 17.0, తాంసి 16.8, గుడిహత్నూర్ 16.5 మిల్లీమీటర్లుగా నమోదయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించేందుకు టాయిలెట్స్, విద్యుత్, బోర్ వెల్స్ EGSలో మంజూరైన పనులను వేగవంతం చేయాలని అన్నారు. పనులు పెండింగ్‌లో ఉంచకుండా నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.