Adilabad

News April 4, 2026

భోస్రలో ఆదిలాబాద్ కలెక్టర్‌ ఆకస్మిక పర్యటన

image

బజార్‌హత్నూర్ మండలంలోని భోస్ర గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ శివనామ సప్తాహాన్ని కలెక్టర్ రాజర్షి షా శనివారం ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక హనుమాన్ ఆలయంలో భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజాప్రతినిధులు, స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 4, 2026

ఆదిలాబాద్: 2వ రోజు JEE ప్రశాంతం.. 11 మంది గైర్హాజరు

image

జిల్లాలో JEE మెయిన్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. పట్టణంలోని నలంద కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు. 2వ రోజు శనివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం నిర్వహించిన పరీక్షకు 79 మంది విద్యార్థులకు ఐదుగురు గైర్హాజరయ్యారని పరీక్షల కో-ఆర్డినేటర్ పున్నరావ్ తెలిపారు. అలాగే మధ్యాహ్నం పరీక్షకు 80 మందికి 11 మంది గైర్హాజరయ్యారన్నారు.

News April 4, 2026

పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా

image

బజార్‌హత్నూర్ మండలం దిగ్నూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ రాజర్షి షా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.

News April 4, 2026

సీఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

image

CM ఈనెల 6న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ప్రోటోకాల్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేటాయించిన విభాగాల వద్దే ప్రజా ప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

News April 4, 2026

ఆదిలాబాద్: CM పర్యటనపై కలెక్టర్ సమీక్ష

image

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 6న జరిగే సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ రాజర్షిషా సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చేరుకుని, అనంతరం సభా ప్రాంగణంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారని తెలిపారు.

ఆదిలాబాద్: హత్య.. యువకుడి మృతి..!

image

ఆదిలాబాద్‌లో హత్య ఘటన శుక్రవారం రాత్రి కలకలం రేపింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారిగూడలో రాజేశ్ అనే వ్యక్తికి మరో వ్యక్తితో గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రాజేశ్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.