India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ జిల్లాలో కారు బోల్తా పడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. ఆర్మూర్‌కు చెందిన బాలు, సాయిలు ఆదిలాబాద్‌లో జరిగే శుభకార్యానికి బయలుదేరారు. కాగా ఇచ్చోడ సమీపంలోని అగ్నిమాపక కార్యాలయం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. కాగా ఇద్దరికి గాయాలు కాగా వారిని 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.
ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన జూడో క్రీడాకారులు సత్తా చాటారు. ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంతారావు, కోచ్ రాజు తెలిపారు. వీరంతా మహబూబ్ నగర్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ZPHS బాలుర పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఈశ్వర ప్రసాద్, జోనల్ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు కార్తిక్ ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఈ నెల 28 నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరగనున్నాయి. రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలు వచ్చే నెల 2వ తేదీ నుంచి మహబూబాబాద్‌లో జరగనున్నాయి. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల HM, సిబ్బంది అభినందించారు.
బెజ్జూర్ మండలం సోమిని ఎర్రబండ ప్రాణహిత నదిలో ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం జహీర్ హుస్సేన్ మృతదేహం లభ్యం కాగా సాయంత్రానికి ఇర్షాద్ మృతదేహాన్ని మహారాష్ట్ర రెస్క్యూ టీంతో కలిసి తెలంగాణ పోలీసులు వెలికితీశారు. ఇర్షాద్ మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించినట్లు ఎస్సై విక్రం తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణం చుట్టు పక్కల ప్రాంతాలను కలుపుతూ ఆదిలాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఔడా)గా ఏర్పాటైంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రంగం ఇటీవల ప్రతిపాదనలు పంపగా వాటిని సర్కారు ఆమోదించింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ తోపాటు ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని ఆరు మండలాల్లో గల 107 గ్రామాలతో కూడిన ఔడాను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంప్రదింపుల కమిటీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంప్రదింపుల కమిటీకి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా.. సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ సహాయకులుగా ఉండనున్నారు. ఈ కమిటీలో మొత్తం 15 మంది ఉంటారు.
మంచిర్యాలలోని రాళ్లవాగుకు రూ.255 కోట్లతో ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషితో ఇందుకు సంబంధించి శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రాళ్లవాగుకు నిర్మించనున్న కరకట్టలతో పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసీ కాలనీ, రాంనగర్, పద్మశాలి కాలనీ, బాలాజీ నగర్ లకు వర్షాకాలంలో గోదావరి వరదల నుంచి రక్షణ లభించనుంది.
కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపు కమిటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ చోటు దక్కించుకున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ విధాన నిర్ణయాలపై పార్లమెంట్ సభ్యులకు అవగాహన కల్పించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచి మరో ఎంపీ లక్ష్మణ్ సైతం చోటు దక్కించుకున్నారు.
INTUC జాతీయ అధ్యక్షులు డా.జి. సంజీవరెడ్డిని శనివారం తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ , యూనియన్ సెక్రటరీ జనక్ ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా సింగరేణిలో యూనియన్ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, జాతీయ, ఉమ్మడి రాష్ట్రాల INTUC వర్కింగ్ కమిటీ సమావేశం, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాల పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అంశాలపై వారు చర్చించారు.
అదిలాబాద్ కలెక్టరేట్ సమావేశంలో మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా ఈ నెల 28న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ నెల 28న జిల్లాకు బీసీ కమిషన్ బృందం రానున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం ప్రజలు గమనించాలని మరొక సోమవారం యథాతథంగా ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.