India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లావ్యాప్తంగా రెండు వేల గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు జిల్లావ్యాప్తంగా 1500 గణపతుల నిమర్జనాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నారు. శనివారం 450 గణపతి విగ్రహాల నిమజ్జనం ఉందని పేర్కొన్నారు. చివరి గణపతి నిమర్జనం పూర్తి అయ్యే వరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతోనే వ్యవహరిస్తుందని తెలిపారు.

ఆదిలాబాద్ రిమ్స్‌లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. రిమ్స్‌లో వైద్య విద్య చదువుతున్న 2021 విద్యార్థులు.. వైద్యులను ఆడిటోరియంలో సత్కరించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సైతం వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌లు దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, వైద్యులు సందీప్ జాదవ్, తిప్పే స్వామి, సరోజ, అవినాష్‌రెడ్డి ఉన్నారు

బోధన, అభ్యాసం, పరిపాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన బోథ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డుకు ఎంపికయ్యారు. టీచర్స్ డేను పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన ‘గురుపూజోత్సవం’ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు

నిబంధనకు లోబడి సౌండ్ బాక్స్‌లను ఏర్పాటు చేయని వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. నేరడిగొండ మండలం వడూరు గణపతి మండపాల వద్ద నిబంధనలకు అతిక్రమించి, ఏర్పాటు చేసిన నాలుగు డీజేలను స్వాధీనం చేసుకొని యజమానులపై, ఆపరేటర్లపై నేరడిగొండ PSలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ADB శివాజీ చౌక్ నుంచి ఠాకూర్ హోటల్‌కు వెళ్లే దారి మధ్యలో ఓకే మండపానికి చెందిన వ్యక్తులు రెండు గ్రూపులుగా విడిపోయి, మద్యం మత్తులో గొడవ పడ్డారు. ట్రాఫిక్ సీఐ ప్రణయ్ కుమార్ అక్కడికి చేరుకొని వారికి సర్ది చెప్పిన.. వినక పోయేసరికి బలవంతంగా వారిని చెదరగొట్టి పంపించేశారు. ఈ ఘటనను కొందరు పోలీసులు కొట్టారని దుష్ప్రచారం చేస్తున్నారని వారిపట్ల చర్యలు తప్పవని ఆయన తెలిపారు.

గణపతి నిమజ్జనం సందర్భంగా ఆదిలాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బంది, ప్రత్యేకంగా 50 మంది సిబ్బంది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 24 గంటలు విధులు నిర్వహిస్తుంటారని తెలిపారు. ప్రజలు వారికి సహకరించాలని కోరారు.

గణపతి నిమజ్జనోత్సవాలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 600 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారన్నారు. నిఘా కోసం 350 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. 8 సెక్టార్లు, 8 క్లస్టర్లు, 23 పికెట్లు, రూఫ్‌టాప్ బందోబస్తు, హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు.

ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పిప్పర్ వాడ జడ్పీహెచ్ఎస్ హెడ్‌మాస్టర్ జి.శశికళ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈనెల 5న హైదరాబాద్‌లో ఆమె అవార్డు అందుకొనున్నారు. విద్యార్థులలో అభ్యాస సామర్థ్యాలను పెంచడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులుగా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఎంపికైన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

ప్రముఖ తత్వకవి ఉదారి నాగదాసు స్మారక కవితా అవార్డును 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి కరీంనగర్ వాసి తోట నిర్మలారాణికి అవార్డును కమిటీ ప్రకటించిందని నిర్వాహకులు డా.ఉదారి నారాయణ తెలియజేశారు. ఈ అవార్డును సెప్టెంబర్ 7న జిల్లా పరిషత మీటింగ్ హాల్‌లో మద్యాహ్నం మూడు గంటలకు అవార్డు ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డు కింద రూ.5 వేల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఒక వ్యక్తి ఉన్నతస్థానానికి ఎదగడంలో, భవిష్యత్తుకు పునాదులు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఉన్నతస్థాయికి చేరాలంటే గురువు అవసరం తప్పనిసరని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి తగిన గౌరవాన్ని ప్రభుత్వం ఇస్తోందని, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏఐ ద్వారా బోధించేలా టీచర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.