India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాంసిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్సై వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కీర్తిరాజా గీతేష్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఉపాధ్యాయుడిని రిమాండ్‌కు తరలించారు.

ఆదిలాబాద్ నూతన విద్యాశాఖ అధికారిగా ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో ఆమె డీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆమెకు విద్యాశాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకు చెందిన ఎస్.చరణ్‌తేజ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 3, 4 తేదీల్లో హనుమకొండ వేదికగా జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ట్రయాథ్లాన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరగనున్న పాండిచ్చేరిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ రమేశ్ తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రంథాలయ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థుల సమస్యలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, త్వరలో సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. ప్రతిఒక్కరూ పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తమ సొంత పిల్లల్లా భావించి వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం తప్పనిసరిగా అందించాలని రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ అలుగు వర్షిని సంబంధిత హెచ్ఎంలకు సూచించారు. సోమవారం ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌష్టికాహారం సమయానుకూలంగా అందేలా హెచ్ఎం, వార్డెన్లు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

బాధితుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 38 మంది అర్జీలను ఆయన స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో తల్లిపాల వారోత్సవాలు.. పోషకాహార దినోత్సవం పోస్టర్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఆగస్టులో తల్లి పాల వారోత్సవాలు, పోషకాహార దినోత్సవం జరుపుకుంటారన్నారు. తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించాలని పేర్కొన్నారు.

HYD రాజ్‌భవన్‌లో ఇటీవల జరిగిన నీతిఆయోగ్ నార్నూర్ బ్లాక్ రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్‌లో గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పతకాన్ని ADB కలెక్టర్ రాజర్షి షా అందుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా సన్మానించారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకోవడం మన జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తిగత విజయంగా కాకుండా, అందరి సమష్టి కృషి ఫలితంగా సాధించామని చెప్పారు.

ఆదిలాబాద్‌లోని డ్రైవర్స్ కాలనీలో జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్ పర్యటించారు. డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఇంటిని ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతంలో వారం రోజుల పాటు డ్రై డే నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు డెంగీ నివారణ చర్యల్లో భాగస్వాములవ్వాలని కోరారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించారు. జిల్లాలో ఇప్పటి వరకు 19 డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

ADB తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో ఈనెల 11న HCL Technologies ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. 2024-25 సంవత్సరంలో MPC, MEC, CEC/BIPC, Vocational Computersలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 8074065803, 7981834205 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.