Adilabad

News March 30, 2025

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత తప్పనిసరి: ADB SP

image

ఆధునిక సమాజంలో అమాయక ప్రజలను ఎలాగైనా మోసం చేసి డబ్బులు దోచేయాలనే దురుద్దేశంతో వివిధ రకాలైన సైబర్ క్రైమ్ జరుగుతుందని జిల్లా SP అఖిల్ మహాజన్ అన్నారు. సైబర్ నేరాలను అప్రమత్తత, అవగాహన ద్వారా అడ్డుకోవడం సాధ్యమవుతుందని, ఎవరైనా సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎలాంటి నష్టాన్ని అయినా సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News March 29, 2025

ఆదిలాబాద్: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి

image

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులకు 2025 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి” పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని SC సంక్షేమ శాఖ అధికారి సునీత పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 88869 76630 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News March 28, 2025

ADB: ప్రతి పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ల పాత్ర కీలకమైంది: ఎస్పీ

image

ప్రతి పోలీస్ స్టేషన్ నందు రిసెప్షన్ సెంటర్ల పాత్ర కీలకంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న రిసెప్షనిస్టూలతో సమావేశం ఏర్పాటు చేసి, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా కృషి చేయాలన్నారు.

News March 28, 2025

ADB: తెలుగు నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

image

తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముద్రించిన పంచాంగాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆదిలాబాద్‌లో శుక్రవారం కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నూతన పంచాంగాన్ని ఆవిష్కరించి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సమితి ప్రతినిధులు ప్రమోద్ కుమార్, పడకంటి సూర్యకాంత్, బండారి వామన్, కందుల రవీందర్ తదితరులు ఉన్నారు

News March 28, 2025

ఇచ్చోడ: ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఇచ్చోడలోని నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. SI పోలీసుల వివరాలు.. బోథ్ మండలం సాకేరాకి చెందిన ధనుశ్(12) తల్లి లక్ష్మితో కలిసి బుధవారం బంధువుల ఇంటికి ఫంక్షన్‌కు వచ్చాడు. గురువారం ఉదయం తోటి పిల్లలతో కలిసి ఊరి బయట ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోవడంతో మృతి చెందాడు. తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 

News March 28, 2025

ADB: గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

ఆదిలాబాద్‌లో ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కేఆర్కే కాలనీకి చెందిన నితిన్ మసూద్ చౌక్ సమీపంలో గురువారం బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న 1-టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ అశోక్ రిమ్స్‌కు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. 

News March 28, 2025

అగ్నివీర్‌కు తాంసి యువకులు

image

తాంసి మండలం కప్పర్ల గ్రామానికి సందీప్, తన్వీర్ ఖాన్ అనే యువకులు గురువారం విడుదలైన అగ్నివీర్ ఫలితాల్లో ఎంపికయ్యారు. సందీప్ తండ్రి రమేశ్ వృత్తిరీత్యా వ్యవసాయం, తన్వీర్ ఖాన్ తండ్రి మునీర్ ఖాన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తారు. పిల్లలకు నచ్చిన రంగాన్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. 

News March 28, 2025

అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించండి: ADB DIEO

image

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదిలాబాద్ ఇంటర్ విద్యాశాఖ అధికారి జాదవ్ గణేశ్ కుమార్ సూచించారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 2 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. పది పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి వారికి ప్రభుత్వ కళాశాల గురించి వివరించాలని సూచించారు. ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్ సౌకర్యాలను వివరించాలన్నారు.

News March 28, 2025

జిల్లాకు విమానాశ్రం మంజూరు చేయండి: MP నగేశ్

image

ADB జిల్లాకు విమానాశ్రయాన్ని మంజూరు చేయాలని ఎంపీ నగేశ్ కోరారు. గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి వ్యూహాత్మకమైన ప్రాంతమని, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాలకు కూడా ఎంతో ఉపయోగకరమన్నారు. అన్ని విధాలుగా సౌకర్యవంతమైన ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ తీర్చాలని కోరారు.

News March 27, 2025

ADB: మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ కవిత

image

మాజీ మంత్రి జోగురామన్నను గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పక్షాన ఒత్తిడి పెంచుతామన్నారు.