Adilabad

News February 27, 2025

ఎన్నికలకు 400 మందితో బందోబస్తు: ADB SP

image

నేడు జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ADB జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పరిశీలించారు. అధికారులు,  సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News February 26, 2025

ADB: రేపు ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు

image

మెదక్ – నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ & టీచర్స్ ఎన్నికలను దృష్ట్యా ఆదిలాబాద్‌లో గురువారం పోలింగ్ కేంద్రాలున్న ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. కావున జిల్లా విద్యాశాఖాధికారి, ఆదిలాబాద్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులందరూ తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 26, 2025

ADB జిల్లాలో 31 ఇంటర్ పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

image

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ఎస్ఈకి సూచించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేర్చాలన్నారు.

News February 26, 2025

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేద్దాం: ADB కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వ పథకాలను జిల్లాలో గెజిటెడ్ అధికారుల సహకారంతో సమర్థవంతంగా అమలు చేద్దామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ రూపొందించిన డైరీని కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. అంతకు ముందు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకుమార్, రామారావు, తదితరులు ఉన్నారు.

News February 25, 2025

ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

image

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కొత్త‌బాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్‌ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామ‌ని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేసి ఆమెను అభినందించారు.

News February 25, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,920గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.20 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News February 25, 2025

ADB: 3 రోజులు పత్తి కొనుగోలు బంద్

image

ఈ నెల 26, 27, 28 తేదీల్లో జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలిపారు. 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు, 28న అమావాస్య ఉన్నందున కొనుగోళ్లు జరగవని వెల్లడించారు. మార్చి 1నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

News February 25, 2025

ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరానగర్‌లో రవితేజ (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడు క్రాంతినగర్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు.

News February 25, 2025

పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి: ADB కలెక్టర్

image

శాసన మండలి ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బందికి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండో విడత శిక్షణ తరగతులను సోమవారం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ఈ నెల 27న జరగనున్న పోలింగ్ ప్రక్రియపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే  ఉదయం 8 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.

News February 25, 2025

ADB: మహాశివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సు సౌకర్యాలు కల్పించినట్లు సంస్థ రీజినల్ మేనేజర్ సోలోమన్ తెలిపారు. రీజినల్ పరిధిలోని నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల నుంచి ఈనెల 25 నుంచి 27వ వరకు వేములవాడ, వేలాల, బుగ్గ, నంబాల, వాంకిడి, ఈజ్గాంకు 93 బస్సులను 833 ట్రిప్పుల్లో నడపనున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!