Adilabad

News July 16, 2024

ADB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులు

image

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అదిలాబాద్ డిఈఓ ప్రణీత పేర్కొన్నారు. జలై 15 వరకు గడువు ఉండగా, ఈ నెల 21 వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. కావున జిల్లాలోని ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత ఆన్‌లైన్ పేమెంట్ కాపీతో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News July 16, 2024

తలమడుగు: మోహర్రం వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే

image

మోహర్రం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో చరిత్ర గల హాసన్ హుసేన్ దేవస్థానాన్ని బోథ్ ఎమ్మెల్యే ఆనిల్ జాధవ్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రుయ్యాడి గ్రామంలో మోహర్రం పండుగకు ఒక ప్రాముఖ్యత ఉందన్నారు. మతసామరస్యానికి ప్రత్యేక మోహర్రం పండుగ అని పేర్కొన్నారు.

News July 16, 2024

ADB: ప్రాణం తీసిన క్షణికావేశం

image

క్షణికావేశం ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన కడెంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాలు.. చిట్యాల్ గ్రామానికి చెందిన పందిరి గంగారాం(27) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య, తల్లి అతడిని మందలించారు. ఈ క్రమంలో ఈరోజు వారి మధ్య వాగ్వాదం జరగగా క్షణికావేశంలో గంగారాం పురుగు మందు తాగాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులుఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.

News July 16, 2024

ADB: పరీక్షకు హాజరైన.. హాజరు కాని ఫలితాలు

image

కాకతీయ యూనివర్సిటీ విధానంపై విద్యార్థులు విస్తుపోతున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఇటీవల జరిగిన 6వ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యారు. కానీ విడుదలైన ఫలితాల్లో వారు పరీక్షకు హాజరు కాలేదని చూపడంతో ఆశ్చర్యపోతున్నారు. PG విద్య కోసం ఇప్పటికే ఎంట్రెన్స్ పరీక్ష కూడా రాశారు. కానీ పరీక్షలకు హాజరు కాకపోవడంతో ఉన్నత విద్య చదివే అవకాశం కోల్పోవల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News July 16, 2024

ADB: కొడుకుపై తల్లి ఫిర్యాదు.. తిరుగివస్తుండగా మృతి

image

ఆదిలాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన విఠాబాయి (90), భర్త దేవ్‌రావు, కూతురు, అల్లుడితో కలిసి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కొడుకు గంగారాం తమను ఇంట్లోనుంచి గెంటేశాడని, సంవత్సరం నుంచి అన్నం పెట్టడంలేదని కలెక్టర్‌తో విన్నవించుకున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. కాగా తిరిగి వస్తుండగా ఆమె ఆటోలోనే చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు.

News July 16, 2024

ఆదిలాబాద్: భార్యను దారుణంగా చంపిన భర్త.. కారణమిదే.!

image

<<13633463>>భార్యను చంపి <<>>భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బేలలో జరిగిన విషయం తెలిసిందే. సైద్‌పూర్‌కి చెందిన లక్ష్మణ్(32), బోరిగాంకు చెందిన సునీత(28)ను 9ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. సునీతకు అక్రమసంబంధం ఉందని గొడవపడటంతో ఆమె కొన్ని పుట్టింటికి వెళ్లిపోయింది. సోమవారం పిల్లల టీసీ కోసం గ్రామానికి వచ్చిన ఆమెను లక్ష్మణ్ కత్తితో దారుణంగా గొంతు కోసి చంపినట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు.

News July 15, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యాంశాలు

image

★ ఆదిలాబాద్: గంటల వ్యవధిలో దొంగ అరెస్ట్
★ బేలా : భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం
★ కన్నెపల్లి : ఒకరి మృతికి కారకుడైన వ్యక్తికి జైలుశిక్ష
★ భైంసా : అక్రమంగా తరలిస్తున్న గుట్కా స్వాధీనం
★ ఆదిలాబాద్ : 16 లక్షల గుట్కా పట్టివేత
★ ఖానాపూర్: మున్సిపల్ సిబ్బందిపై తేనెటీగల దాడి
★ కుంటాల : 84 వాహనాలు స్వాధీనం
★ ఆదిలాబాద్ : కష్టం చెప్పుకొని.. కాటికి వెళ్లిన వృద్ధురాలు
★ కుబీర్: తాళం వేసిన ఇంట్లో చోరీ

News July 15, 2024

జన్నారం: కవ్వాలో అడవి దున్నల సందడి

image

కవ్వాల్ పులుల అభయారణ్యంలో అడవి దున్నలు సందడి చేస్తున్నాయి. కొంతకాలంగా కంటికి కనిపించకుండా పోయిన అడవి దున్నలు ఇప్పుడు బైసన్ కుంట వద్ద గుంపుగా వచ్చి మేత మేస్తున్నాయి. నీలుగాయి కుంట సమీపంలో, మైసమ్మకుంట వద్ద సేద తీరుతూ మరో అడవి దున్న కెమెరాకు చిక్కింది. సోమవారం అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసిన ఆడవి దున్నలు అధికంగా సందడి. చేస్తూ ఆకట్టుకున్నాయి. నిజానికి అడవిలోకి వెళ్లేందుకు ఇప్పుడు పర్యాటకులకు అనుమతి లేదు.

News July 15, 2024

ఆదిలాబాద్‌: పోస్టాఫీసులో 106 ఉద్యోగాలు

image

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్‌ డివిజన్‌లో 106 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM‌కు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
SHARE IT

News July 15, 2024

ADB: కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం: ఎంపీ

image

కేంద్ర ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీని పార్టీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. గతంలో తాను మంత్రి, ఎంపీగా ఉన్నప్పుడే జిల్లాతో పాటు ఇంద్రవెల్లి మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని ఎంపీ నగేష్ గుర్తు చేశారు.