India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడ సమీపంలో బుధవారం రెండు ద్విచక్ర ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న కేస్లాగూడ కు చెందిన మడవి రామ్ శావ్ (47) ను HYDకు రిఫర్ చేశారు. ఎదురుఎదురుగా వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులు మడావి బళ్ళు, ఉట్నూర్ కు చెందిన శ్రీను, నాగన్నలకు 108 ఈఎంటి ఆత్రం అశోక్ ప్రథమ చికిత్స చేసి రిమ్స్‌కు తరలించారు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి దంపతులు గాయాలపాలైన ఘటన బుధవారం రాత్రి మావల వద్ద జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తాంసీ మండలం పొన్నారికి చెందిన పోషట్టి- ఆశమ్మ లు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మావల సమీపంలోని జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన క్రషర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా 108 అంబులెన్స్ ఈఎంటీ విశాల్, పైలెట్ ముజ్జఫర్ వారికి ప్రథమ చికిత్స అందించి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఇంతకముందు ప్రజా పాలనలో గాని, గ్రామ సభలలో గాని రేషన్ కార్డు కోరకు దరఖాస్తు చేసుకున్నట్లైతే వారు మళ్ళీ మీసేవలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని డీఎస్ఓ వాజిద్ ఆలీ ఒక ప్రకటలో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నవారి జాబితా మండల తహసీల్దార్ల నుండి సేకరించమన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారు కొత్త రేషన్ కార్డ్ కోసం కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుట కోరకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించాలని అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. బుధవారం ప్రజాసేవ భవన్ లో కార్యక్రమం నిర్వహించారు. కష్టపడి పనిచేసినవారికి కాంగ్రెస్‌లో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పలువురు చేరారు.
ఆదిలాబాద్ జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బొంపెల్లి భూమన్న (59) గుండెపోటుతో మృతి చెందారు. ఆదిలాబాద్‌లోని వికలాంగుల కాలనీలో నివాసముంటున్న భూమన్న బుధవారం సాయంత్రం గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా భూమన్న ఆకస్మిక మరణంతో గంగపుత్ర సంఘం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
వేసవిలో తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమీషనర్ కృష్ణ ఆదిత్య సూచించారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రానున్న వేసవిలో జిల్లాలోని ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.
బజార్హత్నూర్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మండలంలోని కడెం వాగులో బుధవారం ఓ శవం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి హత్యా? లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉమ్మడి ADB, KNR, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.
కేయూ పరిధిలోని దూర విద్య ఎంఏ, ఎంకాం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి నిర్వహించనున్నారు. ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎంఏ జర్నలిజం, హెచ్ఆర్ఎం మొదటి సెమిస్టర్ ఈ నెల 20, 22, 24, 27, మార్చి 1, 3వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.