India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండలోని తన నివాసం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరానికి భారీగా స్పందన వచ్చింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వికలాంగులు, అభిమానులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రక్తదానం చేస్తూ ప్రతి ఒక్కరు కేసిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరంలో 700 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు.
పదో తరగతి ప్రత్యేక తరగతులపై మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మండలాల వారీగా పాఠశాలలకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. విద్యార్ధులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది మొదటి పుష్కర ఘాట్ వద్ద ఓ యువకుడు మృతి చెందిన ఘటన చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం రత్నల్లి గ్రామానికి చెందిన పవార్ బాలాజీ అనే యువకుడు గోదావరి నదిలో స్నానం చేస్తుండగా కాలుజారి నీటిలో పడడంతో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.
ఆదిలాబాద్‌లోని ఖుర్షిద్ నగర్‌కు చెందిన 32 ఏళ్ల వివాహిత అదృశ్యమైనట్లు 2 టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సెల్ ఫోన్ విషయంలో గొడవ జరగడంతో ఈ నెల 13న ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. తిరిగి రాకపోవడంతో ఆమె భర్త ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.
బోథ్ మండలంలోని పలువురు యువకులు వినూత్న ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల ప్రభుత్వం బీర్ల రేట్లు పెంచడంతో అసహనం వ్యక్తం చేశారు. వేసవి వస్తుందంటే చాలు ప్రభుత్వాలు బీర్లపై రూ.30 నుంచి రూ.40 వరకు పెంచుతున్నాయని ఆరోపించారు. దానికి నిరసనగా విద్యార్థి యూత్ సభ్యులు ఇకముందు తాము బీర్లు తాగబోమని ప్రతిజ్ఞ చేశారు. కటకం శ్రీకాంత్ కరిపే శ్రీనివాస్, సబ్బని కిషోర్ శివ, సాయి తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా మావలలో చోటుచేసుకుంది. SI విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వెంకటాపూర్‌కు చెందిన బానోత్ సంతోష్ (28) జైనూర్ మండలం జామిని గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా ఆదిలాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఎస్సీ వర్గీకరణ బిల్లును సవరించాలని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆదిలాబాద్‌లో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. షెడ్యూల్ క్యాస్ట్ అని విభజించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. రత్నజాడే ప్రజ్ఞ కుమార్, తదితరులున్నారు.
ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ప్రచార సభ కోసం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి దంపతులు మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ఆదివారం ఘన స్వాగతం పలికారు.
భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.
ADB, KNR, NZB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా భావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Sorry, no posts matched your criteria.