India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్క ఈనెల 20న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ సభలో మంత్రి పాల్గొననున్నారు. సభ ఏర్పాట్లను బుధవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి ఖుష్బూ గుప్తా, ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదివాసీ నేతలతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై <<16115277>>విషప్రయోగం<<>> చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ కథనం ప్రకారం.. గోండుగూడకు చెందిన సోయం కిష్టు నిర్మల్ సోదరుడి ఇంటి నుంచి పురుగుమందు తీసుకొచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి చల్లాడని అంగీకరించాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు కుటుంబ కలహాల కారణంగా మానసిక ఆందోళనతో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.

సోనాల మండలం సంపత్ నాయక్ తండాకి చెందిన జాదవ్ దేవిదాస్(45) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకి చెందిన దేవదాస్ మద్యానికి బానిసయ్యాడు. భార్య మందలించడంతో మనస్తాపం చెంది వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగాడు. బోథ్ CHCకి అక్కడి నుంచి ADB రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదైంది.

ఇటీవల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన నేరస్థుడిని సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటంతో పాటు పోలీసుల వైఖరిని విమర్శించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.ADB ఖుర్షీద్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్ పోలీసులను కించపరిచేలా పోస్టులు పెట్టాడు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించడంపై కేసు నమోదు చేశారు. నిందితుడు పెట్టిన ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే కేసు పెడతామన్నారు.

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ADBలోని డీఈఓ ఆఫీస్‌లో పరీక్ష నిర్వాహణ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు 518 మంది, ఇంటర్మీడియట్ పరీక్షకు 395 మంది అభ్యాసకులు హాజరవుతారన్నారు. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డెర కాలనీలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో రూ. 2,200 విలువైన మూడు లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ మేరకు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న రాజుపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జొన్నల కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని ప్రతి జొన్న రైతుకు మద్దతు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అమ్ముతున్న వివరాలను పొందుపరచాలని మార్కెటింగ్ శాఖకు ఎప్పటికప్పుడు సమర్పించాలని సూచించారు.

మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ADB జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. బేల మండలం పాటన్ గ్రామానికి చెందిన ఆకాష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో బైక్‌పై మహారాష్ట్రకు మంగళవారం వెళ్తుండగా గడ్‌చందూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

3 ఏళ్ల చిన్నారి కడుపులోని బ్యాటరీని బయటకు తీసి కాపాడారు వైద్యులు. ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని తీసి అందరి మన్ననలు పొందారు. శ్రీరాంపూర్‌కు చెందిన రాజ్ కుమార్-మౌనిక దంపతుల కుమారుడు ఆదిత్య. 2 నెలల కిందట బటన్ బ్యాటరీ మింగాడు. కడుపులో మంట, నొప్పితో పలు ఆసుపత్రిలో చూపించినా నయం కాలేదు. డా.సతీశ్‌చందర్ ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని గుర్తించి బయటికి తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.

జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్ ప్లస్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. డైట్, బీఎడ్ ఛాత్రోపాధ్యాయుల ద్వారా క్షేత్రస్థాయి విద్యార్థుల నమోదు, హాజరు సంఖ్య, మౌలిక వసతుల వంటి అంశాలపై 585 పాఠశాలల్లో సర్వే చేయనున్నారు. జిల్లాకు సర్వే చేయడానికి 59 మందిని ఎంపిక చేసి ఇదివరకే శిక్షణను ఇచ్చారు. సర్వే ద్వారా అవసరమైన వసతులు కల్పించనున్నారు.
Sorry, no posts matched your criteria.