India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో మహిళని మావల పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. NZBకు చెందిన స్వరూప అనే మహిళ ADBలోని రాంనగర్‌కు చెందిన సాయితేజకు వెటర్నరీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.50 లక్షలు తీసుకుంది. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోగా రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తోంది. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
యాపల్‌గూడ ప్రాధమిక పాఠశాలలో గురువారం బాల వికాస్ వాటర్ ప్లాంట్, లైబ్రరీలను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు.ఈ సందర్భంగా రీడింగ్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. రాష్ట్రంలోనే యాపల్‌గూడ బడి బెస్ట్ స్కూల్ అని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో DEO ప్రణీత, MEO నర్సయ్య, HM గంగయ్య, గ్రామ పెద్దలు, పేరెంట్స్, అధికారులు పాల్గొన్నారు.
భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో చిరుత పులి కదలిక పై ఎఫ్ఎస్వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవో శ్రీనివాస్ స్పందించారు. నిపాని శివారులోని లింగారెడ్డి అనే రైతుకు చెందిన పంట చేనులో చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డయిందన్నారు. గురువారం పంట చేనుకు వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్‌కి చెందిన షేక్ ఆసిఫ్ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.
ఏడాది క్రితం ప్రేమ పేరుతో <<12630813>>యువతిని హత్య<<>> చేసిన వ్యక్తికి నిర్మల్ జిల్లా కోర్టు జీవితకాల శిక్ష, విధించింది. పోలీసులు వివరాలు.. ఖానాపూర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ అదే కాలనీకి చెందిన అలేఖ్యను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె నిరాకరించడంతో ద్వేషం పెంచుకున్నాడు. ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో విషయం తెలుసుకున్న శ్రీకాంత్ 2024 ఫిబ్రవరి 8న ఆమెను కత్తితో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు.
శాంతినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఆసిఫ్‌పై 1 TOWN PSలో అట్రాసిటీ, రేప్ కేసు నమోదైంది. CI సునీల్ వివరాల ప్రకారం.. ఆసిఫ్ ప్రేమపేరుతో వెంబడిస్తూ ఓ యువతిని బెదిరించగా ఆమె నిరాకరించింది. ఆమెను బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లి గదిలో బంధించాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకొని వీడియోలు తీశాడు. పెళ్లి చేసుకోకుంటే వీడియోలు లీక్ చేస్తానని కులంపేరుతో దూషించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.
కరెంట్ షాక్‌తో ADBకు చెందిన బాలిక మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న తహ్రీం గత నెల 18న తన ఇంటి డాబా పైకి వెళ్లింది. ఈ క్రమంలో డాబాపై నుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో కరెంట్ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబీకులు రిమ్స్‌కు, అక్కడి నుంచి మహారాష్ట్రలోని వార్ధాకు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం బాలిక మృతి చెందింది.
పైలెట్ ప్రజావాణి, బహిరంగ విచారణలో ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాజస్థాన్ నుంచి వచ్చిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్, సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ నిఖిల్ డేతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజావాణి, బహిరంగ విచారణలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందనడంతో కలెక్టర్‌ను వారు అభినందించారు.
ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ (36) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. సంవత్సరం నుంచి ఆయన రక్తహీనతతో బాధపడుతున్నారు. కాగా బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.