Adilabad

News February 11, 2025

ADB: FEB 18న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

image

ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 18న సబ్-జూనియర్ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రఘుపతి, రాష్ట్రపాల్ తెలిపారు. ఎంపికైన జిల్లా జట్టు వికారాబాద్ జిల్లాలోని 34వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హులైన క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు.

News February 11, 2025

ADB: ఆమెపైన చీటింగ్ కేసు నమోదు చేయండి: నవీన్

image

ఏక కాలంలో రెండు రెగ్యులర్ కోర్సులు కలిగి టీచర్ ఉద్యోగం పొందిన సౌజన్యపైన న్యాయ విచారణ జరిపించాలని ప్రజావాణికి తాంసి మండలానికి చెందిన అభ్యర్థి నవీన్ కుమార్ కోరారు. ఒక సాధారణ విద్యార్థిగా సుమారు 350 కి.మీ దూరంగా ఉన్న వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి రెండు కోర్సులు చేయడం సాధ్యం కాదన్నారు. ఆమె తప్పుడు సర్టిఫికెట్ పెట్టి అధికారులను తప్పుదోవ పట్టించిందన్నారు. చీటింగ్ కేసు నమోదు చేయలన్నారు.

News February 11, 2025

ADB: ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసిన ప్రజ్ఞ కుమార్

image

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రత్నజాడే ప్రజ్ఞ కుమార్ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

News February 11, 2025

ADB ఐటీ టవర్ పనులను పూర్తి చేయాలి : మాజీ మంత్రి

image

ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన ఐటీ టవర్ అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జయేశ్ రంజన్ ను హైదరాబాద్‌లో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఐటీ పరిశ్రమలను పట్టణాలకు విస్తరించాలని గత ప్రభుత్వం జిల్లాకు 2022లో ఐటీ టవర్ మంజూరు చేసిందన్నారు. కానీ ఇప్పటికి పనులు పూర్తి కాలేదన్నారు.

News February 11, 2025

రేషన్ కార్డు డేటా ఎంట్రీ 2రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

image

రేషన్ కార్డు డేటా ఎంట్రీ, ఇందిరమ్మ ఇళ్లు, పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణలపై సోమవారం ADB కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డులు, ఇందిరమ్మఇళ్లకు సంబంధించి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి వివరాలను డేటా ఎంట్రీ రెండురోజుల్లో పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత తహశీల్దార్లపై చర్యలు తీసుకుంటామన్నారు.

News February 10, 2025

ADB: పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా బంద్

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు సోమవారం తెలిపారు. రైతుల ఆధార్ వెరిఫికేషన్‌లో పలు సాంకేతిక సమస్యల రీత్యా కొనుగోళ్లు నిలిపివేసినట్లు వెల్లడించారు. తర్వాత కొనుగోళ్లు తేదీని వెంటనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై రైతులు సహకరించాలని కోరారు.

News February 10, 2025

ఇచ్చోడ: 53 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

image

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 53 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ పాఠశాలలో 1972-73 10వ తరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 23 మంది విద్యార్థుల్లో 7గురు మరణించగా మిగిలిన 17 మంది పూర్వ విద్యార్థులు కలుసుకోవడం విశేషం. పాఠాలు చెప్పిన గురువులలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు పోశెట్టిని సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

News February 10, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News February 10, 2025

ADB: జిల్లాలో MPTC, ZPTC స్థానాలు ఇవే!

image

ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ, 166 ఎంపీటీసీ, సర్పంచ్ 473, వార్డులు 3,834 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 11న పోలీంగ్ కేంద్రాల ముసాయిదా విడుదల కానుంది. కాగా ఈ నెల 15 లోపు ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.

News February 10, 2025

ఇండియన్ ఐడిల్‌లో ADB జిల్లా యువతి ప్రతిభ

image

ఇండియన్ ఐడిల్ తో పాటు జీ తెలుగు వారు నిర్వహించిన సరిగమ సూపర్ సింగర్స్ ఫైనల్ పోటీల్లో ఆదిలాబాద్ యువతి మొదటి స్థానంలో నిలిచారు. అదిలాబాద్ భుక్తాపూర్ కాలనీకి చెందిన యువతి అభిజ్ఞ ఆదివారం జరిగిన ఫైనల్లో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటారు.  దీంతో కౌన్సిలర్ బండారి సతీష్, కాలనీ వాసులు యువతికి అభినందనలు తెలిపారు.

error: Content is protected !!