Hyderabad

News September 4, 2025

HYD- ఆమ్‌స్టర్‌డామ్ విమాన సర్వీసులు

image

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేరుగా ఆమ్‌స్టర్‌డామ్‌ షిపోల్‌ విమానాశ్రయంతో కలిపే కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి. తొలి విమానం బుధవారం బయలుదేరింది. బోయింగ్‌ 777- 200 ER విమానంతో వారానికి మూడు సర్వీసులు ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి ఈ మార్గంలో సేవలు ఉన్నాయి. ఈ నిర్ణయం వ్యాపార, ప్రయాణ సౌలభ్యానికి తోడ్పడనుందని పలువురు చెబుతున్నారు.

News September 4, 2025

HYDలో వీధికో పేపర్ బాయ్ ఉంటాడేమో!

image

HYDలో వీధికో పేపర్ బాయ్ ఉంటాడంటే అతిశయోక్తి కాదేమో. సిటీలో చదువుకునే, ఉద్యోగాలు చేసేవారికి పార్ట్ టైమ్ డ్యూటీగా ఏళ్లుగా ఎందరికో ఉపాధినిస్తోంది. నగరంలో ఉదయాన్నే మెయిన్ పేపర్లో జిల్లా ఎడిషన్ జోడిస్తూ హడావుడిగా కనిపిస్తుంటారు. వీరిలో న్యూస్ పేపర్లు చదివే ఉద్యోగాలు పొందినవారు ఉన్నారు. ఉదయాన్నే పేపర్ మనవాకిలికి చేరడంలో వీరి పాత్రే కీలకం. వారి సేవలను ప్రపంచ పేపర్ బాయ్స్ డే సందర్భంగా గుర్తుచేసుకుందాం.

News September 4, 2025

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడిపై త్రిపుర ఎమ్మెల్యే ఫిర్యాదు

image

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుమారుడు ప్రతీక్‌పై త్రిపుర ఎమ్మెల్యే ఫిలిమ్ కుమార్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతిక్‌తో పాటు నలుగురు యువకులు వచ్చి తనను, తన కుటుంబాన్ని బెదిరించారని పేర్కొన్నారు. 400 మందిని తీసుకువచ్చి గొంతుకోసి చంపేస్తామని బెదిరించారని త్రిపుర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే ప్రతీక్, మరికొందరు పోలీసులకు లొంగిపోవడంతో బెయిల్ మంజూరైంది. 

News September 4, 2025

HYD: రూ.292 కోట్లు అప్పగించాం: శిఖా గోయల్

image

సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు గతేడాది రూ.292 కోట్లు రికవరీ చేసి అప్పగించామని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ తెలిపారు. సోమాజిగూడలోని ఓ హోటల్‌లో సైబర్‌ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అప్రమత్తతతోనే సైబర్‌ నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ఇప్పటివరకు 43,000 సిమ్‌లు, 14,000 IMEIలు, 8,000 URLలు బ్లాక్‌ చేశామన్నారు.

News September 4, 2025

HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు

image

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు HYD నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ సంస్థ డైరెక్టర్ డా.విమలారెడ్డి తెలిపారు. కోర్సుల్లో చేరడానికి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
# SHARE IT

News September 4, 2025

బల్కంపేట ఎల్లమ్మ ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

image

బల్కంపేట ఎల్లమ్మ ఆలయం హుండీలను అధికారులు లెక్కించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.  హుండీల ద్వారా రూ.86.39 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. అన్నదానానికి రూ.1,81,734 వచ్చాయన్నారు. 122 అమెరికా డాలర్లు, ఒక మలేషియా, 15 కథార్, ఒక యూరో, యూఏఈ, 65 చైనా, ఒక బెహరిన్ కరెన్సీ, మిక్స్‌డ్‌ బంగారం, వెండి ఆభరణాలను భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

News September 4, 2025

ఈ నెల 6న సాలార్జంగ్‌ మ్యూజియం బంద్

image

నగరంలోని సాలార్జంగ్ మ్యూజియానికు ఈనెల 6వ తేదీన సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆరోజు గణేశ్ శోభయాత్ర, నిమజ్జనోత్సవాలలు నిర్వహించనున్న నేపథ్యంలో మ్యూజియం సందర్శన నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్‌‌గా సందర్శకులకు అనుమతిస్తామని పేర్కొన్నారు.

News September 4, 2025

HYD: బైక్, కారు కడిగాడు.. రూ.10 వేల జరిమానా

image

బంజారాహిల్స్‌లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై HMWSSB చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్‌ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. ఇక ఉదయాన్నే ఈ నీటితో రోడ్లు, ఇంటిపరిసరాలు కడిగేవారూ.. జాగ్రత్త నెక్ట్స్ మీ వంతే.

News September 4, 2025

HYDలో 6వ తేదిన బిగ్గెస్ట్ TASK

image

నగరంలో ఈ నెల 6న జరిగే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పోలీసులకు బిగ్గెస్ట్ టాస్క్. భక్తులకు ఇది అతిపెద్ద శోభాయాత్ర. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు అధికారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ఏర్పాట్లపై కసరత్తులు చేసి పక్కా రూట్ మ్యాప్‌ను రిలీజ్ చేశారు. ఖైరతాబాద్- పాత సైఫాబాద్ PS- ఇక్బాల్ మినార్- తెలుగు తల్లివిగ్రహం- అంబేడ్కర్ విగ్రహం- ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనానికి తరలించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News September 4, 2025

HYD: బైక్, కారు కడిగాడు.. రూ.10 వేలు జరిమానా

image

HYD బంజారాహిల్స్‌లో తాగునీటిని అప్రయోజనాలకు వాడిన ఇద్దరిపై హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. బైక్, కారు కడిగిన వ్యక్తికి రూ.10,000, నీరు ఓవర్‌ఫ్లో అయ్యేలా వదిలిన మరొకరికి రూ.5,000 జరిమానా విధించింది. తాగునీరు వినియోగం కోసం మాత్రమేనని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు.