Hyderabad

News June 24, 2024

HYD: ORR లోపల IT కంపెనీలకు ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్‌బాబు

image

రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు – సమ్మిళిత అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని 3జోన్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. ORR లోపల IT కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.

News June 24, 2024

ఇంటర్‌ ఫలితాలు: హైదరాబాద్‌‌లో పాసైన విద్యార్థుల LIST

image

తెలంగాణ‌లో ఇంటర్‌ సప్లిమెంటరీ‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌ జిల్లాలోని మూడు సెక్టార్‌(HYD-1, HYD-2, HYD-3)లు కలిపి 1st ఇయర్‌లో 42,390 మంది పరీక్ష రాశారు. ఇందులో 23,557 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 32,672 మందికి 10,682 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఫస్టియర్‌లో 55.57 శాతం, సెకండియర్‌లో అత్యల్పంగా 32.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.

News June 24, 2024

HYD: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ

image

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్ రాస్‌‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గత 2 వారాలుగా GHMCకి ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్‌ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.
SHARE IT

News June 24, 2024

HYD: పెళ్లి చూపులు.. అంతలోనే విషాదం!

image

పెళ్లి చూపులకు‌ ప్రయాణమైన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. జూబ్లీహిల్స్ PS పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా చిన్నంబావి మం. లక్ష్మీపల్లి వాసి శివశంకర్ నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్. ఆదివారం పెళ్లిచూపులు ఉండడంతో శనివారం రాత్రి బైక్ పై స్వగ్రామానికి బయల్దేరాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్ 1 వద్ద ఓ టిప్పిర్ ఢీ కొట్టడంతో మృతి చెందాడు.

News June 24, 2024

హైదరాబాద్‌ శివారులో మాజీ MPTC హత్య

image

హైదరాబాద్ శివారు‌లో మాజీ MPTC హత్యకు గురయ్యారు. ఘట్‌కేసర్ PS పరిధిలో ఉండే మహేశ్ (40) ఈ నెల 17న బయటకువెళ్లి తిరిగిరాలేదని ఆయన సోదరుడు విఠల్ PS‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా NFCనగర్‌ డంపింగ్ యార్డు వద్ద మహేశ్ మృతదేహం గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 24, 2024

HYDలో డ్రైవింగ్.. సెల్‌ఫోన్ మోగితే ఎత్తకండి!

image

హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు‌ రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు‌ నిర్వహిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ ఎదుట ఉన్న సిగ్నల్‌ ఫ్రీ లెఫ్ట్‌ వద్ద‌ ఓ బోర్డు పెట్టారు. ‘వాహనం నడి‌పేటప్పుడు సెల్‌ఫోన్ మోగితే దయచేసి ఎత్తకండి. బహుశా అది యముని పిలుపు కావొచ్చు’ అంటూ‌ హెచ్చరించారు.‌ ఇటీవల సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.‌ ఫాలో ట్రాఫిక్ రూల్స్.

News June 23, 2024

HYD: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు

image

ప్రేమిస్తున్నాను అంటూ ఇంటర్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన యువకుడి పై నారాయణగూడ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సైఫాబాద్ ప్రాంతానికి చెందిన ఖలీల్ నారాయణగూడలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి ప్రేమిస్తున్నానని చెప్పి అత్యాచారం చేశాడు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖలీల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు

News June 23, 2024

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా 292 ద్విచక్ర వాహనాలు, 11 ఆటోలు, 80 కార్లు, రెండు హెవీ వెహికల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ఐటీ కారిడార్‌లో 182 మంది మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారన్నారు.

News June 23, 2024

HYD: ఇలా బండి నడిపితే మూడేళ్లు జైలుకే..!

image

గ్రేటర్ HYD వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక నుంచి రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని హెచ్చరించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాదాలను నివారించేందుకు రాంగ్ రూట్ డ్రైవర్లపై ప్రత్యేక దృష్టి సారించామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. SHARE IT

News June 23, 2024

HYD: గాంధీ ఆస్పత్రిలో వృద్ధులకు ప్రత్యేక వార్డులు: సూపరింటెండెంట్ 

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మొత్తం 40పడకలతో ఏర్పాటు చేస్తున్న వార్డులను పురుషులు, మహిళలకు వేర్వేరుగా 20పడకలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వార్డుల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా సుందరంగా ముస్తాబు చేస్తున్నామని, త్వరగా వాటిని తీర్చిదిద్ది మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు.