India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విధి నిర్వహణలో చర్యలు తీసుకోవడమే కాదు.. ఆపద వస్తే చలించిపోతామని అల్వాల్ ట్రాఫిక్ ACP వెంకటరెడ్డి నిరూపించారు. ఇటీవల సుచిత్ర వద్ద రాంగ్ రూట్‌లో వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సిబ్బంది చలానాలు వేస్తున్నారు. ఓ డెలివరీ బాయ్ తప్పించుకునేందుకు హడావుడిగా వెళ్తూ మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇతర వాహనదారుడు కింద పడిపోయాడు. క్షతగాత్రుడికి ACP సపర్యలు చేశారు. ఆయన సేవల పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.
HYDలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి, 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం రెండోదశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్‌లో ప్రసంగంలో పేర్కొన్నారు.
HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద పని చేసే ముత్తుస్వామి(35)తో ఓ గుర్తుతెలియని వ్యక్తి గొడవపడ్డాడు. మాటామాట పెరగగా క్షణికావేశంలో ఆ వ్యక్తి ముత్తుస్వామి తలపై బండరాయితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అగ్నిమాపక శాఖలో కొత్తగా చేరి శిక్షణ పూర్తి చేసుకున్న 483 ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్ నేడు జరగనుంది. వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ శిక్షణ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఇటీవల డ్రైవర్, ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన 157 మంది అభ్యర్థులు కూడా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటారని అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు.
ట్యాలెంట్ ఉన్న ఎందరికో ‘హైదరాబాద్’ లైఫ్ ఇచ్చింది. ఇక్కడ శిక్షణ తీసుకొని నేడు ఏడుగురు ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. AP, TGలో 8 మంది సెలక్ట్ అవగా అందులో ఏడుగురు HYDలో శిక్షణ తీసుకున్నవారే . PV సింధు, నిఖత్ జరీన్ లాంటి అంతర్జాతీయ క్రీడాకారులకూ నగరంతో అనుబంధం ఉంది. సాత్విక్ సాయిరాజ్, శ్రీజ, ఇషా సింగ్, జ్యోతి, దండిజ్యోతిక శ్రీ కూడా ఈ ఒలింపిక్స్‌లో అదరగొట్టి ఇంకా గొప్ప స్థాయికి చేరాలని ఆశిద్దాం.
HYD అభివృద్ధిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వాదోపవాదాలు చేస్తున్నారు. నగరంలో ఫ్లై ఓవర్లు తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అభివృద్ధి జరగలేదని తేల్చి చెప్పారు. దీనిపై హరీశ్ రావు ఘాటుగా బదులిచ్చారు. లోకం అంతా హైదరాబాద్‌ను మెచ్చుకుందన్నారు. కాంగ్రెస్ గజినీలకు ఇది కనిపించదని ఎద్దేవా చేశారు. మరి గత 10 ఏళ్లలో నగర అభివృద్ధిపై హైదరాబాదీగా మీ కామెంట్?
TGSRTC E-గరుడ బస్సులను రాజధాని AC బస్సు ధరలోనే నడపాలని యజమాన్యం నిర్ణయించినట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు బుకింగ్ చేసిన ప్రయాణికులకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు, ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ నేడు సచివాలయంలో బోనాల వేడుకలను నిర్వహించనున్నారు. సచివాలయ ఆవరణలోని నల్లపోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో సచివాలయంలోని ద్వారాల వద్ద అమ్మవారు, ఆదిశేషుడు తదితర ప్రతిమలను ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగులు గురువారం మధ్యాహ్నం బోనాల వేడుకల్లో పాల్గొంటారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ నిధుల కేటాయింపు వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు వెల్లడించారు. HYD నగరానికి కేటాయించిన బడ్జెట్ వివరాలు ఇలా ఉన్నాయి. ✓HYD అభివృద్ధికి రూ.10,000 కోట్లు ✓RRR(రీజినల్ రింగ్ రోడ్డు)- రూ.1525 కోట్లు ✓మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్- రూ.1500 కోట్లు ✓వాటర్ బోర్డు కోసం రూ.3,385 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో పలువురు వైద్యులు బదిలీ కావడంతో కంటి చూపు పరీక్షల కోసం వచ్చిన సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలోని సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు ప్రొ.డాక్టర్లు, నలుగురు అసోసియేట్ డాక్టర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్లు, ఫార్మాసిట్, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, సిస్టర్స్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, స్వేకుంట్, గ్లకోమా అండ్ కార్నియాను సంబంధించిన సిబ్బంది బదిలీపై వెళ్లారు.
Sorry, no posts matched your criteria.