India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BRS ముఖ్యనేతలు హరీశ్ రావు, సంతోశ్‌రావులపై కవిత తీవ్ర విమర్శలు చేయడంపై TPCC అధికారిక ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి X వేదికగా స్పందించారు. ‘KCRకు వెన్నుపోటు పొడుస్తుంది.. హరీశ్, సంతోష్ రావులేనని కవిత చెప్పింది. వీరిద్దరు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని భవిష్యత్తులో ఎపిసోడ్‌లుగా కవితక్క బయటపెట్టనున్నారు. ఇకపై కవితక్క పేలుస్తుంది చూడండి లక్ష్మీ బాంబులు. హ్యాపీ దీపావళి పింకీస్’ అని ట్వీట్ చేశారు.
60 రకాల వైద్యపరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చే ATMను ఢిల్లీకి చెందిన క్లినిక్స్ ఆన్ క్లౌడ్ అంకుర సంస్థ రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టుగా కింగ్ కోఠిలోని జిల్లా ఆస్పత్రి, మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ATMలను ఏర్పాటు చేసింది. ఈ ATMలో అనేక రోగ నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని, ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోగులకు ATMపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇది సక్సెస్ అయితే మరిన్ని ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు.
ఐటీ హబ్‌గా మారడంతో మాదాపూర్, గచ్చిబౌలిలో నివాస గృహాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు గ్రామంగా ఉన్న మాదాపూర్, ఇప్పుడు భారీ గ్లాస్ టవర్లు, అపార్ట్‌మెంట్లతో నిండిపోయింది. నాలుగేళ్ల క్రితం రూ.23 వేలు ఉన్న 2BHK ఫ్లాట్ అద్దె ఇప్పుడు రూ.35 వేలకు చేరింది. గేటెడ్ కమ్యూనిటీలోని 3BHK అద్దె రూ.50 వేలకు పెరిగింది. ఐటీ కంపెనీల విస్తరణే ఈ అద్దెల పెరుగుదలకు ప్రధాన కారణమని రియల్టర్‌ల అంచనా.
HYD, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రాబోయే 3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రజలకు అలర్ట్‌లు పంపించింది. 30- 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
SEP 6న జరగనున్న HYD ఖైరతాబాద్, ఇతర ప్రాంతాల గణపతుల నిమజ్జనానికి విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని TGSPDCL MD ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. 68 కంట్రోల్ రూమ్‌లు, 104 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. తీగల మరమ్మతులు, ఎర్తింగ్ పనులు పూర్తి చేసి, ప్యూజ్ బాక్స్‌ల వద్ద PVC పైపులు, ప్లాస్టిక్ షీట్లు అమర్చినట్లు వివరించారు.
నకిలీ కాల్స్‌తో ఉద్యోగులను మోసగాళ్లు భయపెడుతున్న నేపథ్యంలో ACB హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ 91548 93428 నంబర్ నుంచి కాల్స్ చేసి బెదిరిస్తున్నట్లు సైఫాబాద్ PSలో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. అధికారులు ఎప్పుడూ డబ్బులు అడగరు, నకిలీ కాల్స్ నమ్మొద్దు, డబ్బులు చెల్లించొద్దంటు ఏసీబీ సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలంది.
HYDలో GST/కస్టమ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనీయర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్లు లంచం కేసులో అరెస్టు చేశారు. రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి ₹30,000 లంచం డిమాండ్ చేశారు. చర్చల తర్వాత ₹25,000కు ఒప్పుకున్నారు. సీబీఐ బృందం రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేసింది. నిందితుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.
సీపీ సీవీ ఆనంద్ గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల భద్రతా ఏర్పాట్లపై HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోనల్ ఆఫీసర్లు, లా & ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతో భద్రత ఏర్పాట్లను పటిష్ఠంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలంటూ పలు ప్రాంతాలకు చెందిన వారు ప్రజాభవన్‌లో వినతిపత్రాలు అందజేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో 243 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అత్యధికంగా 87 మంది ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 33, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 57, మిగతా సమస్యలపై 66 మంది వినతిపత్రాలు ఇచ్చారని ప్రజావాణి ఇన్‌ఛార్జ్ చిన్నారెడ్డి తెలిపారు.
HYDలో మరో పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటు కానుంది. MGBS మెట్రో స్టేషన్‌లో ఈ నెల 15, 16న దీనిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నగరంలో 3 PSKలు ఉండగా పాత బస్తీతో పాటు తూర్పుభాగంలో ఉండే ప్రజలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది. MGBS మెట్రో స్టేషన్ మొదటి అంతస్తులో ఈ కార్యాలయం అందుబాటులోకి రానుంది. దీనిని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, సహాయక మంత్రి గానీ ప్రారంభించనున్నారు.
# SHARE IT
Sorry, no posts matched your criteria.