Hyderabad

News July 14, 2024

హైదరాబాద్‌లో NDRF బృందాలను దించండి: దాన కిషోర్

image

నగరంలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పర్యటించారు. నగరంలోని శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలైన దుర్గంచెరువు, నెట్రన్ గార్డెన్‌కు వెళ్లారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలన్నారు.

News July 14, 2024

HYD: రేపు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు.. హై టెన్షన్

image

నిరుద్యోగుల డిమాండ్‌ల సాధన కోసం రేపు విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య, బీసీ జన సభ‌లు‌ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ప్రతి ఒక్క నిరుద్యోగి పాల్గొని నిరసన తెలియజేయాలని బీసీ నాయకులు కోరారు. రేపటి కార్యక్రమానికి భారీ ఎత్తున సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. రేపటి సెక్రటేరియట్‌ ముట్టడి పిలుపుతో నగరంలో హైటెన్షన్ నెలకొంది.

News July 14, 2024

HYDలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశాలు

image

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్‌లు, EVDM టీమ్‌లతో మేయర్ గద్వాల విజయ లక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

News July 14, 2024

అనంతగిరికి పోటెత్తిన హైదరాబాదీలు

image

అనంతగిరికి పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో వికారాబాద్ జిల్లాకు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం ప్రఖ్యాత శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టు‌లో బోటింగ్‌ ఉండడంతో‌ టూరిస్టులతో సందడిగా మారింది.

News July 14, 2024

HYD: ఈత మొక్కలను నాటిన సీఎం

image

గీత కార్మికులకు కాటమయ్య రక్ష కవచాలను అందించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక తాటి వనంలో ఈత మొక్కలను స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి నాటారు. అనంతరం కాటమయ్య రక్ష కవచాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

News July 14, 2024

HYD: డ్రైవింగ్ చేస్తున్నారా..? ఇది మీకోసమే!

image

డ్రైవింగ్ చేసే వారికి HYD రాచకొండ పోలీసులు పలు సూచనలు చేశారు. ఓటు హక్కు కోసం 18, ఉద్యోగం కోసం 25, పెళ్లి కోసం 25-30 ఏళ్లు వేచి ఉంటాం.. కానీ ఓవర్టేక్ చేసే సమయంలో, వాహనాలు నడుపుతున్నప్పుడు 30 సెకండ్లు కూడా ఆగలేకపోతున్నాం ఎందుకని..? దయచేసి సరైన వేగం సరైన దిశలో నడిపి హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి, సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

News July 14, 2024

HYD: నిజాం నాటి నుంచి నేటి వరకు!

image

నిజాం రాష్ట్ర ప్రజల కోసం 1932లో HYD నిజాం నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ NSR-RTD పేరిట మొదటిసారిగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రారంభించినట్లు TSIC తెలిపింది. అప్పట్లో 27 బస్సులు, 166 ఉద్యోగులతో మొదలైన రవాణా వ్యవస్థ.. TGSRTC గా నేడు ఏకంగా 9,000 పైగా బస్సులతో, 44 వేల మందికి పైగా ఉద్యోగులతో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను రోజు గమ్య స్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపింది.

News July 14, 2024

HYD: మహిళలకు ఉచితంగా ఆటో రిక్షా ట్రైనింగ్!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనిచ్చేందుకు వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఎండీ కాంతి వెస్లే వెల్లడించారు. 100 మంది మహిళలకు అవకాశం కల్పిస్తామని, డ్రైవింగ్ లైసెన్స్, సొంత ఎలక్ట్రిక్ వాహనం మైక్రో లోన్ అందిస్తామన్నారు. కూకట్‌పల్లిలోని మోనో ప్రాంగణంలో ట్రైనింగ్ అందిస్తామన్నారు.

News July 13, 2024

HYD: అమ్మ మాట.. అంగన్వాడి బాట షెడ్యూల్..!

image

✓ జులై 15,16వ తేదీల్లో గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అంగన్వాడీల్లో చేర్చాలని కోరుతారు. ✓18న ఇంటింటికి వెళ్లి రెండున్నర ఏళ్ల చిన్నారులను గుర్తిస్తారు. ✓19న స్వచ్ఛ అంగన్వాడీ పేరిట కేంద్రాలను శుభ్రం చేసి, మొక్కలు నాటుతారు. ✓20న ఎర్లీ చైల్డ్ హుడ్ డెవలప్మెంట్, సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు.

News July 13, 2024

HYDలో ‘అమ్మ మాట..అంగన్వాడి బాట’

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడి కేంద్రాల్లోనే జరగనుంది. జూలై 15 నుంచి 20 వరకు ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం జరగనుంది. ప్రస్తుతం రెండున్నర ఏళ్ల పిల్లలు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు, ఆట పాటలతో కూడిన విద్య అందించడమే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లక్ష్యంగా జిల్లాల అధికారులు తెలిపారు.