Hyderabad

News February 8, 2026

బిల్లుల స్వీపింగ్: GHMCలో దోపిడీ!

image

నగర రోడ్లు క్లీన్ అవుతున్నాయో లేదో గానీ బడాబాబుల జేబులు ఫుల్ అవుతున్నాయి!. మెకానికల్ స్వీపింగ్ మెషీన్ల పేరుతో నెలకు రూ.కోట్ల ప్రజాధనం పక్కదారి పడుతోంది. అసలు 30 మెషీన్లు షెడ్డు దాటకుండానే GPS డేటాను ట్యాంపర్ చేసి బిల్లులు దండుకుంటున్నారు. ఇది GHMC ఇంటర్నల్ విచారణలో తేలినట్లు టాక్. నెలకు రూ. 12 కోట్ల బడ్జెట్‌లో సింహభాగం కాంట్రాక్టర్లు, అధికారుల పాలవుతున్నట్లు GHMC బాస్ దృష్టికి వచ్చినట్లు సమాచారం.

News February 8, 2026

HYD: OYOలో ట్రాన్స్‌జెండర్లతో వ్యభిచారం

image

అసాంఘిక కార్యకలాపాలపై మల్కాజిగిరి పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా OYO హోటల్ నిర్వాహకులు కొత్త దందాకు తెరలేపి పోలీసులకు చిక్కారు. చైతన్యపురి పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి OYO అనుబంధ లాడ్జిలో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ట్రాన్స్‌జెండర్లతో కలిసి ఈ దందా చేస్తున్నట్లు విచారణలో తేలింది. సదరు లాడ్జిని సీజ్ చేసినట్లు SHO సైదులు తెలిపారు.

News February 8, 2026

HYD: రిపబ్లిక్ డే‌లో అదరగొట్టారు!

image

రిపబ్లిక్ డే క్యాంప్‌లో అదరగొట్టిన ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ క్యాడెట్లను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోక్ భవన్‌లో మనస్ఫూర్తిగా అభినందించారు. గుర్రపు స్వారీలో పతకాల పంట పండించడంతో పాటు, సాంస్కృతిక ప్రదర్శనలతో దేశాన్ని మెప్పించిన తీరు సూపర్ అని కొనియాడారు. క్రమశిక్షణతో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

News February 7, 2026

ఉప్పల్‌లో రేపు మెగా సెమినార్

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్‌లోని SriRasthu Convention‌లో రేపు ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు

News February 7, 2026

HYD: అదుపు తప్పిన కారు.. ఇద్దరు మృతి

image

HYD శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు పరిధి పోచారం ORR మీదుగా బౌరంపేట వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నవీన్, మౌనికగా పోలీసులు గుర్తించారు. మరో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూ పార్క్ నుంచి ఇంటికి వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం.

News February 7, 2026

HYD: వీకెండ్‌లో ఇక్కడికి వెళ్లండి!

image

వీకెండ్‌లో అనంతగిరి కొండల్లో ‘ది బ్రీజ్’ పేరుతో సరికొత్త ఎకో టూరిజం ప్యాకేజీని TGFDC లాంచ్ చేసింది. విలాసవంతమైన టెంట్‌లు, అడవి మధ్యలో ‘బుష్ బ్రేక్‌ఫాస్ట్’, గైడెడ్ సఫారీ, ట్రెక్కింగ్, Bird View ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అడవి అందాలను ఆస్వాదిస్తూనే పర్యావరణాన్ని కాపాడేలా ఈ టూర్‌ను డిజైన్ చేశారు. ఈ టూర్ మీకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముగ్గురికి రూ.5000. ఇక సర్దేయండి.
Site: deccanwoodsandtrails.com

News February 7, 2026

హైదరాబాద్ శివార్లలో రిజిస్ట్రేషన్ల‌కు బ్రేక్?

image

‘భూ భారతి’ కోసం ప్రభుత్వం ఒక అప్రకటిత ‘స్టాప్ ఆర్డర్’ జారీ చేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వివాదాస్పదంగా ఉన్న సుమారు 45 వేల ఎకరాల డేటా ఎంట్రీ పూర్తికాక ముందే కొత్త సర్వే నం. కేటాయించొద్దని ఇంటర్నల్ సర్క్యులర్ వెళ్లింది. దీంతో ప్లాట్లు కొనుక్కున్న వారు రిజిస్ట్రేషన్ల కోసం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్య తీరేందుకు మరో 6 నెలలు పట్టేలా ఉంది.

News February 7, 2026

KCR వల్ల రంగారెడ్డి జిల్లాకు అన్యాయం: CM

image

KCR ద్రోహం వల్ల రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందని CM రేవంత్ అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి గోదావరి జలాలను ఎందుకు తీసుకురాలేదో సబితా ఇంద్రారెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధి కోసం పార్టీ మారిన సబిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం నిధులు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.

News February 7, 2026

HYD: ఆమోదాలు.. ఖజానా ఖాళీ చేసేందుకేనా?

image

GHMC పాలకమండలి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెల 10న పదవీకాలం ముగియనుండగా.. 9న స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. కొన్ని టేబుల్ అజెండాలను ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఒక్కరోజు ముందు ఆమోదించి ఏం అభివృద్ధి చేస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం టెండర్ల బిల్లులు చెల్లింపు పేరుతో ఖజానా ఖాళీ చేయడానికి కమిటీ సమావేశం అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

News February 7, 2026

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ @278

image

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శనివారం తెల్లవారుజామున గాజులరామారంలో 278గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.