Hyderabad

News February 9, 2026

హైదరాబాద్‌ మెట్రో.. క్రియేటివ్ రీల్స్ అడ్డా!

image

HYD మెట్రో రైళ్లు కేవలం ప్రయాణానికే కాదు, యువత క్రియేటివిటీకి సరికొత్త వేదికలుగా మారుతున్నాయి. రాయదుర్గం నుంచి ఎల్బీనగర్ వరకు సాగే ప్రయాణంలో రీల్స్ షూటింగ్‌లు, సోషల్ మీడియా కంటెంట్ రూపకల్పనతో కుర్రకారు హల్చల్ చేస్తోంది. క్లబ్‌లు, కేఫ్‌ల కంటే మెట్రోలోనే నెట్‌వర్కింగ్ జోన్లు వెలుస్తున్నాయి. ప్రయాణ సమయాన్ని వృథా చేయకుండా వైరల్ వీడియోలు సృష్టిస్తూ మెట్రోను ఒక క్రియేటర్ స్టూడియోగా మార్చేస్తున్నారు.

News February 9, 2026

HYD: చుక్కేస్తుంటే.. చెక్కేశారు..!

image

మద్యం సేవిస్తున్న వ్యక్తి నుంచి కొందరు దుండగులు కలిసి బంగారు గొలుసు తెంపుకుని పరారైన ఉదంతం ఇది. పీర్జాదిగూడకు చెందిన అశోక్‌కుమార్‌ (46) బోడుప్పల్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. ఇదే అదనుగా వచ్చిన ముగ్గురు దుండగులు అతని మెడలోని బంగారు గొలుసు, ఉంగరాలు, ఫోన్, వాలెట్‌ను దోచుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.

News February 8, 2026

HYD: WHAT AFTER 10th మెగా సెమినార్

image

10th క్లాస్ తర్వాత స్టూడెంట్స్‌తో పాటు తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News & Resonance సంస్థ సంయుక్తంగా ఉప్పల్‌లో పెద్దఎత్తున ఉచిత అవగాహన సదస్సు నిర్వహించాయి. ఉప్పల్ భగాయత్‌లోని SriRasthu Convention‌లో నిర్వహించిన ఈ సెమినార్‌లో ముఖ్య అతిథిగా CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు.

News February 8, 2026

HYD: శివరాత్రి.. వేములవాడ వెళ్లేవారికి గమనిక..!

image

వేములవాడ శ్రీ రాజన్న ఆలయ పరిసరాల్లోని ప్రైవేట్ లాడ్జీలు, వసతి గృహాల్లో నిర్ణీత అద్దెను మాత్రమే వసూలు చేయాలని అక్కడి మున్సిపల్ కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
1. సింగిల్ రూమ్ NON A/C- రూ.300
2. సింగిల్ రూమ్ A/C- రూ.600
3. సింగిల్ బెడ్రూం డీలక్స్ NON A/C- రూ.500
4. సింగిల్ బెడ్రూం డీలక్స్ A/C- రూ.1,200
5. డబుల్ బెడ్రూం డీలక్స్ NON A/C- రూ.1,000
6. డబుల్ బెడ్రూం డీలక్స్ A/C- రూ.1,500 #SHARE IT.

News February 8, 2026

HYD: తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు

image

మీ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తారా? తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6th క్లాస్‌తో పాటు 7-10 క్లాసుల్లో ఖాళీల భర్తీకి అడ్మిషన్ల నోటిఫికేషన్ వచ్చేసింది. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుంది. స్మార్ట్ క్లాసులు, ల్యాబ్స్, భోజనం, యూనిఫామ్స్ ఫ్రీ. శంకర్‌పల్లి, షాబాద్, ఎంకేపల్లి తదితర చోట్ల శాఖలు ఉన్నాయి. FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు <>tgms.telangana.gov.in<<>>ను సందర్శించండి.

News February 8, 2026

JNTUHలో ‘బంగారు’తల్లి ఈమే!

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ CSE విభాగంలో అల్లంరాజు శ్రీవల్లి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. యూనివర్సిటీ నుంచి 4 గోల్డ్ మెడల్స్ సాధించి ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. క్యాంపస్ ప్లేస్మెంట్‌లో సైతం ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం సైతం సాధించింది. తన తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా, వారి కలలు సాకారం చేశానని తెలిపింది.

News February 8, 2026

హలీమ్ HYD ఎలా వచ్చిందంటే?

image

రంజాన్ మహినా షురూ అయిందంటే HYD షెహర్‌‌లో హలీం పరిమళాలు, దాని రుచితో మత్తెక్కిపోతుంది. పట్నంలో పొద్దుపోయినాక బట్టీల వద్ద హలీం లవర్స్ సందడి కనిపిస్తుంది. అయితే హలీమ్ అరబ్బుల వంటకం. నిజాం సైన్యంలో చేరిన అరబ్ సైనికులు, ఇక్కడ స్థిరపడిన పర్షియన్ల ద్వారా HYDకు పరిచయమైంది. 90 ఏళ్ల క్రితం పత్తర్‌గట్టిలోని మదీనా హోటల్ దీని రుచిని పట్నానికి పరిచయం చేసింది. ప్రజలు మెచ్చిన వంటకంగా 2010లో GI గుర్తింపు పొందింది.

News February 8, 2026

మున్సి‘పోల్స్’ స్పెషల్: ఇంటికి కేజీ మటన్, చికెన్, రైస్

image

మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను ఆశిస్తున్న ఆశావహులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రకరకాల హామీలు ఇస్తున్నారు. రోజూ వాళ్లడిగిన మద్యం బ్రాండ్, యాట మాంసం సరఫరా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరో 2 రోజులే ఉండటం, నేడు ఆదివారం కావడంతో అభ్యర్థులు ఓటర్లకు ఇంటికీ కిలో మటన్, చికెన్ సహా ఓటర్ల సంఖ్యను బట్టీ బాస్మతి రైస్, మద్యం బాటిళ్లు పంపుతున్నారని టాక్. ఇంతకీ మీ ఇంటికి మాంసం కవర్ అందిందా? ఒట్టి మాటేనా?

News February 8, 2026

HYD: రూ.40K జీతంతో ఉద్యోగాలు

image

HYD ECILలో 18 పోస్టులను భర్తీ చేయనుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (పర్చేసింగ్)-C(18) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ, బీఈ, బీటెక్‌లో 60% ఉత్తీర్ణతతో పాటు వృత్తిలో అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 20న ECILలో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. నెలకు 40,000 జీతం ఉంటుంది. మరిన్ని వివరాలకు <>-1<<>>లో చూడండి.

News February 8, 2026

ఉప్పల్‌లో నేడు మెగా సెమినార్

image

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్‌లోని SriRasthu Convention‌లో నేడు ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు