Hyderabad

News June 9, 2024

HYD: 47,309 మందికి చేప ప్రసాదం పంపిణీ

image

మృగశిర కార్తె పురస్కరించుకుని HYD నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 47,309 మంది ప్రసాదం స్వీకరించినట్లు తహశీల్దార్ ప్రేమ్ కుమార్ తెలిపారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, UP, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తదితరరాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారన్నారు. ఈ పంపిణీ ఈరోజు కూడా కొనసాగనుందన్నారు.

News June 9, 2024

HYD: పరీక్ష రాయనున్న 1,65,988 మంది అభ్యర్థులు

image

గ్రేటర్ HYD పరిధిలో నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 1,65,988 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకు 275 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 నుంచి మ.1 గంట వరకు పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉ.9 గంటల లోపు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.10 గంటల వరకు అనుమతించి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గేట్లు మూసివేసి అభ్యర్థులను అనుమతించరని పేర్కొన్నారు.

News June 9, 2024

HYD: ఈసెట్ కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ ప్రారంభం

image

ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్‌లో ఈసెట్ కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ ప్రారంభమైందని, ఈనెల 11 వరకు విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్యగౌడ్ చెప్పారు. ఈనెల 10 నుంచి 12 వరకు ఈసెట్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన, 10 నుంచి 14వ తేదీ వరకు కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్స్, 18 నుంచి విద్యార్థులకు కళాశాలల కేటాయింపు జరుగుతుందన్నారు.

News June 9, 2024

HYD: ఈనెల 15న జాబ్ మేళా.. మిస్ అవ్వకండి!

image

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 15న ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నరసయ్య గౌడ్ తెలిపారు. 2022, 23, 24 సంవత్సరాలకు చెందిన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎంబెడెడ్ సిస్టం బ్రాంచుల్లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు అర్హులని అన్నారు. 20 కంపెనీల ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయనున్నారని తెలిపారు. SHARE IT

News June 9, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు 

image

HYD మాదాపూర్‌ శిల్పారామంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీదేవి రాజనాల శిష్యబృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా భామ ప్రవేశం, రుక్మిణి, కొలువైతివరంగశాయి, గణేశా పంచరత్న, అతినిరుపమా, బృందావన నిలయ్‌హే, నమశివాయుతేయ్‌, ఒకపరికొకపరి, కృష్ణం కలయసఖి తదితర అంశాలపై చక్కటి ప్రదర్శనలో ఆకట్టుకున్నారు.

News June 9, 2024

సికింద్రాబాద్‌ నుంచి 19వ భారత గౌరవ్‌ యాత్ర ప్రారంభం

image

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి శనివారం 19వ భారత గౌరవ్‌ యాత్ర  ప్రారంభమైంది. ఈ యాత్రను 75 సంవత్సరాల వయసున్న దినేశ్ చుట్కే, 63 సంవత్సరాల వయసున్న సాధన చుట్కే ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 716 మంది పర్యాటకులతో 100 శాతం ఆక్యుపెన్సీతో రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.

News June 9, 2024

HYD: వారికి మంత్రి పదవి ఇస్తారా?

image

MP ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో HYD, ఉమ్మడి RRలో ఎవరికి మంత్రి పదవి వస్తుందనే చర్చ నడుస్తోంది. కంటోన్మెంట్ బైపోల్‌లో గెలిచిన శ్రీగణేశ్, ఇబ్రహీంపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి, షాద్‌నగర్ MLA వీర్లపల్లి శంకర్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీగణేశ్‌ గెలుపు, ఖైరతాబాద్ MLA దానం చేరికతో HYDలో కాంగ్రెస్ బలం 2కి చేరింది.

News June 9, 2024

HYD: నేడే గ్రూప్‌-1 EXAM.. ఇది మీ కోసమే!

image

నేటి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. HYD‌లో 76, మేడ్చల్‌-105, రంగారెడ్డి-93, వికారాబాద్‌‌లో 13 సెంటర్ల చొప్పున ఏర్పాటు చేశారు. రాజధానిలో దాదాపు 1.70 లక్షల మంది పరీక్ష రాస్తున్నారు. అభ్యర్థుల కోసం కోఠి, రేతిఫైల్‌ బస్టాండ్‌లో హెల్ప్‌డెస్క్‌, రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచినట్లు సజ్జనార్‌ తెలిపారు.
NOTE: 10:30AM నుంచి 1PM వరకు పరీక్ష ఉంటుంది.
ALL THE BEST

News June 8, 2024

HYD: దారుణం.. మంత్రాల పేరిట అత్యాచారం

image

మేడ్చల్ PS పరిధి‌లో దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కిష్టపూర్‌లో ఒడిశా వాసి ఉంటున్నాడు. తన భార్య ఆరోగ్యం బాగోలేదని సహద్యోగి షేక్ మోసిన్(41)కు చెప్పుకున్నాడు. మంత్రం వేసి నయం చేస్తానని నమ్మించిన మోసిన్‌ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అందరూ బయటే ఉండాలి.. మంత్రం వేస్తానని చెప్పి గదిలో అత్యాచారం చేశాడు. అవమానంతో బాధితురాలు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఈ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు.

News June 8, 2024

BREAKING: HYDలో మరో MURDER

image

HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నందనవనం రౌడీ షీటర్ సల్మాన్(23) హత్యకు గురయ్యాడు. అయితే అర్ధరాత్రి అతడి సోదరి.. సల్మాన్‌కి కాల్ చేసి డబ్బులు ఇస్తానని అయ్యప్ప గుడి వద్దకు రమ్మని పిలిచింది. అక్కడే ఉన్న సూరి, అతడి స్నేహితులు కలిసి సల్మాన్‌ని గొంతు కోసి చంపేశారు. కేసు నమోదైంది.