Hyderabad

News February 5, 2026

గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు 52 ఏళ్లు..!

image

దక్షిణ మధ్య రైల్వే(SCR)లో గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు తెలియనివారు ఉండరేమో. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలును 1974లో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ట్రైన్ అద్భుతమైన సేవలు అందిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేసింది. 52 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా.. రైలును ఫిబ్రవరి 2న అద్భుతంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

News February 5, 2026

‘HYDకు’ పొంచిఉన్న ‘పెను ముప్పు’..!

image

HYDను ఇప్పుడు CITY OF PEACE అని పిలవాలో లేక CANCER CAPITAL అనాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నగరంలో క్యాన్సర్ కేసులకు సంబంధించి జిల్లా గణాంకాలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఒక్క మన సిటీలోనే ఏటా కొత్తగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ మృత్యుఘంటికలు మోగుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, పీల్చే గాలిలో కాలుష్యం, తాగే నీళ్లలో రసాయనాలు వెరసి భాగ్యనగరవాసులను క్యాన్సర్ మహమ్మారి కబలించేస్తోంది.

News February 5, 2026

HYD: రైలులో ప్రయాణిస్తున్నారా..? ఇలా చేయండి..!

image

రైలులో ప్రయాణిస్తున్నారా..? ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా..? వెంటనే 139కు కాల్ చేసి సమాచారం అందించాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు. అంతేకాకుండా Railmadad యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. మొబైల్ పోగొట్టుకున్నా ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. అందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని DRM గోపాలకృష్ణన్ సూచించారు.

News February 5, 2026

HYD: స్వప్నపై రెండుసార్లు మర్డర్ అటెంప్ట్ చేశాడు: తల్లి

image

HYD పరిధి మొయినాబాద్(M) కేతిరెడ్డిపల్లిలో యువ లాయర్ <<19046946>>స్వప్న(34) హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే. చేవెళ్ల కోర్టులో స్వప్న న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆస్తి తగాదాలు ఉండగా ఇటీవల పొలం కొలతలు జరిగాయి. అనంతరం తిరిగి ఇంటికెళ్తుండగా అన్నతోసహా మరో ఇద్దరు కలిసి స్వప్నను గొంతు కోసి చంపారు. స్వప్నపై ఇప్పటికే రెండుసార్లు హత్యకు యత్నించాడని తల్లి వెంకటమ్మ తెలిపారు. మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 5, 2026

HYD: ఈనెల 17 నుంచి BRAOU పరీక్షలు

image

HYDలోని డా. బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రొ.శ్రీనివాస్ తెలియజేశారు. పరీక్షకు 3 రోజుల ముందు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

HYD: ఒక్క లైవ్ బటన్‌తో పది లక్షల చీరలు

image

ఒక్క లైవ్ బటన్‌తో 10 లక్షల చీరలు అమ్మడం మామూలు మాట కాదు! టీచర్‌గా పనిచేసిన సంగీత రాజేశ్, ఫేస్‌బుక్ లైవ్‌లో డిజిటల్ ‘సారీ క్వీన్’గా అవతరించారు. 8.5లక్షల మంది ఫాలోవర్ల సాక్షిగా, నేతన్నల నైపుణ్యాన్ని గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేశారు. ఒక్కో మారథాన్ షోలో ₹50 లక్షల వ్యాపారం చేస్తూ, బంజారాహిల్స్‌లో ఎంపోరియం నిర్మించినా.. ఆవిడ గురి లైవ్ సేల్స్ పైనే. ISB చదువు, సంప్రదాయం కలిస్తే సంచలనాలేనని నిరూపిస్తున్నారు.

News February 5, 2026

మాదాపూర్ PSలో చంద్రహాస్‌పై కేసునమోదు

image

మాదాపూర్ PSలో బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు చేశారు. ఓ ఆడియో ఫంక్షన్‌లో బూతు పాటలు పాడినట్టు ఫిర్యాదుల మేరకు ఓ టీవీ ఎడిటర్ అశోక్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని ఆడియో ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.