India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ భూమి కబ్జాలు, చెరువుల రక్షణ సంబంధిత అంశాలపై ప్రతి శనివారం ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి శనివారం మ.12 గంటల నుంచి ఒంటిగంట మధ్య డైరెక్ట్‌గా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 040-29565750, 040-29565759 కాల్ చేసి మీ ఫిర్యాదులు తెలియజేయొచ్చన్నారు. చెరువుల్లో మట్టి పోయడం, పార్కుల కబ్జాలపై సైతం ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు.

దిల్‌సుఖ్‌నగర్‌లోని భార్గవి అనే గర్భిణికి తప్పుడు రిపోర్టు ఇచ్చినందుకు విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వినియోగదారుల హక్కుల కమిషన్ జరిమానా విధించింది. బాధితురాలు చేయించుకున్న స్కాన్‌లో శిశువు ఆరోగ్యం సాధారణంగానే ఉందని డయాగ్నోస్టిక్ రిపోర్టు ఇవ్వగా, అనుమానంతో మరోచోట పరీక్ష చేయించగా శిశువు మెడపై 11 MM సిస్ట్ ఉన్నట్లు తేలింది. విచారణ జరిపిన కమిషన్ బాధితురాలికి రూ.2.20లక్షల పరిహారం ఇవ్వాలని తెలిపింది.

నగరవాసులు ఎదురుచూస్తున్న మెట్రో 2వ దశకు రంగం సిద్ధమైంది. 76.4 KM మేర 5 రూట్లలో మెట్రో కూతపెట్టనుంది.
కారిడార్ IV: నాగోల్- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ 36.6KM (24 స్టేషన్లు, 1.6KM అండర్ గ్రౌండ్)
V: రాయదుర్గం- కోకాపేట నియోపోలిస్ 11.6KM (8స్టేషన్లు)
VI: MGBS-చాంద్రాయణగుట్ట 7.5KM (6స్టేషన్లు)
VII: మియాపూర్-పటాన్‌చెరు 13.4KM (10స్టేషన్లు)
VIII: ఎల్బీనగర్-హయత్‌నగర్ 7.1KM (6 స్టేషన్లు)
# SHARE IT

పర్యావరణ కాలుష్యం, స్మోకింగ్, ఆల్కహాల్ వ్యసనాలతో క్యాన్సర్ వస్తుందని GGH మహేశ్వరం ENT సర్జన్ డా.KVN దుర్గాప్రసాద్ అన్నారు. ‘ఆహారం, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉన్నా, దగ్గితే రక్తం పడినా, గడ్డలు, పుండ్లు, దగ్గు తగ్గకపోవడం లక్షణాలు. గుడ్లు, ఆకుకూరలు, శనగపప్పు ఉండలు ఎక్కువ తీసుకోవాలి. ప్రొటీన్, విటమిన్లు శరీరానికి సరిగ్గా అందాలి. భయం వీడి చికిత్స తీసుకోవాలి’ అని సూచించారు.
నేడు వరల్డ్ క్యాన్సర్ డే

స్వామి వివేకానంద భాగ్యనగరానికి వచ్చి ఈ ఏడాదితో 133 ఏళ్లు పూర్తికావొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణ మఠం శాఖ ‘వివేక సూర్యోదయ సప్తాహం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. కార్యక్రమాలన్నీ సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ క్యాంపస్‌లోని వివేకానంద ఆడిటోరియంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చని మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మహారాజ్ తెలిపారు. ఆయన ఇక్కడకి వచ్చినప్పుడు ఈ కాలేజీలోనే ప్రసంగించారు.

హీరోయిన్ ఈషా రెబ్బా బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లపై కొందరు వ్యక్తులు అత్యంత అసభ్యకరంగా, కించపరిచేలా కామెంట్స్ చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తన గౌరవానికి భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి, కఠినచర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

”నోరు తెరిస్తే పనిలోంచి తీసేస్తాం.. ఇచ్చింది పుచ్చుకొని పడి ఉండండి” అంటూ GHMC ఎంటమాలజీ కార్మికులను కాంట్రాక్ట్ ఏజెన్సీలు నిలువునా దోచుకుంటున్నాయి. నెలకు రావాల్సిన ₹20,930 జీతంలో, ఏకంగా ₹11,930 కమీషన్ కింద నొక్కేస్తూ కేవలం ₹9,000 మాత్రమే చేతిలో పెడుతున్నారని సమాచారం. 2021 నుంచి సాగుతున్న ఈ ‘దందా’పై కార్మికులు గళమెత్తినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.

కూకట్‌పల్లి జోనల్ ఆఫీసులో ACB అధికారులు మెరుపు దాడి చేసి భారీ అవినీతి చేపను పట్టారు. రూ.15 లక్షల లంచం తీసుకుంటూ SE చిన్నరెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ‘పని కావాలంటే పైసలు ఇచ్చుకోవాల్సిందే’ అంటూ డిమాండ్ చేసిన ఈ అధికారి బాగోతం బట్టబయలైంది. ఆఫీసులో సోదాలు జరుగుతుంటే సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిన్నరెడ్డి అవినీతి చిట్టాను బయటకు తీసే పనిలో ACB నిమగ్నమైంది.

జలమండలి అధికారులు నీటి సరఫరాలో మనుషుల ప్రమేయం తగ్గించి, రిమోట్ కంట్రోల్‌తో పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఎక్కడైనా పైపు పగిలితే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆ లైన్‌ను కట్ చేసి ప్రత్యామ్నాయ మార్గంలో నీటిని పంపిస్తుంది. దీర్ఘకాలంగా బిల్లులు కట్టని వారి కనెక్షన్లను ఆఫీసు నుంచే రిమోట్ ద్వారా ‘లిమిటెడ్ సప్లై’ మోడ్‌లోకి మార్చవచ్చు, నీటి వృథాను అరికట్టడం, <<19047299>>100%<<>> వసూళ్లను సాధించడం దీని లక్ష్యం.

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. మొయినాబాద్ శివారులోని కేతిపల్లి విలేజ్‌లో పొలం వద్ద ఉన్న యువ న్యాయవాది స్వప్నపై దుండగులు దాడి చేశారు. గొంతు కోసి హత్య చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, స్వప్న చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.