Hyderabad

News February 3, 2026

HYD: గూగుల్‌లో సెర్చ్ చేసి.. SUICIDE

image

కూకట్‌పల్లికి చెందిన విజయలక్ష్మి (26) మరణం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2 రోజుల్లో వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె, హుస్సేన్‌సాగర్‌లో శవమై తేలింది. చనిపోవడం ఎలా అని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు సమాచారం. పెళ్లి కాలేదనే బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగినప్పటికీ, పోలీసులు దానిని ఖండించారు. డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఏదైనా బతికి సాధించాలని సూచించారు.

News February 3, 2026

HYDలో ఒలింపియాడ్.. గెలిస్తే రూ.15లక్షలు..!

image

​గచ్చిబౌలిలో జరిగిన యంగ్ చెఫ్ ఒలింపియాడ్- 2026 వేడుక అదిరిపోయింది. 50 దేశాల నుంచి వచ్చిన యువత తమ దేశీ వంటకాలతో గెస్టులను ఫిదా చేశారు. ‘బిర్యానీ, హలీమ్‌లకు కేరాఫ్ అడ్రస్ మన HYD. యునెస్కో గుర్తింపు పొందిన గ్యాస్ట్రోనమీ సిటీ’ అని జయేష్ రంజన్ గుర్తుచేశారు. TG రుచులను వరల్డ్ లెవల్‌కు తీసుకెళ్లడమే మన సర్కార్ టార్గెట్ అన్నారు. రేపటి నుంచి అసలైన పోటీ మొదలుకానుంది. గెలిచినోళ్లకు రూ.15 లక్షల బహుమతి.

News February 3, 2026

HYD: ఫోన్ నంబరుకు ప్రాపర్టీ ట్యాక్స్ లింక్

image

ప్రాపర్టీ ట్యాక్స్‌కు సంబంధించి GHMC కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ వివరాలను ఓనర్ మొబైల్ నంబరుకు కచ్చితంగా లింక్ చేయాలని నిర్ణయించింది. ఇది వరకు ఈ పద్ధతి కొనసాగినా మహానగరంలో 30% మంది ఓనర్ల మొబైల్ నంబరు లింక్ కాలేదు. దీంతో లింక్ తప్పనిసరిగా చేయాలని రెవెన్యూ విభాగం అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి అధికారులతో పేర్కొన్నారు. ఈ పద్ధతి ఇటీవల విలీన ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నట్లు సమాచారం.

News February 3, 2026

వెంటిలేటర్ కావాలంటే NIMSలో సిఫార్సు ఉండాల్సిందే

image

నగరంలో ప్రముఖ ఆస్పత్రి NIMSలో అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ సేవలు కావాలంటే దొరకదు.. ప్రముఖులతో చెప్పించుకుంటే కానీ అక్కడ ఎమర్జెన్సీ వెంటిలేటర్ దొరకదు. నిమ్స్ ఎమర్జెన్సీలో దాదాపు 100 వెంటిలేటర్లు ఉంటే 8- 10 వరకు ఎప్పుడూ మరమ్మతులో ఉంటాయి. ఒక్కోసారి పేషెంట్లు అంబులెన్సుల్లోనే గంటల తరబడి వేచి చూడాల్సిన దారుణ పరిస్థితులు ఉన్నాయని చికిత్సకు వచ్చిన వారు వాపోతున్నారు. ఈ దుస్థితి ఎప్పుడు మారుతుందో?

News February 3, 2026

HYD: పుణ్యక్షేత్రాల దర్శనం.. గోవాలో సముద్ర స్నానం

image

గోవాతోపాటు సుబ్రమణ్యస్వామి, ఉడిపి, మురుడేశ్వర్ వెళ్లాలనుకునే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 25 నుంచి 5 రోజులపాటు కుక్కే, ఉడిపి, మురుడేశ్వర్, గోవా ట్రిప్ ప్లాన్ రూపొందించింది. ఒక్కొక్క టికెట్ ధర రూ.5,130 ఉంటుంది. గోవా వెళ్లాలనుకునే వారు <>https://www.tgsrtcbus.in/<<>> లో టికెట్ బుక్ చేసుకోవాలని BHEL డీఎం తెలిపారు.

News February 3, 2026

T20 వరల్డ్ కప్.. HYDలో బిగ్ స్క్రీన్‌లు

image

క్రికెట్ వరల్డ్ కప్.. ఈ పేరే ఓ కిక్.. ఈ నెల 7 నుంచి నెలరోజులపాటు క్రికెట్ ప్రియులను పొట్టి వరల్డ్ కప్ అలరించనుంది. నగరవ్యాప్తంగా ఉన్న పలు బార్లు, రెస్టారెంట్లు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేసి.. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి నిర్వాహకులు బిజినెస్ పెంచుకునే పనిలోపడ్డారు. చిల్ అవుతూ క్రికెట్ చూస్తుంటే ఆ మజానే వేరప్పా అని కొందరు క్రికెట్ ప్రేమికులు చెబుతున్నారు.

News February 3, 2026

HYD: తాళి బొట్టు తీసింది.. సర్టిఫికెట్లతో వెళ్లిపోయింది..!

image

భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవతో ఓ గృహిణి అదృశ్యమైన ఘటన మేడిపల్లి PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. పర్వతాపూర్‌కు చెందిన మహేందర్‌కు రాణితో 15Yr క్రితం వివాహమైంది. JAN 31న ఆఫీసులో పార్టీ ఉందని రాత్రి ఇంటికి రానని భర్త చెప్పడంతో వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు ఉదయం భార్య ఫోన్, మంగళసూత్రాన్ని ఇంట్లోనే వదిలి, రూ.8 వేల నగదు, సర్టిఫికెట్లతో వెళ్లిపోయింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News February 3, 2026

BREAKING: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బైకు దగ్ధం

image

దుర్గం చెరువు కేబుల్ వంతెనపై మంగళవారం ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై ఇద్దరు ప్రయాణిస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన వారు అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపి పక్కకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లోనే బైకు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో వంతెనపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మంటలను అదుపు చేశారు.

News February 3, 2026

గ్రేటర్‌ HYDలో మరోసారి తాగునీటి కష్టాలు!

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి తాగునీటి కష్టాలు రానున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది వాటర్ కనెక్షన్లు పెరగడం, భూగర్భ జలాలు తగ్గడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీనికి తోడు జలాశయాల నుంచి నీటి కేటాయింపులు ఏమాత్రం పెరగలేదు. సమ్మర్ డిమాండ్ మేరకు సరఫరా చేస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే ట్యాంకర్ల బుకింగ్లు జోరందుకున్నాయి. మండువేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందనే భయం ఇప్పటికే మొదలైంది.

News February 3, 2026

HYD: పెళ్లి కాలేదని అమ్మాయి ఆత్మహత్య (UPDATE)

image

పెళ్లి కాలేదనే మనస్తాపంతో యువతి హుస్సేన్‌సాగర్‌లో దూకి <<19029844>>ఆత్మహత్యకు<<>> పాల్పడింది. పోలీసుల వివరాలు.. విజయలక్ష్మి అనే యువతి తల్లితో కలిసి మైత్రినగర్‌లో ఉంటుంది. ఇటీవల విజయలక్ష్మికి పెళ్లి సంబంధాలు రావడంతో వివాహం అనంతరం తల్లి దివ్యాంగురాలు కావడంతో తనతో పాటే ఉంటుందని చెబుతుండటంతో సంబంధాలు వెనక్కిపోయాయి. దీంతో మనస్థాపంతో విజయలక్ష్మి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదుచేశారు.