India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1070 అందుబాటులోకి వచ్చింది. 1070 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చునని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈరోజు తెలిపారు. హైడ్రా ప్రజావాణికి రాలేని వారు చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాకు గురైతే వెంటనే ఈ నంబర్‌కి కాల్ చేయవచ్చన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న NIFT (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) విద్యార్థులు శిల్పారామంలో సందడి చేయనున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు తమ ప్రతిభను నిరూపించుకోనున్నారు. భారతీయ హస్తకళల గొప్పదనాన్ని వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులు, వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తారు.
కవిత సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, మహేశ్వరం BRS ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడంతో కవితను సస్పెండ్ చేశారని, ఈ నిర్ణయం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. పార్టీ, తెలంగాణ ప్రజల బాగోగులు తనకు ముఖ్యమని కేసీఆర్ మరోసారి నిరూపించారని అన్నారు. BRSపై ప్రజల్లో మరింత విశ్వాసం నిలబెట్టడానికి ఇలాంటి నిర్ణయాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ KCR తీసుకున్న నిర్ణయాన్ని కుత్బుల్లాపూర్ MLA వివేకానంద స్వాగతించారు. ‘BRS అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం’ అని స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా కవిత పనితీరుతో కార్యకర్తలు, నాయకుల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. పార్టీకి యాంటీగా వ్యవహరిస్తే ఎవరిపైనైనా సరే వేటు తప్పదని తేల్చి చెప్పారు.
HYD నడిబొడ్డున రాత్రికి రాత్రే ప్రభుత్వ బోర్డులు తీసేసి, పెద్ద సంఖ్యలో రౌడీలు మోహరించి రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రైవేటు వ్యక్తులు యత్నించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కన 5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు పార్థసారథి, విజయ్ భార్గవ్ అనే వ్యక్తులు యత్నించారని పోలీసులు తెలిపారు.
HYD నగరవాసులకు గుడ్ న్యూస్. నగరంలో మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని (PSK) ఏర్పాటు చేయనున్నారు. MGBS మెట్రో స్టేషన్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈనెల 16న ఇది ప్రారంభం కానుందని పేర్కొన్నారు. పాతబస్తీ ప్రజలకు ఈ కేంద్రం ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఒవైసీ అన్నారు.
HYD హిమాయత్ సాగర్ జలాశయంలోకి ఈరోజు ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్ అందరూ చూస్తుండగానే జలాశయంలోకి దూకాడని చెప్పారు. ఈత రాకపోవడంతో క్షణాల్లోనే యువకుడు మునిగిపోయాడన్నారు. రంగంలోకి దిగిన NDRF బృందాలు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
రైలు కింద పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ వాసి భూక్యా పెంటానాయక్ చర్లపల్లిలోని తన చెల్లి వద్ద ఉంటూ ఐటీ కారిడార్‌లో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఏ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ ఇన్‌స్టంట్, మేకప్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
జీవితంలో కష్టాలు వస్తాయని.. అంతమాత్రాన ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటే ఎలా? కష్టాలు మనిషికి కాక మానుకు వస్తాయా అని పెద్దలు చెబుతుంటారు. ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతుతుండటంతో తెలంగాణ సైకాలాజికల్ అసోసియేషన్ బాధితులకు ఆత్మస్థైర్యం కల్పించాలని నిర్ణయించింది. అందుకే నగరంలో హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆత్మహత్య ఆలోచన ఉన్న వారు ఒక్కసారి 040-35717915, 94404 88571 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
Sorry, no posts matched your criteria.