Hyderabad

News June 11, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

image

HYD అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కోడ్ ఎత్తివేయడంతో ప్రస్తుతం పనులు షురూ అయ్యాయి. GHMC పరిధిలోని సుమారు వందకు పైగా కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలిచారు. వీటితో పాటు పారిశుద్ధ్యం, బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్స్, సీఆర్ఎంపీ, ఎస్సాఆర్‌డీపీ, ఎస్ఎన్‌డీపీ పనులపై దృష్టి సారించారు.

News June 11, 2024

HYD: వర్షాకాల ప్రణాళికపై ఎండీ సుదర్శన్‌రెడ్డి సమీక్ష

image

వర్షాకాలంలో కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తగిన మోతాదులో క్లోరిన్‌ శాతం ఉండేలా చూసుకోవాలని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. సోమవారం HYD ఖైరతాబాద్‌‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వర్షాకాల ప్రణాళికపై ఎండీ సుదర్శన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శాంపిల్‌ కలెక్షన్‌, పరీక్షల్లోనూ జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.

News June 11, 2024

HYD: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో తెలంగాణ అగ్నిమాపక శాఖ ఒప్పందం

image

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో తెలంగాణ అగ్నిమాపక శాఖ వేతనాలు, పెన్షన్లు, ప్రమాద బీమా వంటి అంశాలపై అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర పోలీసులకు ఇస్తున్న కవరేజీ, సేవలు, ప్రత్యేక ఆఫర్లను అగ్నిమాపకశాఖ సిబ్బందికి కూడా అందించనున్నారు. ఈ మేరక అగ్నిమాపక సేవల శాఖ డీజీ వై.నాగిరెడ్డి, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హైదరాబాద్‌ జోన్‌ జనరల్‌ మేనేజర్‌, జోనల్‌ హెడ్‌ రితేశ్‌ కుమార్‌ సోమవారం ఎంవోయూపై సంతకాలు చేశారు.

News June 11, 2024

HYD: కాల్ చేశారు.. రూ.41.28 లక్షలు కొట్టేశారు..!

image

క్రిప్టో ట్రేడింగ్‌లో లాభాలు ఇప్పిస్తామని ఓ సర్జన్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జూబ్లీహిల్స్‌కి చెందిన ఓ బేరియాట్రిక్ సర్జన్ తన ఫేస్ బుక్‌లో coinmarket.win అనే లింక్ కనిపించడంతో దాన్ని క్లిక్ చేశాడు. ఓ యాప్ ఓపెన్ అవగా ఓ వ్యక్తి కాల్ చేసి రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.3 లక్షలు ఇస్తామన్నాడు. నమ్మిన సర్జన్ విడతల వారీగా రూ.41.28లక్షలు పెట్టి మోసపోయి PSలో ఫిర్యాదు చేశాడు.

News June 11, 2024

HYD: గృహజ్యోతి పథకం పునః ప్రారంభం..!

image

ఎన్నికల కోడ్ ముగియడంతో గృహజ్యోతి పథకం పునః ప్రారంభించామని అధికారులు తెలిపారు. RR, VKB పరిధిలో దీనిని ప్రారంభించగా 3.73 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఇక HYD, మేడ్చల్ పరిధిలో ఇప్పటికే కొనసాగుతోందన్నారు. అర్హత ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని వారు.. చేసుకున్నా సాంకేతిక కారణాలతో సున్నా బిల్లులు రానివారు GHMC ప్రజాపాలన కేంద్రాల్లో అప్లై చేయాలని అధికారి ఆనంద్ తెలిపారు. SHARE IT

News June 11, 2024

HYD: పూల బొకేలు, శాలువాలు వద్దు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

image

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తనను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు పూల బొకేలు తీసుకురావద్దని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పూల బొకేలు, శాలువాలకు బదులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చేందుకు నోటు బుక్కులు, స్ఫూర్తిదాయకమైన కథల పుస్తకాలు తెస్తే బాగుంటుందని కోరారు. కేంద్ర మంత్రి నిర్ణయంపై అందరూ భేష్ అంటున్నారు.

News June 11, 2024

ఈనెల 28వ తేదీ నుంచి ఓయూ ఎంబీఏ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. SHARE IT

News June 10, 2024

HYD: 19వ తేదీ నుంచి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని చెప్పారు.

News June 10, 2024

HYD: నీట్ పరీక్ష నిర్వహణపై సీబీఐ విచారణ జరిపించాలి: R.కృష్ణయ్య

image

జూన్ 4న విడుదలైన నీట్ పరీక్ష 2024 ఫలితాలు, నీట్ పరీక్ష నిర్వహణపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున, నీట్ పరీక్ష నిర్వహణ తీరుపై CBIచే విచారణ జరిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ R.కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరారు. విద్యానగర్ హిందీ మాహా విద్యాలయం నుంచి BC భవన్ వరకు విద్యార్థులతో ఆయన ర్యాలీ నిర్వహించారు.

News June 10, 2024

HYD: వేతనాల పెంపున‌కు కృషి చేస్తా: మంత్రి సీతక్క

image

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు, సవాళ్లు అనే అంశంపై ఈరోజు HYD సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపాధి హామీ ప‌థ‌కం వ్య‌వ‌సాయానికి అనుసంధానం, ప‌నిదినాల‌ను పెంచి కూలీలకు వేతనాలు పెంపున‌కు కృషి చేస్తామ‌న్నారు. ఉపాధి కూలీల‌కు మౌలిక స‌ధుపాయాలు క‌ల్పించేలా కృషి చేస్తామ‌న్నారు.