India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రోడ్డు మీద డస్ట్‌బిన్లు నిండిపోయి వాసన వస్తున్నాయా? ఫ్యూచర్ సిటీలో ఆ ఛాన్స్ లేదు. ముచ్చర్లలో రాబోతున్న ఈ పారిశుద్ధ్య వ్యవస్థ ఇండియాలోనే అతిపెద్ద ‘జీరో-హ్యూమన్ ఇంటర్వెన్షన్’ ప్రాజెక్ట్. ప్రతి బిన్‌కు అమర్చే ‘సెన్సార్లు’ చెత్త 80% నిండగానే కమాండ్ సెంటర్‌కు సిగ్నల్ పంపిస్తాయి. డ్రైవర్ లేని ‘ఎలక్ట్రిక్ వ్యాన్లు’ ఎప్పటికప్పుడు ఆ బిన్‌ను ఖాళీ చేస్తాయి. దావోస్‌లో CM చూపించబోయే ‘క్లీన్’ సిటీ సీక్రెట్ ఇదే.

పతంగి.. ఇది కాగితం ముక్క కాదు. నాన్న నేర్పిన మొదటి గెలుపు పాఠం. మాంజాకు వేళ్లు తెగుతున్నా లెక్కచేయకుండా పతంగిని తండ్రి గాల్లోకి విసిరే ఆ క్షణం ఒక అపురూపమైన దృశ్యం. ‘కింద పడినా మళ్లీ ఎగరాలి’ అని నేర్పే గాలిపటం స్ఫూర్తి గొప్పది. పొరిగింటి వాడి పతంగిని కట్ చేసినప్పుడు వచ్చే ఆ కేకల్లో చిన్ననాటి జ్ఞాపకాలు దాగున్నాయి. ఫోన్లకు దూరంగా కాటే నినాదాల నడుమ ఆకాశంలో తెగిపోని బంధంలా హైదరాబాదీలకు పతంగి మారింది.

భూమి మీది.. కానీ రికార్డుల్లో ఇంకొకరిది. ఫ్యూచర్ సిటీలో ఇలాంటి మాయాజాలం చెల్లదు. ఇక్కడ ప్రతి అంగుళం ‘బ్లాక్ చైన్’ భద్రతలో ఉంటుంది. ప్రభుత్వం “హైడ్రా-లెడ్జర్” వ్యవస్థను డిజైన్ చేసింది. సాధారణంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయొచ్చు.. కానీ ఇక్కడ ‘బ్లాక్ చైన్’ వాడటం వల్ల ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారని అధికారులు Way2Newsకు వివరించారు.

జర్నలిస్టుల అరెస్టు విషయంలో రాహుల్ గాంధీ వైఖరిని KTR ఖండించారు. ‘మీ మొహబ్బత్ కీ దుకాన్ తెలంగాణ పౌరుల రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాలరాస్తోందో గమనిస్తున్నారని ఆశిస్తున్నాను. నిన్న రాత్రి ముగ్గురు జర్నలిస్టులను రాష్ట్ర పోలీసులు అపహరించారు. పోలీసులు జర్నలిస్టుల ఇళ్ల తలుపులు పగులగొట్టారు. ఇది కేవలం బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసు, పోలీసులు BNSS సెక్షన్ 35 కింద నోటీసు ఇచ్చి ఉండవచ్చు’ అని Xలో ఖండించారు.

మనం రోజూ తాగే కాఫీ వెనుక ఓ అద్భుత కథ దాగి ఉంది. ఇథియోపియాలో 11వ శతాబ్దంలో మేకల కాపరి కఫా కొండ ఎక్కాడు. మేకలు చెర్రీలాంటి పండ్లు తిని ఉల్లాసంగా నర్తిస్తున్నాయని అతడు గమనించాడు. ఆశ్చర్యంతో అతడు గింజలను వేడి నీటిలో మరిగించి తాగగా, అపూర్వమైన ఉల్లాసాన్ని అనుభవించాడు. అదే కాఫీ. మన దేశానికి పరిచయం చేసింది మాత్రం అరబ్బులు. <<18855272>>పరేడ్ గ్రౌండ్<<>> స్వీట్ ఫెస్టివల్‌లో ఈ కాఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ జోరుగా, హుషారుగా సాగుతోంది. 2వ రోజు సిటీలోని నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ ఎగరేస్తున్న పతంగులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్థానికులు, కైట్ ప్లేయర్స్, కళాకారులు Way2Newsతో తమ ఒపినియన్స్ పంచుకున్నారు. రేపటితో కైట్ ఫెస్టివల్ ముగుస్తుంది. తొందరగా వెళ్లండి మరి.
GOOD NEWS ఏంటంటే ప్రవేశం ఉచితం.

మున్సిపల్ ఎన్నికల వేళ TBJP శ్రేణులకు అధిష్ఠానం వార్నింగ్ ఇచ్చింది. మున్సిపల్ పోరు పార్టీ గుర్తుపై జరుగుతుందని, MPలు, MLAలు క్షేత్రస్థాయిలో సత్తా చాటాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించింది. GP జోష్‌తో ఇప్పుడు పట్టణ కోటలపై జెండా పాతాలని పక్కా ప్లాన్ వేసింది. ‘BRS, రాష్ట్ర సర్కార్ విఫలమైంది.. BJPకి అవకాశం ఇవ్వండి’ అనే నినాదంతో ప్రచార బరిలోకి దిగనుంది.

సిటీలోని చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో పాత పద్ధతులకు కాలం చెల్లింది. అంతా టెక్నాలజీ హవానే. రూ.2.5 కోట్ల విలువైన డ్రోన్లు, కంప్యూటర్లు, వాకీటాకీలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘స్వాగతం’ పోర్టల్, ఈ-ఆఫీస్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిపోయింది. ఖైదీలు తమ కేసు స్టేటస్ చూసుకోవడానికి 52 కొత్త మెషిన్లు కూడా వచ్చేశాయి. టెక్ అప్‌గ్రేడ్‌తో తెలంగాణ జైళ్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఈనెల 22న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. 5-10 తరగతుల వరకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈనెల 21లోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. www.tgswreis.telangana.gov.inలో అప్లై చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను 040 23391598 నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.

సిటీ అంటే హారన్ల గోల. కానీ ఫ్యూచర్ సిటీలో పక్షుల కిలకిలారావాలు వినొచ్చు. ఇది CM స్వయంగా దావోస్‌లో ప్రపంచానికి పరిచయం చేయబోతున్న శబ్దంలేని అద్భుతం. ఫ్యూచర్ సిటీని ఇండియాలోనే మొదటి ‘సైలెన్స్ జోన్’ నగరంగా మార్చే బ్లూప్రింట్ రెడీ అయింది. ఇందులో భాగంగా రెసిడెన్షియల్ జోన్లలో ‘నాయిస్ అబ్జార్బ్‌షన్ రోడ్లు’ వేయబోతున్నారు. అనవసరంగా హారన్ కొడితే AI డిటెక్టర్లతో నం. ప్లేట్ స్కాన్ అయ్యి చలాన్ జనరేట్ అవుతుంది.
Sorry, no posts matched your criteria.