Hyderabad

News June 10, 2024

HYD: పాముకాటుకు గురై ఇంటర్ విద్యార్థి మృతి

image

పాముకాటుతో ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన తాండూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. అల్లాకోట్‌కు చెందిన ఎడెల్లి రవి తన కుటుంబంతో నిద్రిస్తున్నారు. ఈక్రమంలో శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూతురు పూజ(16) కుడికాలుకు పాము కాటేసింది. పూజను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

News June 10, 2024

HYD: లష్కర్‌లో గెలిస్తే కేంద్ర మంత్రి పదవి

image

లష్కర్‌లో ఎన్నికైతే కేంద్ర మంత్రి పదవి ఖాయమనే సంప్రదాయం మరోసారి నిజమైంది. ఇదే లోక్‌సభ స్థానానికి 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన బండారు దత్తాత్రేయ.. 1998, 2014లో 2సార్లు కేంద్ర మంత్రిగా చేశారు. 2019లో కిషన్ రెడ్డి ఇక్కడ విజయం సాధించి కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా, తర్వాత పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. 2024ఎన్నికల్లో గెలిచి రెండోసారి కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు.

News June 9, 2024

ఆదివారం: హైదరాబాద్‌ మెట్రో ఖాళీ!

image

HYDలోని పలు మెట్రో‌ స్టేషన్లు ఆదివారం సాయంత్రం ఖాళీగా దర్శనమిచ్చాయి. ట్రైన్‌లో సౌకర్యవంతంగా ప్రయాణం చేసినట్లు ఓ నెటిజన్‌ పేర్కొన్నారు. ఇండియా VS పాక్ T20WC, PM ప్రమాణ స్వీకారం, ఆదివారం‌ సెలవు కావడంతో‌ ఉద్యోగస్థులు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఖాళీగా ఉన్న ఓ మెట్రో స్టేషన్‌ ఫొటో‌ను ఆ నెటిజన్‌ ‘X’లో షేర్ చేశారు. కాగా, సాధారణ రోజుల్లో‌ HYD మెట్రో‌లో రద్దీ అందరికీ తెలిసిందే.
PIC CRD: @PrathyushaCFA18

News June 9, 2024

రేపే కల్కి ట్రైలర్.. HYDలోని ఈ థియేటర్లో స్క్రీనింగ్!

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్‌ రేపు విడుదలకానుంది. అభిమానుల కోసం HYDలోని పలు థియేటర్లలో‌ రేపు 6PMకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. RTC X రోడ్స్-సంధ్య70MM, దిల్‌సుఖ్‌నగర్‌-కోణార్క్, KPHB-బ్రమరాంభ, అర్జున్, RCపురం-జ్యోతి, ఉప్పల్-రాజ్యలక్ష్మీ, జీడిమెట్ల-భుజంగ, మల్కాజిగిరి-సాయిరాం, ECIL-రాధిక, నాచారం-వైజయంతి థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్క్రీనింగ్ చేస్తారు.
SHARE IT

News June 9, 2024

HYD: BJP సీనియర్ నాయకుడి మృతి

image

BJP రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ ఫిలిం బోర్డ్ మెంబర్ బి.జంగారెడ్డి ఈరోజు మృతిచెందారని ఆ పార్టీ నేతలు తెలిపారు. HYD శివారు మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన జంగారెడ్డి అనారోగ్యంతో మరణించారని చెప్పారు. ఆయన మృతి BJPకి తీరని లోటని చెబుతూ సంతాపం వ్యక్తం చేశారు. ఏళ్లుగా పార్టీలోనే ఉన్న వ్యక్తి అని, ఎన్నో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని కొనియాడారు.

News June 9, 2024

HYD: రేపు రాష్ట్ర సదస్సుకు హాజరుకానున్న మంత్రి సీతక్క

image

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సంఘం నేత అంకగళ్ల కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు HYDలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న సదస్సుకు రాష్ట్ర మంత్రి సీతక్క, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకుడు వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, ఎంపీ శివదాసన్, తదితరులు హాజరవుతారని తెలిపారు. వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.

News June 9, 2024

FLASH: HYD: భారీ ట్రాఫిక్ జామ్.. గ్రూప్-1 అభ్యర్థుల పరుగులు 

image

HYD రామోజీ ఫిలింసిటీ సమీపంలోని అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్ కాలేజీలో ఈరోజు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరుగులు తీస్తూ కేంద్రానికి చేరుకోవాల్సి వచ్చిందని వాపోయారు. కాగా ఫిలింసిటీ వద్ద రామోజీరావు అంత్యక్రియలు జరుగుతున్న విషయం తెలిసిందే. 

News June 9, 2024

HYD: 47,309 మందికి చేప ప్రసాదం పంపిణీ

image

మృగశిర కార్తె పురస్కరించుకుని HYD నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 47,309 మంది ప్రసాదం స్వీకరించినట్లు తహశీల్దార్ ప్రేమ్ కుమార్ తెలిపారు. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, UP, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తదితరరాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారన్నారు. ఈ పంపిణీ ఈరోజు కూడా కొనసాగనుందన్నారు.

News June 9, 2024

HYD: పరీక్ష రాయనున్న 1,65,988 మంది అభ్యర్థులు

image

గ్రేటర్ HYD పరిధిలో నేడు జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు 1,65,988 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందుకు 275 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 నుంచి మ.1 గంట వరకు పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉ.9 గంటల లోపు చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.10 గంటల వరకు అనుమతించి బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారన్నారు. ఆ తర్వాత గేట్లు మూసివేసి అభ్యర్థులను అనుమతించరని పేర్కొన్నారు.

News June 9, 2024

HYD: ఈసెట్ కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ ప్రారంభం

image

ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ సెంటర్‌లో ఈసెట్ కౌన్సెలింగ్ స్లాట్ బుకింగ్ ప్రారంభమైందని, ఈనెల 11 వరకు విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని కళాశాల ప్రిన్సిపల్ నర్సయ్యగౌడ్ చెప్పారు. ఈనెల 10 నుంచి 12 వరకు ఈసెట్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన, 10 నుంచి 14వ తేదీ వరకు కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్స్, 18 నుంచి విద్యార్థులకు కళాశాలల కేటాయింపు జరుగుతుందన్నారు.