Hyderabad

News May 9, 2024

HYD: నేడు అంబేడ్కర్ వర్సిటీలో టెలీకాన్ఫరెన్స్

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకడమిక్, అభివృద్ధి కార్యకలాపాలపై మే 9న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ఈఎంఆర్అండ్ఆర్సీ డైరక్టర్ ఆచార్య వడ్డాణం శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ యూట్యూబ్ ఛానెల్, టీ-శాట్ నిపుణ ద్వారా ఈ టెలీకాన్ఫరెన్స్ ఉంటుందని, విద్యార్థులు, అధ్యయన కేంద్రాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనలన్నారు.

News May 9, 2024

HYD: జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

image

రాష్ట్రంలో 2024 -25 విద్యాసంవత్సరానికి గాను జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. నేటి నుంచి ఫస్ట్ ఫేజ్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. కాగా ఈనెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. కాగా జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీలోపు తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు HYDలో అధికారులు స్పష్టం చేశారు.

News May 9, 2024

HYD: మాజీ గవర్నర్ తమిళిసై పై ఈసీకి BRS ఫిర్యాదు

image

మాజీ గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌పై ఈసీకి బీఆర్‌ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి జి.కిషన్ రెడ్డికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కాలనీలో తమిళిసై ఎన్నికల ప్రచారం చేశారని, ఆ సమయంలో ఓటర్లకు అయోధ్య రామమందిర నమూనాలను పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.

News May 9, 2024

HYD: యువతిపై అత్యాచారం.. బెదిరింపులు

image

అమీర్‌పేట్‌‌లో అత్యాచారం కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. వనపర్తికి చెందిన యువతి ఎల్లారెడ్డిగూడలో తన అక్క ఇంటికి వచ్చింది. సమీపంలో ఉంటున్న సాయికృష్ణ యువతికి బంధువు కావడంతో చనువుగా ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని, అన్నం వండిపోవాలని పిలిచి యువతిపై సాయికృష్ణ అత్యాచారం చేశాడు.వారికి వరుస కుదరక పెద్దలు పెళ్లికి నో చెప్పారు. ఫొటోలు వైరల్ చేస్తానని యువకుడు బెదిరించడంతో యువతి PSలో ఫిర్యాదు చేసింది.

News May 9, 2024

HYD: దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: వీహెచ్

image

దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYD గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశాన్ని జోడించేందుకు ప్రయత్నిస్తే.. నరేంద్ర మోదీ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బీజేపీ స్టేట్‌మెంట్లు చేస్తోందని ఆరోపించారు.

News May 8, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> చందనగర్ లో 24 గంటలుగా కరెంట్ లేదని బస్తీ వాసుల ఆందోళన
> కాచిగూడలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
> నల్లగుట్టలో మహిళలపై దాడి.. జైలు శిక్ష
> గుడిమల్కాపూర్‌లో కిషన్ రెడ్డి ప్రచారం
> కూకట్‌పల్లిలో సహాయక చర్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్
> గచ్చిబౌలి, నల్లగండ్ల పార్కుల్లో విరిగిపడ్డ చెట్లు
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం

News May 8, 2024

హైదరాబాద్‌లో ‘భలే దొంగలు’

image

‘భలే దొంగలు’ సినిమా వలే చోరీల బాటపట్టిన ప్రేమ జంట కటకటాల పాలయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. అల్వాల్‌లో సువర్ణ అనే మహిళ మెడలోని చైన్‌‌ను ఆదివారం బైక్‌పై వచ్చిన ఇద్దరు అపహరించారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు చింతల్‌లో నివసించే తరుణ్ (23), సౌమ్య(19)గా గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. జల్సాల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌ చేసినట్లు వెల్లడించారు.

News May 8, 2024

HYD: కాసేపట్లో KCR పోరుబాట.. సర్వత్రా ఆసక్తి

image

రాజధాని‌లో మాజీ CM KCR పోరుబాట‌కు సర్వం సిద్ధమైంది. మల్కాజిగిరి BRS MP అభ్యర్థి లక్ష్మారెడ్డికి మద్దతుగా‌ దుండిగల్‌ కమాన్‌ వద్ద ప్రచార సభ ఏర్పాటు చేయగా.. కాసేపట్లో KCR రానున్నారు. CM రేవంత్ సిట్టింగ్(MP) స్థానం‌ ఇదే కావడంతో అందరిచూపు మల్కాజిగిరి‌పై పడింది. దీనికితోడు BRS నుంచి‌ బయటకెళ్లిన ఈటల(BJP), సునీత‌(INC) ప్రత్యర్థులుగా ఉన్నారు. వారిపై KCR స్పందన ఏంటనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

News May 8, 2024

HYD‌లో 11 మందిని బలితీసుకొన్న గాలివాన

image

HYDలో నిన్న కురిసిన గాలివాన 11 మందిని బలితీసుకొంది. బహదూర్‌పురాలో కరెంట్ పోల్ తగిలి షాక్‌తో ఫక్రూ(40) చనిపోయారు. బేగంపేట‌ నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. బాచుపల్లి‌‌లో గోడకూలి ఏకంగా ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో పంక్చర్‌ షాప్‌లో ఉన్న వ్యక్తి కరెంట్‌ షాక్‌తో చనిపోయారు. అకాల వర్షానికి ఒక్కరోజే 11 మంది చనిపోవడం HYDలో ఇదే తొలిసారి.

News May 8, 2024

HYD: BRS గెలిచేలా KTR వ్యూహాలు..!

image

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో BRSను గెలిపించేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. నేడు KCR బస్సు యాత్ర కూడా నగరానికి చేరనుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ పెంచేలా నేతలకు KTR సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో HYDలో 17 సీట్లను BRS గెలవగా దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.