India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ పతకాలు సాధించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ ప్రతిభ చూపిన సిబ్బందికి శుక్రవారం కమిషనరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సీపీ పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ.. సేవా పతకాలను అందుకున్న సిబ్బందిని అభినందించారు. 75 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసినట్టు తెలిపారు.
తెలంగాణలో వరి సాగు గణనీయంగా పెరుగుతోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సోనా రకం బహుళ ప్రాచుర్యం పొందిందని తెలిపారు. శుక్రవారం HYDలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ప్రపంచ వరి సదస్సు-2024ను తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సదస్సులో 30 దేశాల నుంచి 150 మంది ఎగుమతిదారులు , దిగుమతిదారులు , శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నేటి నుంచి చేప మందు పంపిణీ చేయనున్నారు. లక్షలాది మంది తరలిరానుండడంతో నాంపల్లి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు ఉదయం నుంచి 9వ తేదీ సా.6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రత్యేక పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్‌ను ప్రతి ఒక్కరూ ఫాలో కావాలని, సహాయం కోసం హెల్ప్‌లైన్ 9010203626 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. SHARE IT
మృగశిర కార్తె సందర్భంగా ముషీరాబాద్ మార్కెట్‌కు భారీగా చేపలు దిగుమతి చేసుకుంటున్నారు వ్యాపారులు. సాధారణ రోజుల్లో 15 టన్నుల నుంచి 20 టన్నుల విక్రయాలు ఇక్కడ జరుగుతుంటాయి. శనివారం (మృగశిర కార్తె రోజు) 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు అమ్ముడుపోతాయని వ్యాపారులు వెల్లడించారు. రేపు సండే కూడా గిరాకీ ఉంటుందన్నారు. మరోవైపు నాంపల్లి ఎగ్జిబిషన్‌లో చేపమందు కోసం శుక్రవారం రాత్రి నుంచి క్యూకట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కమిషనర్ రోనాల్డ్ రాస్ 13 రోజుల పాటు సెలవుపై వెళ్తున్నారు. శనివారం నుంచి ఈ నెల 23 వరకు ఆయన యూరప్‌లో పర్యటించనున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అదనపు బాధ్యతలు HMDA(హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ) జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 13 రోజులు తాత్కాలికంగా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
SHARE IT
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిమ్స్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర్ వైద్యుడు ప్రొఫెసర్ సాయి సతీశ్, జనరల్ మెడిసిన్ వైద్యుడు ప్రొఫెసర్ నావెల్ చంద్ర, పల్మనాలజీ సీనియర్ వైద్యులు పరంజ్యోతి పర్యవేక్షణలోని వైద్యబృందం సాధారణ వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
గ్రేటర్ HYD ప్రజలకు శుభ్రతపై పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా పిలుపునిచ్చారు. HYD మాదాపూర్‌లోని గఫూర్‌నగర్‌లో రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త (GVP పాయింట్)ను శుభ్రం చేసి, ముగ్గులు వేసి మాట్లాడారు. ‘ప్రజలందరికీ దండం పెట్టి చెబుతున్నాం.. ప్లీజ్ రోడ్లపై చెత్త వేయకండి.. ఇది మన హైదరాబాద్.. మనం అందరం శుభ్రంగా ఉంచుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం’ అని పిలుపునిచ్చారు. కాగా దుర్వాసన వస్తున్నా వారు క్లీన్ చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో జూన్ నుంచి గృహజ్యోతి పథకాన్ని HYD, ఉమ్మడి RR జిల్లా పరిధిలోని వినియోగదారులకు వర్తింపజేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ పథకం ఇప్పటి వరకు అమలు కాలేదు. సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ, వికారాబాద్ సెక్షన్ల పరిధిలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారు 11.50 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. SHARE IT
ఓయూలోని ఇంజినీరింగ్ కళాశాలలోని సెల్ట్ (సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్)లో నిర్వహించనున్న ‘ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులను ఈనెల 11 వరకు స్వీకరిస్తున్నట్లు సెల్ట్ డైరెక్టర్ సవీన్ సౌడ తెలిపారు. 12 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సెల్ట్ కార్యాలయంలో పేరును నమోదు చేసుకోవాలన్నారు.
కొందరు పబ్ ఓనర్లు, యువతులు కలిసి HYDలో కొత్త రకం మోసానికి తెర లేపారు. వ్యాపార వేత్తలు, శ్రీమంత యువకులను డేటింగ్ యాప్‌లలో పరిచయం చేసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. తాజాగా రితికా అనే యువతి తనకు పరిచయమై ఇలాగే మోసం చేసిందని ఓ బాధితుడు వాపోయాడు. హైటెక్ సిటీ మెట్రోస్టేషన్ దగ్గర కలిసి పబ్‌కు వెళదామని ఫోన్ చేసి చెప్పిందన్నాడు. ఆమె ఏం తాగకపోయినా కాసేపటికి రూ.40,505 బిల్లు చేతిలో పెట్టి వెళ్లిపోయిందన్నాడు.
Sorry, no posts matched your criteria.