Hyderabad

News May 7, 2024

HYD: బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల శిక్షతోపాటు జరిమానా విధిస్తూ సోమవారం RR జిల్లా పోక్సో స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు APP తెలిపిన వివరాలు.. HYD మీర్‌పేట్ PS పరిధిలో గతంలో ఓ బాలికను కొందరు అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం ప్రధాన నిందితుడు చనిపోగా సహకరించిన కృష్ణకు కోర్టు శిక్ష విధించింది.

News May 7, 2024

HYD: మరింత మెరుగ్గా పోల్ క్యూ రూట్ యాప్

image

పోల్ క్యూ రూట్ యాప్‌ను ఈసారి మరింత మెరుగ్గా అందుబాటులోకి తెస్తామని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ యాప్‌ను దాదాపు 1.5 లక్షల మంది ఉపయోగించారు. పోలింగ్ కేంద్రానికి దారి తెలుసుకోవడంతోపాటు అక్కడ ఓటర్లు ఎంతమంది బారులు తీరారనే వివరాలను పొందారు. దానికి తగ్గట్టుగా ఏ సమయంలో వెళ్తే త్వరగా ఓటు వేయొచ్చనే అంచనాతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

News May 7, 2024

HYD: రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి..!

image

రాజధాని పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఒక్కరే ముందుండి శ్రేణుల్లో జోష్ నింపుతూ సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు సర్వేలు చేయించారు. ఈనివేదికల ఆధారంగా సీఎం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లతో శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. BRSను ఓడించి 3స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచేలా వ్యూహాలు రచించారు.

News May 7, 2024

HYD: మోదీ రాక.. ట్రాఫిక్ ఆంక్షలు

image

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం రాత్రి 7:50 గంటల మధ్య ప్రధాని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. బుధవారం ఉదయం 8:35 నుంచి 9:10 గంటలకు ఇదే మార్గంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ సమయాల్లో ఈ మార్గంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

News May 7, 2024

HYD: రేవంత్‌రెడ్డి ఆటో డ్రైవర్లను మోసం చేశారు: కొండా

image

సీఎం రేవంత్‌రెడ్డి ఆటో డ్రైవర్లను మోసం చేశారని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. HYD శంషాబాద్‌‌లో సోమవారం భారతీయ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎంపీగా గెలవగానే ఆటో డ్రైవర్లను ఆదుకుంటానని, ఆటో డ్రైవర్లకు బ్యాంకు రుణాలతో పాటు ఆవాస్‌ యోజన పథకం కింద సొంతింటి కల సాకారం చేస్తానని హామీ ఇచ్చారు.

News May 7, 2024

HYD: అద్దంకి దయాకర్‌పై సీఈఓకు మాధవీలత ఫిర్యాదు

image

హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్‌ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్, మజ్లిస్ అధినేత, ఎంఐఎం హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీపై ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ పసిపిల్లలను సైతం వదిలిపెట్టకుండా ఓట్ల రాజకీయం ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.

News May 7, 2024

HYD: అనుమానంతో భార్య దారుణ హత్య

image

అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన HYD శివారు గచ్చిబౌలి సమీపంలోని మోకిలా PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీర్జాగూడ పరిధి ఇంద్రారెడ్డి నగర్‌లో వడ్డే మాణిక్యం, యాదమ్మ(45) దంపతులు కూలి పని చేసుకుంటూ జీవించేవారు. కొన్ని రోజులుగా యాదమ్మను అనుమానిస్తూ మాణిక్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో యాదమ్మ రాత్రి ఇంటి బయట నిద్రించగా ఆమె తలపై బండరాయితో మోది మాణిక్యం చంపేశాడు.

News May 7, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు VHP, బజరంగ్‌దళ్ డిమాండ్ 

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అయోధ్య అక్షింతలపై అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ విశ్వ హిందూ పరిషత్, బజరంగదళ్ డిమాండ్ చేశాయి. ఈ మేరకు HYDలో ఓ ప్రకటన విడుదల చేశాయి. హిందూ దేవుళ్లను కించపరిచేలా సీఎం మాట్లాడడం సరికాదని పేర్కొన్నాయి. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల 8న HYD, ఉమ్మడి RRతో పాటు అన్ని జిల్లాల్లో సీఎం దిష్టిబొమ్మ దహనం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చాయి.

News May 7, 2024

HYD: రైల్వే స్టేషన్ బోర్డుపై ఎప్పుడైనా ఇది చూశారా?

image

ఆకుపచ్చ రంగు బాక్సులో ఉన్న MSL మార్కింగ్ రైల్వే స్టేషన్ బోర్డు పై ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు. HYD చర్లపల్లి స్టేషన్ బోర్డు పై MSL+525.05M అని రాసి ఉంది. దీని అర్థం ఏంటంటే చర్లపల్లి రైల్వే స్టేషన్ సముద్ర మట్టానికి 525.05 మీటర్ల పైన ఉన్నట్లు అని రైల్వే సివిల్ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. MSL అనగా మీన్-సి-లెవెల్(సగటు సముద్రమట్టం) అని పేర్కొన్నారు.

News May 6, 2024

HYD: అరుదైన సర్జరీ.. బాలిక‌కు ప్రాణం పోశారు!

image

గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీని సక్సెస్​గా చేసి, పేషంట్​ ప్రాణాలు కాపాడారు. నాందేడ్​ (MR)కు చెందిన సంధ్య (11) అనే బాలిక బ్లడ్‌ప్రెషర్​, తలనొప్పి, మైకం, చెమట, వాంతులు తదితర ఆరోగ్య సమస్యలతో గాంధీలో అడ్మిట్​ అయింది. స్కానింగ్​ తదితర వైద్య పరీక్షలు నిర్వహించిన పీడియాట్రిక్​ సర్జరీ వైద్యులు బాలిక కిడ్నీలపైన రెండు కణితిలు ఉన్నట్లు గుర్తించారు. లాపరోస్కోపిక్‌తో తొలగించి ఆమె ప్రాణాలు కాపాడారు.