India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయకచవితి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు నగరంలో నిమజ్జనాల ఊరేగింపులు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పాతబస్తీ మాదన్నపేటలో ఓ చిన్నారి చిట్టి గణపయ్య కోసం చిన్న జీపును సిద్ధం చేసింది. గణపయ్యను ఆ వాహనం మీద ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకొంది.
HYDలో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం అనేకసార్లు తెలిపింది. కానీ..ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దాదాపు రూ.15 వేల కోట్లు అవసరం ఉన్నట్లు అంచనా వేస్తున్నప్పటికీ ప్రారంభం కాలేదు. తరచూ ఓవర్ హెడ్‌లైన్లు తెగి పడటంతో అనేకచోట్ల ప్రాణాలు పోతున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు బాధిస్తున్నాయి. వెంటనే ఎలక్ట్రిసిటీ గ్రౌండ్ లైన్ కేబుల్స్ పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.
అనివార్య కారణాల వళ్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా HYD SCR అధికారులు తెలిపారు. పూర్ణ నుంచి అకోలా, అకోలా నుంచి పూర్ణా వెళ్లే 77613 రైలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జైపూర్ హైదరాబాద్, తిరుపతి, అదిలాబాద్ రైళ్లను సైతం డైవర్ట్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైలులో ప్రయాణం ప్లాన్ చేసుకునేవారు షెడ్యూల్ చూసుకోవాలని సూచించారు.
HYDలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జలమండలి తెలిపింది. షేక్‌పేట్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు, గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో సెప్టెంబర్ 1 ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 7 గంటల వరకు మంచినీటి సరఫరా బంద్ కానుంది.
కాప్రా చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న గుల్షాన్ బంబాత్ చిన్న గణపతి విగ్రహాల ద్వారానే ఎక్కువ విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి ఉంటాయని అభిప్రాయపడ్డారు. చెరువులను కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆమె రాత్రిపూట కూడా చెరువు దగ్గరే ఉన్నారు. కాలుష్యరహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. “చెరువులు కలుషితం కావొద్దంటే, మనందరం మారుదాం” అని ఆమె పేర్కొన్నారు
HYDలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ 2025లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. సైక్లింగ్ శారీరక, మానసిక బలాన్ని పెంచుతుందని గవర్నర్ అన్నారు. ప్రోగ్రాంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి పాల్గొన్నారు.
HYDలో వరదలకు గల కారణాలను అన్వేషిస్తూ, సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ తెలియజేశారు. త్వరలో కృష్ణానగర్ నివాసితులతో సమావేశం నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. అమీర్పేట, కృష్ణానగర్ ప్రాంతంలో నాలా డీసిల్టింగ్ పక్రియ వేగంగా జరుగుతుండగా, ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు.
HYD, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో నేడు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుపుతూ సైబరాబాద్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సూచించారు. వర్షం ఒక్కసారిగా ప్రారంభమై కురిసే అవకాశాలు అధికంగా ఉన్నట్లుగా అధికారులు వివరించారు.
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. అయితే సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి ప్రకటించింది.
క్యాన్సర్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HYD, RR, MDCL, VKB జిల్లాల్లో క్యాన్సర్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. HYD పరిధి MNJ క్యాన్సర్ ఆస్పత్రి, NIMS ఆసుపత్రులలో ప్రస్తుతం వైద్యం అందుబాటులో ఉండగా, వైద్య చికిత్స విస్తరణపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Sorry, no posts matched your criteria.