India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ మాజీ సీపీ, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్ ట్రాఫిక్ క్రమశిక్షణపై స్పెషల్ సెషన్ నిర్వహించారు. రాజ్యసభ సెక్రటేరియట్ స్టాఫ్, ముస్సోరి ప్రాంతాలకు చెందిన బృందం సభ్యులు ఇందులో పాల్గొన్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ MCHRD విద్యాసంస్థలో ఈ ప్రోగ్రాం జరగగా, గత అనుభవాలతో ముందుకు వెళితే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
HYD నగరంలో నూతనంగా జీహెచ్ఎంసీ కమిషనర్ పదవి బాధ్యతలు చేపట్టిన ఇలంబర్తికి జోనల్ కమిషనర్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ఎల్బీనగర్ జోన్ ZC హేమంత పటేల్, ఖైరతాబాద్ ZC అనురాగ్ జయంతి, శేర్లింగంపల్లి ZC ఉపేందర్ రెడ్డి, సికింద్రాబాద్ ZC రవికిరణ్, చార్మినార్ ZC వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్ చెపింది. QR కోడ్ స్కాన్ చేసి టికెట్ పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. బండ్లగూడ, DSNR డిపో బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ తీసుకొచ్చి సక్సెస్ అయింది. అన్ని బస్సుల్లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి అవసరమైన 4,500 ఇంటెలిజెంట్ టికెటింగ్ యంత్రాలను (ITM) తీసుకురానుంది. అలాగే విద్యార్థుల బస్‌పాస్‌ల కోసం ప్రత్యేక యాప్ తీసుకురానుంది. దీంతో వారికి క్యూలైన్ కష్టాలు తీరతాయి.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ముఖ గుర్తింపులో HYD జిల్లా అగ్రస్థానం దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే హైదరాబాద్‌లో సగటు హాజరు 90 శాతానికి పెరిగినట్లు తెలిపారు. మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 691 ఉండగా, విద్యార్థుల సంఖ్య 92,000లకు పైగా ఉంది. హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య 82,800 కాగా.. ఉపాధ్యాయుల సంఖ్య 5,329గా అధికారులు తెలిపారు.
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతారని CS శాంతి కుమారి తెలిపారు. పరీక్షల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆమె గురువారం చర్చించారు. అత్యధికంగా రాజధాని పరిధిలోనే సెంటర్లు ఏర్పాటు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసేందుకు గ్రూప్-1 అభ్యర్థులు అపాయింట్‌మెంట్ కోరారు. వారి విజ్ఞప్తి మేరకు కలిసేందుకు ఆయన సమయం ఇచ్చారు. గాంధీ భవన్ ముట్టడికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయగా.. వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. నేడు గాంధీ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో చర్చించనున్నారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిపై దుండగుడి దాడి విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనకు వెనకున్న సంచలన విషయాలు పోలీసులు వెల్లడించారు. మెట్రోపోలీస్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రసంగాలకు ప్రభావితుడైన నిందితుడు దాడికి పాల్పడ్డాడని తేల్చారు. 140 మందికిపైగా అకామిడేషన్ కల్పించి, భారీ సమావేశం నిర్వహించినప్పటికీ తమకు సమాచారం ఇవ్వకపోవడంతో హోటల్ యాజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి, హోటల్ సీజ్‌కు సిద్ధమయ్యామన్నారు.
గ్రేటర్ HYDలో వంతెనల బ్యూటిఫికేషన్ పనులను GHMC ప్రారంభించింది. ఇప్పటికే బషీర్ బాగ్ వంతెన పిల్లర్లపై వేసిన చారిత్రాత్మక కట్టడాల పెయింటింగ్ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వంతెన పిల్లర్ వద్దకు వెళ్లి చూస్తే, నిజంగా నిర్మాణం మన పక్కనే ఉన్నట్లు ఉందని పలువురు తమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. HYDలో గ్రీనరీ పెంచడంతో పాటు, నగరాన్ని చూడముచ్చటగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని GHMC తెలిపింది.
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించుకుని వచ్చే ఐదేళ్లలో 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. హైదరాబాద్ కల్యాణ్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌స్సీ) కొత్త కార్యాలయం ‘విద్యుత్ నియంత్రణ్ భవన్’ను ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు.
విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులు, సిబ్బందికి డీజీపీ జితేందర్ సూచించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో రాష్ట్ర స్థాయి మొదటి పోలీస్ డ్యూటీ మీట్-2024 బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ హాజరై మాట్లాడారు. విధి నిర్వహణలో పోలీసుల అంతిమ లక్ష్యం బాధితులకు చట్టప్రకారం న్యాయం చేయడమే అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.