India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HMDA పరిధిలో LRS కింద ఇప్పుడు క్రమబద్ధీకరించుకుంటే 2020 నాటి భూమి విలువ ప్రకారం ఛార్జీలు ఉంటాయి. ఆలస్యం చేస్తే మూడు రెట్ల భారం పడనుంది. నిర్మాణ అనుమతి తీసుకునే నాటి భూమి విలువతో 33 శాతం జరిమానా, 14 శాతం ఓపెన్ ప్లాట్ డెవలప్‌మెంట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే LRS రుసుములు చెల్లించాలని సూచిస్తున్నారు.
SHARE IT
HYD మేడ్చల్ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసరగడి గ్రామంలో గోనెసంచిలో బాలిక మృతదేహం లభించింది. ఈనెల 12న కుమార్తె జోష్న(7) కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయడంతో ఈరోజు బాలిక మృతదేహం గోనెసంచిలో కనిపించింది. దీంతో కేసు నమోదు చేసి, బాలికను ఎవరు హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అంటువ్యాధుల చికిత్స కోసం HYD పంజాగుట్ట NIMS ఆస్పత్రిలో ప్రతి మంగళ, గురువారం ఓపీ సేవలు అందిస్తున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్, క్షయ, బ్లాక్ ఫంగస్, వైరల్ ఇన్ఫెక్షన్లకు ఈ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. న్యుమోనియా, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు, కిడ్నీ, కాలేయం లాంటి అవయవ మార్పిడి తర్వాత సోకే ఇన్ఫెక్షన్లనూ నయం చేస్తున్నట్లు తెలిపారు.
యునైటెడ్ నేషన్స్ పీస్ క్రాఫ్టర్స్ కాంక్లేవ్‌లో HYD రామంతపూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటినట్లు అధికారులు తెలిపారు. హైకమాండేషన్ (UNGA) ఆర్యవీర్ గుప్తా, అర్జున్‌రావు వర్బల్ మెన్షన్ (UNHRC), వైష్ణవి వర్బల్ మెన్షన్(ECOSOC), తుమ్మల అక్షయ బెస్ట్ రిపోర్టర్‌గా గెలుపొందినట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వారికి పాఠశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ కవి, గాయకుడు వేమూరి అనంత రామకృష్ణశర్మ, ప్రముఖ లలిత సంగీత, సీని గాయని వేమూరి మంజుల దంపతులు భారతరత్న డా. APJ అబ్దుల్ కలాం అవార్డుకు ఎంపికయ్యారు. సంగీతం, సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వేమూరి దంపతులకు ఈరోజు పినాకిని సంస్థ ఆధ్వర్యంలో HYD త్యాగరాయగానసభలో అవార్డు ప్రదానం చేయనున్నారు. MLC మధుసూదనాచారీ, సీల్‌వెల్ కార్పొరేషన్ CMD బండారు సుబ్బారావు తదితరులు హాజరుకానున్నారు.
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయంలో మంగళ, బుధవారాలు 2 రోజుల పాటు ఉర్దూ రచయితల వర్క్ షాప్ జరగనుంది. ఉర్దూ ఉన్నత విద్య కోసం పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేయడానికి, అకడమిక్ రైటింగ్స్‌పై ఈ వర్క్ షాప్ నిర్వహిస్తారు. నూతన విద్యావిధానం-2020కి అనుగుణంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, భారతీయ భాషా సమితి (బీబీఎస్) ద్వారా చొరవ తీసుకుంది.
దంపతులు విడాకులు తీసుకున్నా.. కలిసే మోసాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్ణాటకకు చెందిన మహ్మద్, రేష్మ HYDకు వచ్చి జాబ్ కన్సల్టెన్సీలో పనికి కుదిరారు. 2013లో వివాహం చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నా.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు దిగారు. ఆమె మరో పెళ్లి చేసుకున్నా మోసాలు చేస్తూ పట్టుబడ్డారు. కేసు నమెదు చేసి ఫోన్లు, ల్యాప్‌టాప్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్‌లోని ఖాజాగూడ వరల్డ్ హోస్పైస్ & పల్లియెటివ్ కేర్ డేను పురస్కరించుకొని స్పర్ష్ హాస్పైస్ సెంటర్ ఫర్ పల్లియేటివ్ కేర్ ఆస్పత్రిని సందర్శించారు. ఇక్కడ చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శించారు. పల్లియేటివ్ కేర్ ఆస్పత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాన్ని ఈనెల 18న హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవి రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ.. వార్షికోత్సవానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరవుతారు అని తెలిపారు.
విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లు, మండల తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి సమావేశమయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.