India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డయాబెటిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని డాక్టర్ వసంత్ కుమార్ అన్నారు. డే సొసైటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చాలామంది చిన్నపిల్లలు ఇన్సులిన్ తీసుకుని స్థాయికి రావడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. 30ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు షుగర్ టెస్ట్ చేయించుకోవాలని, ఆహార అలవాట్లు, బరువు పెరగడంతో డయాబెటిస్ రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
HYD: ఇటీవల మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును ఎడిటర్ గిల్డ్స్ ఎలా ఖండిస్తుందని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఆమె పెట్టిన కంటెంట్‌ను పరిశీలించారా, మీడియాలో అలాంటి భాష వాడొచ్చా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో లేని ముఖ్యమంత్రి కుటుంబంలోని మహిళలను బూతులు తిట్టడం స్వేచ్ఛ కిందికి రాదన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు పాశం యాదగిరి, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డిలున్నారు.
మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖగుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో రాజీ పడవద్దని, చదువుతోనే పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. గాంధీనగర్ సురభి బాలవిహార్ స్కూల్ దగ్గర SRK గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉదాన్ ఉత్సవ్–2025 కు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు.MLA ముఠా గోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా.బి.జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రదర్శనలు, నిరసనలపై నిషేధం విధిస్తూ ఓయూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం ఓయూ బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. యూనివర్సిటీల్లో నియంతృత్వ పోకడలు సరికాదని పేర్కొంది. ఓయూలో ఉద్యోగ భర్తీ, నిధుల కొరత, విద్య నాణ్యత, ఆహార నాణ్యత తదితరాంశాలపై దృష్టి సారించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.
HYD మెట్రోలో బెట్టింగ్ యాప్స్ యాడ్లు తీవ్ర వివాదాని దారితీశాయి. HML ఎండీ NVS రెడ్డికి బెట్టింగ్ యాప్స్‌లపై ఫిర్యాదులు చేసినా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ గ్రేటర్ HYD ఎస్సీ సెల్ కన్వీనర్ తోటకూర శ్రీకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ మాటేంటి సార్ అని అధికారులను ప్రశ్నించారు. వీటితో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని, యాప్స్‌ను నమ్మి మోసపోవద్దని అన్నారు.
ఎస్ఎఫ్ఐ – డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో NCC గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ను పారద్రోలి అసలైన భారతదేశాన్ని నిర్మిద్దామనే నినాదంతో యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగానే ఈ రన్ నిర్వహించామన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించకూడదని అధికారులు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమవుతున్నాయి. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు.
సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ వైఎల్. శ్రీనివాస్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని శ్రీనివాస్ శాలువాతో సన్మానించి సత్కరించారు. మొట్టమొదటి, నూతన వీసీగా నియామకమైన శ్రీనివాస్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని సూచించారు.
మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవోదయ కాలనీలోని (కూకట్పల్లి) తులసివనం వద్ద 5K రన్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు కుటుంబంతో పాటు తమ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.