India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పార్శీగుట్ట, మధురానగర్ కాలనీ బంగారు మైసమ్మను హైదరాబాద్ CP సీవీ ఆనంద్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీపీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి ప్రసాదం అందచేశారు. సీపీ నగర ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దుర్గామాత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి సిబ్బందితో కలిసి సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గా మాత ఆశీస్సులతో నగరం సుభిక్షంగా, శాంతియుతంగా ఉండాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో 9వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ రకాల పండ్లతో అమ్మవారి గర్భగుడిని ప్రత్యేకంగా అలంకరించారు. 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని దేవీగా దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణతో అమ్మవారు ప్రజలకు భక్తులకు దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఎస్సీలలో ఎక్కువగా లబ్ది పొందింది మాదిగ కులస్తులేనని, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఛైర్మన్ జి.చెన్నయ్య స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ సమావేశంలో పోరాట సమితి ఛైర్మన్లు వెంకటేశ్వర్లు, బేల బాలకిషన్, గోపోజు రమేశ్, బత్తుల రాంప్రసాద్‌తో కలిసి చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యుత్సాహం తగ్గించుకోవాలన్నారు.
హైదరాబాద్‌లో ఈ దసరాకు తగ్గేదే లేదు. విందుకు వినోదం జతకానుంది. రేపు దసరాతో పాటు ఉప్పల్ వేదికగా ఇండియా VS బంగ్లాదేశ్ T-20 మ్యాచ్ జరగనుంది. నగరం అంతటా ఇక సందడే సందడి. ఉదయం నుంచే ఆలయాలు, అమ్మవారి మండపాలు కిక్కిరిసిపోతాయి. మధ్యాహ్నం బలగం అంతా కలిసి విందులో పాల్గొంటారు. సాయంత్రం వరకు హైదరాబాద్ అంతటా దసరా వైభోగమే. దీనికితోడు రాత్రి మ్యాచ్ ఉండడంతో క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు.
హైదరాబాద్ ఖాళీ అవుతోంది. దసరా సెలవులకు ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు MGBS, JBS, ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద బస్టాపుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సొంత వాహనాల్లోనూ బయల్దేరడంతో సిటీ శివారుల్లోని టోల్గేట్ల వద్ద కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి, బీబీనగర్, దుద్దెడ టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే నగరంలో ట్రాఫిక్ కాస్త తగ్గింది.
తెలంగాణ ఉద్యమకారుల సంఘానికి సంబంధించిన కమిటీని రద్దు చేస్తున్నట్లు సంఘం వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి గురువారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కమిటీలో ఉన్న ఛైర్మన్ ఇనుప ఉపేందర్, అధ్యక్షుడు దాసర్ల శ్రీశైలం, కన్వీనర్ MD రహీమ్ కూడిన కమిటీని వెంటనే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే తదుపరి కమిటీని ప్రకటిస్తామని ఆయన వివరించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మందకృష్ణ మాదిగ హాజరై పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.
తెలంగాణ డైరెక్టరేట్ పబ్లిక్ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ (అడ్మిన్)గా కాకుమాను శశిశ్రీ బాధ్యతలు చేపట్టారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. వైద్య ఆరోగ్యశాఖలో అపారమైన అనుభవం కలిగిన అధికారి రావడంతో అధికారులు, ఉద్యోగులు పట్లఉద్యోగులు వర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆడపడుచులకి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఆడవపడుచులు బతుకమ్మను రంగు పూలతో అలంకరించి పూజలు చేయడం ఆనందం కలిగిస్తుందన్నారు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉందని కీర్తించారు.
Sorry, no posts matched your criteria.