India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అది 25 AUG 2007 సాయంత్రం.. లుంబినీ పార్కులో ఫ్యామిలీస్, గోఖుల్ ఛాట్ వద్ద ఫుడీస్ ఛాట్ ఎంజాయ్ చేస్తున్నారు. సందడిగా ఉన్న ఆ ప్రదేశాల్లో క్షణకాలంలో ఆర్తనాదాలు, రక్తపు మడుగులో శరీరాలు పడి ఉండటంతో దేశమే ఉలిక్కిపడింది. 18ఏళ్ల క్రితం ఉగ్రవాదుల ఇనుప ముక్కల బాంబులు కుటుంబాలను చీల్చేశాయి. ఆ పరిస్థితులను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నగరవాసులకు చెమటలు పడతాయి. ఈ ఘటనల్లో 42 మంది మృతిచెందగా.. వందల మంది మంచానపడ్డారు.
మంజీరా బ్యారేజీకి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని జలమండలి ప్రకటించింది. మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా బ్యారేజీని అధికారులు పరిశీలించారు. గేట్లన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం మంజీరా బ్యారేజీ నుంచి 15,130 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలకు ఎలాంటి ఢోకా లేకుండా నీటి సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా జలమండలి అధికారులు తెలిపారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రాక నేపథ్యంలో ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంపై BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రికి విశ్వ విద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయమెందుకని ప్రశ్నించారు. ఈ కనీవినీ బందోబస్తు ఎందుకు? విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? అని నిలదీశారు.
నగరం మొత్తం వినాయక చవితి వేడుకల్లో మునిగి ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మాత్రం రాజకీయ కార్యకలాపాల్లో బిజీ బిజీగా ఉంది. ఇక్కడ ఏ పార్టీ నాయకుడు కలిసినా ‘మనకు ఎన్ని ఓట్లు వస్తాయి..’ అనే అడుగుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో ఆత్మీయ సమ్మేళనాలు, దావత్‌లు ఘనంగా జరిపేందుకు ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సమ్మేళనాల బాధ్యతలు స్థానిక నాయకులకు అప్పగించి వారి ఓటు బ్యాంకును పటిష్ఠం చేసుకునే పనిలోపడ్డారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కులాల లెక్కలను తీస్తోంది. ఏయే సామాజికవర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయంపై పకడ్బందీగా ఆరా తీస్తోంది. అందుకే వివిధ సామాజికవర్గాలకు చెందిన మంత్రులను ఇన్‌ఛార్జీలుగా నియమించి ఓటుబ్యాంకు పక్కకు పోకుండా ప్రయత్నిస్తోంది. మంత్రులు పొన్నం(బీసీ), గడ్డం వివేక్(ఎస్సీ), తుమ్మల(ఓసీ)లకు బాధ్యతలు అప్పగించి అందరినీ సమన్వయపరుస్తూ విజయానికి పక్కా ప్రాణాళిక రచిస్తోంది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మృతి అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. బీసీ రిజర్వేషన్ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు బీసీ నాయకుల గురించే గాంధీ భవన్‌లో చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. బీసీ నాయకులైన విద్యావేత్త భవాని శంకర్, నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్‌లలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. వీరు ఎవరికి వారు ఢిల్లీ నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌కు కాంగ్రెస్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల చర్చల నేపథ్యంలో ఈ సెగ్మెంట్ బీసీలకు కేటాయిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తుండటంతో ఆయనకు టికెట్ దక్కేది కష్టమేనని పరిశీలకులు భావిస్తున్నారు. అయినప్పటికీ తనకు టికెట్ కచ్చితంగా వస్తుందని అజర్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును సోలార్ కారిడార్‌గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హెచ్ఎండీఏ అధికారులు ఇప్పటికే 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌పై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు 16 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే 158 కిలోమీటర్లు ఉన్న ఔటర్లో సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి 100 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ పరివాహక ప్రాంతంలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వివరాలు తెలిస్తే అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ SHO నంబర్ 8712660590కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
రాష్ట్రంలో ఇపుడు ఎక్కడ చూసినా 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనే సాగుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నిర్ణయంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించి బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు చెప్పకనే చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.