India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌లోనే నమోదవుతున్నాయని టీజీడీపీఎస్ వెల్లడించింది. దుండిగల్, మౌలాలి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలుల ధాటికి నగరవాసులు అల్లాడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 3.71లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయాలు జరగ్గా, రూ.1,008 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు GOVT ఇసుక మాఫియాను సమర్థంగా అరికట్టింది. గతేడాది ప్రభుత్వం రూ.738కోట్లు మాత్రమే ఆర్జించింది. స్థానికంగా ఇసుక లభ్యతను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో 17, HYD చుట్టూ 4 ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

HYD శివారులోని 74 గ్రామ పంచాయతీల పరిధిలో హెచ్ఎండీఏ (HMDA), కొత్తగా ఏర్పాటైన ఎఫ్‌సీడీఏ (FCDA) మధ్య తీవ్ర అధికార పోరు సాగుతోంది. లేఅవుట్ పర్మిషన్లు, డెవలప్‌మెంట్ ఫీజుల రూపంలో వచ్చే సుమారు రూ.500 కోట్ల ఆదాయం ఎవరికి చెందాలనే దానిపై స్పష్టత లేక ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి. రెండు సంస్థల జోక్యంతో న్యాయపరమైన చిక్కులు వస్తుండటంతో అటు పర్మిషన్లు రాక సామాన్యులు, ఇటు ఆదాయం లేక ఖజానా నష్టపోతున్నాయి.

2026-2027 కొత్త ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లు చెల్లించడంలో TG GOVT E-PPO (ఎలక్ట్రిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్) అనే ఓ కొత్త విధానాన్ని 2 నెలల్లో ప్రవేశపెట్టనుంది. తద్వారా పెన్షన్‌దారులు ఆఫీస్‌కు వెళ్లకుండా తమ వివరాలను నేరుగా అప్‌డేట్ చేసుకోవడం, 12 నంబర్లతో ఉన్న ఒక కోడ్ ద్వారా ప్రతి నెల పెన్షన్ పొందడం, మరణించిన వారి చెల్లింపులు తక్షణం నిలిపివేయడానికి సహాయపడుతుంది.

సొంతంగా ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు కలెక్టర్ తీపి కబురు అందించారు. ఎస్సీ కార్పొరేషన్ (2025-26) స్వయం ఉపాధి రుణాల దరఖాస్తు గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి ఏప్రిల్ 2వ తేదీతోనే ఈ గడువు ముగిసినప్పటికీ, మరికొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు గడువు పెంచారు. అర్హులైన అభ్యర్థులు <

HYD శివారు మేడిపల్లి PS పరిధిలో అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు. చెంగిచర్ల గణేష్‌నగర్‌కు చెందిన పండిపాటి బక్కయ్య (33) గతేడాది DEC30న పనికి వెళ్లి కనిపించకుండా పోయాడు. JAN21న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కొర్రెముల మూసీ వంతెన వద్ద సంచిలో ఎముకలు స్వాధీనం చేసుకున్నారు. పని ప్రాంత వివాదమే హత్యకు కారణమని నిర్ధారించారు.

ఐటీ కారిడార్‌లోని సైబర్ టవర్స్ వద్ద మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఉదయం వేళ కేవలం ఒక గంటలోనే ఏకంగా 10,138 మంది ఒంటరి వాహనదారులు (సింగిల్ రైడర్లు) వెళ్లినట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నారని తేలింది. ఈ స్థాయిలో సింగిల్ రైడర్ల సంఖ్య పెరగడం వల్లే రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టులు కేటాయిస్తూ సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాణి ప్రసాద్‌ను యువజన అభివృద్ధి, పర్యాటకం, సంస్కృతి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టులు కేటాయిస్తూ సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాణి ప్రసాద్‌ను యువజన అభివృద్ధి, పర్యాటకం, సంస్కృతి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. జయేష్ రంజన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. క్రీడా శాఖకు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి గురువారం అకస్మాత్తుగా మీర్ఖాన్‌పేట్‌లో FCDA ఆఫీస్ నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి పనులు తొందరగా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం పక్కనే నిర్మాణం అవుతున్న స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను సైతం పరిశీలించారు. సీఎం వెంట FCDA కమిషనర్ శశాంక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ సుధీర్‌బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.