Hyderabad

News April 2, 2026

HYD: బల్దియాలో ‘డీజిల్’ దందా.. తిరగని బండ్లు, కోట్ల బిల్లులు!

image

మున్సిపల్ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. గల్లీల్లోకి రాని స్వచ్ఛ ఆటోలు, ట్రక్కులు తిరిగినట్లు GPSలో మాయాజాలం చేస్తూ కోట్ల రూపాయల డీజిల్ బిల్లులు డ్రా చేస్తున్నట్లు వెల్లడైంది. విజిలెన్స్ తనిఖీల్లో 15% వాహనాల రీడింగ్‌లకు, బంక్ బిల్లులకు పొంతన లేకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. తప్పుడు లాగ్ బుక్కులతో ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్న అధికారుల బాగోతంపై విజిలెన్స్ నివేదిక సిద్ధమైంది.

News April 2, 2026

జలమండలిలో ‘మీటర్’ మాయ.. రూ.200 కోట్ల దోపిడీ!

image

జలమండలి ఆదాయానికి లైన్‌మెన్లు భారీ గండి కొడుతున్నారు. నగరంలో 80% కనెక్షన్లకు మీటర్లు పనిచేయకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కమర్షియల్ భవనాల నుంచి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. 2024-25 ఆడిట్ ప్రకారం ‘నాన్-రెవెన్యూ వాటర్’ లెక్కలు 50% దాటడం గమనార్హం. దీనివల్ల ఏటా రూ.200 కోట్ల ఆదాయం గాలిలో కలిసిపోతోంది. అవినీతికి పాల్పడుతున్న క్షేత్రస్థాయి సిబ్బందిపై వేటు వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News April 2, 2026

హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

image

నగర వ్యాప్తంగా హనుమాన్ శోభాయాత్రలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ప్రధానంగా గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర సాగుతున్న ‘శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర’లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రూట్‌లో ఆంక్షలు విధించడంతో అబిడ్స్, కోఠి, నాంపల్లిలో ట్రాఫిక్ జామైంది. అటు కర్మన్‌ఘాట్ ర్యాలీతో దిల్‌సుఖ్‌నగర్‌లోనూ వాహనదారులు క్యూ కట్టారు.

News April 2, 2026

మూసీ ప్రక్షాళనకు లైన్ క్లియర్.. ఎన్జీటీలో పిటిషన్ కొట్టివేత

image

మూసీ సుందరీకరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన ‘గాంధీ సరోవర్’పై NGT పచ్చజెండా ఊపింది. పర్యావరణ అనుమతుల సాకుతో ప్రాజెక్టును అడ్డుకోవాలని BRS నేత వేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ కొట్టేసింది. ఇది కేవలం రాజకీయ దురుద్దేశమేనన్న ప్రభుత్వ న్యాయవాదుల వాదనతో ఏకీభవించింది. దీంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగి, మూసీ ప్రక్షాళన పనులకు మార్గం సుగమమైంది. ఇక పనులు పరుగులు పెట్టడమే ఉంది.

News April 2, 2026

HYD: లవ్ మ్యారేజ్.. అమ్మాయి సూసైడ్

image

మియాపూర్ PS పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ 2020లో పరిచయం ఏర్పడింది. ఇటీవల వివాహం చేసుకున్నారు. వివాహానంతరం నగరంలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతుల మధ్య కట్న వేధింపులు జరుగుతున్నట్లు సమాచారం. అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన ఇషిక యాదవ్ ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

HYD: టౌన్ ప్లానింగ్, రెవెన్యూలో అక్రమాల గుట్టురట్టు

image

LBనగర్, సరూర్‌నగర్ సర్కిళ్లలో మ్యుటేషన్లు, ప్లాన్ అప్రూవల్స్‌పై విజిలెన్స్ పంజా విసిరింది. ఫైల్ నం. LBN/TP/2025/1104 సహా 14 కీలక ఫైళ్లను సీజ్ చేసింది. పాత తేదీలతో అనుమతులిచ్చినట్లు నిర్ధారణైంది. నిందితులు సెక్షన్ ఆఫీసర్ కే.సత్యనారాయణ(టౌన్ ప్లానింగ్), ఆర్ఐ బీ.రాంరెడ్డి(రెవెన్యూ), ముగ్గురు ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి ఫోన్లలో అధికారులతో జరిపిన నగదు లావాదేవీల చాటింగ్‌లు బయటపడ్డాయి.

News April 2, 2026

HYD: ‘నో సిగ్నల్ జోన్స్’కోసం వెతుకులాట!

image

​గచ్చిబౌలి గ్లాస్ బిల్డింగ్‌ల మధ్య కాదు.. ఇప్పుడు సిటీ శివార్లలో మన జెన్-జీ వెతుకుతున్నారు. ఇన్‌స్టా స్టోరీలకు కాదు.. ‘ప్రైవసీ’ కోసం ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ‘డంప్ యార్డ్’ స్టైల్ పార్టీలు చేసుకుంటున్నారు. పబ్లిసిటీ లేని పక్కా లోకల్ కిక్కు! ‘సైలెంట్ వాక్స్’ గ్రూపులు కడుతున్నారు. ఎవరికీ చిక్కని, దొరకని ఈ ‘అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్’ ఇప్పుడు HYDలో సెన్సేషన్. యువతలో వస్తున్న ఈ మార్పు మైండ్ బ్లోయింగ్!