India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుకు నేడే (ఏప్రిల్ 4) చివరి గడువు. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి భారీగా ఆలస్య రుసుము వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 లోపు రూ.250, 20 లోపు రూ.2,500, 24 లోపు రూ.5,000 అదనంగా చెల్లించాలి. మే 2 వరకు దరఖాస్తు చేసుకునే వారు ఏకంగా రూ.10వేలు లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తుకు నేడే (ఏప్రిల్ 4) చివరి గడువు. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి భారీగా ఆలస్య రుసుము వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 లోపు రూ.250, 20 లోపు రూ.2,500, 24 లోపు రూ.5,000 అదనంగా చెల్లించాలి. మే 2 వరకు దరఖాస్తు చేసుకునే వారు ఏకంగా రూ.10వేలు లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు గమనించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

HYDలో రైస్ కుక్కర్లు, చోటా గ్యాస్ స్టవ్, సిలిండర్లు, ఇండక్షన్ స్టవ్, నాన్‌స్టిక్ సామగ్రి, ఎలక్ట్రిక్ హీటర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉప్పల్, అత్తాపూర్, తార్నాక, ఎల్బీనగర్‌లో 2నెలలతో పోలిస్తే సుమారు 20% వరకు రేట్లను పెంచి విక్రయిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు స్టోర్లలో రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ స్టవ్స్ స్టాక్ లేదు. LPG కొరతను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని వాపోతున్నారు.

చదువు, ఇంటిపనులతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI) వినియోగంలో అమ్మాయిలు ముందంజలో ఉన్నట్లు తాజా టెక్ Z సర్వే వెల్లడించింది. అబ్బాయిల కంటే అమ్మాయిలు 81% ఎక్కువగా AI టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని తేల్చింది. నగరంలో చదువు, ప్రాజెక్టులు, డిజిటల్ పనుల్లో అమ్మాయిల వినియోగం గణనీయంగా పెరిగింది. టెక్నాలజీలో వారి చురుకుదనం స్పష్టమవుతోందని పేర్కొంది.

HYDలో విషాద ఘటన జరిగింది. ప్రేమపెళ్లికి సిద్ధమైన KPHBకి చెందిన లోకేశ్ పెళ్లి దుస్తులు ధరించి ఓయోలో ఉన్నానని యువతిని భోజనం తీసుకురమ్మని చెప్పాడు. ఆమె వచ్చి తలుపు కొడితే తీయలేదు. దీంతో సిబ్బంది సాయంతో తలుపు బద్దలు కొట్టగా అతడు అప్పటికే ఉరేసుకుని కనిపించాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నాక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2026లో నిఖత్ జరీన్, ప్రియా, ప్రీతి పవార్ సెమీఫైనల్స్‌కు చేరడంతో భారత్‌కు మూడు పతకాలు ఖరారయ్యాయి. నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో అద్భుత విజయం సాధించి చైనాకు చెందిన వు యూతో సెమీస్‌లో తలపడనున్నారు. ప్రియా, ప్రీతి తమ తమ విభాగాల్లో గెలిచి ఫైనల్ దిశగా ముందుకు సాగుతున్నారు. పురుషుల 70 కేజీల విభాగంలో దీపక్ క్వార్టర్ ఫైనల్లో ఓడి పోటీల నుంచి నిష్క్రమించారు.

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని నల్లమల అడవుల్లోని సలేశ్వరం లింగమయ్య జాతర నేటితో అధికారికంగా ముగిసింది. అటవీ శాఖ అనుమతి గడువు ముగియడంతో భక్తులు పరిస్థితిని గమనించి అధికారులకు సహకరించాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. అటవీ మార్గంలో ప్రయాణించేటప్పుడు క్రమశిక్షణతో ఉంటూ, సురక్షితంగా తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. కాగా అధికారుల ప్రకటనతో గడువు పొడిగింపు లేదని స్పష్టమైంది. SHARE IT

కేరళంలోని కొచ్చి ఎస్‌డీఐలో గిరిజన యువతకు 6 నెలల ఉచిత రెసిడెన్షియల్ నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు HYD జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటజీ తెలిపారు. బీపీసీఎల్ సహకారంతో ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ITI, డిప్లొమా అర్హత ఉండి, 25ఏళ్లలోపు అభ్యర్థులు https://www.dsaponline.com/sds/form/register.phpలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

GO. నెం.104 ద్వారా ‘ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి కోసం ప్రభుత్వం FCDAను ఏర్పాటు చేసింది. గతంలో HMDA పరిధిలోని మహేశ్వరం, కందుకూరు, ఆమనగల్లు మండలాల పరిధిలోని 74 గ్రామ పంచాయతీలను దీని కిందకు బదిలీ చేశారు. అయితే, పాత సాఫ్ట్‌వేర్ (DPMS) ద్వారానే లేఅవుట్ డెవలప్‌మెంట్ ఫీజులు వసూలవుతన్నాయి. ఈ ఆదాయాన్ని ఏ అకౌంట్స్ హెడ్ కింద జమ చేయాలో తేలక సుమారు రూ.500 కోట్లు ట్రెజరీలోనే నిలిచిపోయాయి.

తెలంగాణలో మార్చి 6వ తేదీ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా ఇబ్బందులను పరిష్కరించడం లాంటివి చేపట్టాల్సి ఉంది. మరీ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం కొనసాగుతుండగా మీ ప్రాంతంలో సమస్యలను అధికారులు తీర్చారా..?, మీ వద్దకు వచ్చారా..? మీరు ఇందులో భాగమయ్యారా..? కామెంట్ రూపంలో తెలపండి.
Sorry, no posts matched your criteria.