Hyderabad

News August 19, 2024

స్పీకర్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ MLA గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంత్రి సీతక్క సోమవారం రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. మంత్రి సీతక్కతో పాటు నారాయణపేట, సత్తుపల్లి శాసనసభ్యులు చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయిలు తదితరులు రాఖీలు కట్టారు.

News August 19, 2024

HYD: పర్యావరణ పరిరక్షణకు ‘హైడ్రా’ తరహా వ్యవస్థ

image

పర్యావరణ పరిరక్షణకు ‘హైడ్రా’ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం కౌన్సిల్ అధ్యక్షుడు రంగయ్య మీడియాతో మాట్లాడారు. నెల కింద ఏర్పాటైన హైడ్రా అద్భుతాలు చేస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.

News August 19, 2024

HYD: వాహనదారులకు రాఖీ కట్టిన మహిళా పోలీసులు

image

HYD నగరంలోని రాచకొండ ట్రాఫిక్ మహిళా పోలీసులు వివిధ ప్రాంతాలలో రాఖీ పండుగ సందర్భంగా వాహనదారులకు రాఖీ కట్టారు. రాఖీ రక్షణకు గుర్తింపు అని మహిళా పోలీసులన్నారు. అనంతరం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. వాహనదారులందరూ సంతోషంగా, క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని కోరుకున్నట్టు తెలిపారు.

News August 19, 2024

మారేడ్ పల్లి: జూనియర్ అధ్యాపకుల వివరాల సమీకరణ

image

ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకుల వివరాలు సొసైటీ సమీకరిస్తోంది. ఇటీవల బదిలీల ఆనంతరం ఎంత మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు? ఖాళీల సంఖ్య ఎంత? ఎక్కడైనా పరిమితికి మంచి ఉన్నారా? వంటి గణాంకాలు వెంటనే ఇవ్వాలని సొసైటీ ప్రిన్సిపల్స్ ను ఆదేశించింది. సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ తో పాటు జనరల్, ఒకేషనల్ కళాశాలలు ఈ వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.

News August 19, 2024

నాంపల్లి: ఈనెల 24 వరకు గడువు పొడిగింపు

image

బీసీ గురుకుల ఫైన్ఆర్ట్స్ డిగ్రీ కళాశాల బీఏ(యానిమేషన్ వీఎస్ఎక్స్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 24 వరకు పొడిగించినట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు బీసీ గురుకుల వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. వివరాలకు 9032614463, 9063242329 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News August 19, 2024

మిర్రర్ ఇమేజ్ తరహాలో పాఠ్య పుస్తకాలు

image

మిర్రర్ ఇమేజ్ తరహాలో పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని 890 బడుల్లో 8, 9 తరగతి వారికి రెండేళ్ల నుంచి వీటిని అందిస్తున్నారు. పుస్తకంలో తొలిపేజీ ఆంగ్లం.. రెండో పేజీ తెలుగు, మూడో పేజీ ఆంగ్లం నాలుగో పేజీ తెలుగు ఇలా పుస్తకాలను ప్రచురించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లిష్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఉపయెగపడుతున్నాయి.

News August 19, 2024

HYD: సమస్యలపై మహిళా కమిషన్ వద్దకు జూడాలు

image

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారదతో ఉస్మానియా, గాంధీ జూడాలు సమావేశమయ్యారు. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం అందించారు. రాత్రి విధుల్లో ఉండే మహిళా వైద్య సిబ్బందికి, ప్రత్యేక విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూడాల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

News August 19, 2024

HYD: RRRకు మార్గం సుగమం

image

హైదరాబాద్ ఓఆర్ఆర్ అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను కేంద్రం ప్రాధాన్యం ఇవ్వనుంది. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యాచరణ-2047లో RRRను తాజాగా చేర్చారు. వికసిత్ భారత్‌లో భాగంగా విస్తరించాల్సిన రహదారుల ప్రణాళికను కేంద్రం ఇటీవల రూపొందించింది. ఆ జాబితాలో ప్రాంతీయ రింగు రోడ్డును కూడా చేర్చడంతో దీని నిర్మాణ ప్రక్రియ వేగం అందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.

News August 19, 2024

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు కొత్త సమస్యలు

image

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్ ఇప్పడు కొత్త సమస్యలకు తెర లేపుతుంది. భూసేకరణకు భిన్నమైన పరిస్థితులే ఎంఆర్‌డీసీఎల్‌కు ఎదురవుతున్నాయి. మూసీ బఫర్‌ జోన్‌గా నదికి ఇరువైపులా 50 మీటర్లు ఖరారు చేసే యోచనలో ఉండగా.. ఇదే అన్ని సమస్యలకు ప్రధాన కారణం కానుంది. 13వేలకు పైగా ప్రాపర్టీలు గుర్తించింది. దాంట్లో ఆలయాలు, వక్ఫ్ ఆస్తులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి. వీటిని తొలగించడం క్లిష్ట ప్రక్రయే అనిపిస్తుంది.

News August 19, 2024

HYD: ఉద్యోగం అంటూ.. డబ్బు డిమాండ్ చేశారా?

image

ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఆన్లైన్‌లో నకిలీ ఉద్యోగ సంస్థల వలలో చిక్కి మోసపోవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ‘X’ వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టబద్ధమైన సంస్థలు ఉద్యోగ ఆఫర్ కోసం అభ్యర్థుల నుంచి డబ్బు అడగవని, ఎవరైనా డబ్బులు అడిగితే మోసమని గుర్తించాలన్నారు. ఫిర్యాదుల కోసం 1930కి లేదా డయల్ 100కి కాల్ చేయాలన్నారు.