India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గణేశ్ చతుర్థిని పురస్కరించుకుని మట్టి గణపతి విగ్రహాల పంపిణీ మొదలైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ఏడాది 2 లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ఈ విగ్రహాలు ఆగస్టు 25, 26 తేదీలలో జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. పర్యావరణ హితమైన గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని ప్రజలకి సూచించారు.
కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసులో పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు వెంకట్ వివిధ కారణాలతో డిప్రెషన్‌కు గురైనట్లు గుర్తించారు. బ్యాట్‌ను దొంగలిస్తుండగా చూసి తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర అనడంతో భయమేసి కత్తితో పొడిచానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చెల్లి లాంటిదని, ఎలాంటి తప్పు చేయలేదంటూ బదులిచ్చినట్లు సమాచారం.
పేపర్ లీకుల వల్ల విద్యార్థి, నిరుద్యోగులకు జరిగే నష్టాలు, నాణ్యత లేని విద్య వల్ల యువత ఎదుర్కొనే ఇబ్బందులను యూనివర్సిటీ పేపర్ లీకు సినిమాలో డైరెక్టర్ నారాయణమూర్తి అద్భుతంగా చూపించారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. HYDలో సినిమాపై మీడియాతో మాట్లాడిన ఆయన యువత అందరూ చూడాల్సిన సినిమా అని కొనియాడారు.
సముద్రాలైనా ఈదొచ్చుకానీ కుటుంబ కష్టాల కడలిని ఈదలేం అనే పెద్దల మాటకు ఈయన పరిస్థితి నిలువుటద్దం. ఉప్పల్‌లో ఫుట్‌పాత్‌పై పడుకున్న ఓ వ్యక్తిని కదిలిస్తే..‘రాత్రి నిద్ర పట్టడం లేదు. సుక్కేసి పడుకుందామని ఇంటికెళ్తే కుటుంబ కష్టాలు గుర్తొచ్చి బాధైతుంది’ అంటూ రాత్రికి అక్కడే కునుకు తీస్తున్నట్లు తెలిపారు. మధ్యతరగతి కుటుంబాన్ని నెట్టుకురావడం ఎంత కష్టమో ఆ వ్యక్తి చెబుతుంటే పలువురు తదేకంగా విన్నారు.
ఒడిశాలోని పూరి సముద్రంలో లంగర్‌హౌస్‌లోని జానకి నగర్‌కు చెందిన వికాస్ (24) ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. అతడి భార్య శాలిని వివరాలిలా.. కుటుంబంతో కలిసి జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం గోల్డెన్ బీచ్ వద్దకు వెళ్లాం. వికాస్ సముద్రతీరంలో అలలతో ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఇప్పటివరకు మృతదేహం లభ్యంకాలేదని ఆమె వాపోయింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
HYDలో సృష్టి ఘటనతో సంతాన సమస్యలు ఉన్న వారు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారికి వరప్రదాయానిగా ప్రభుత్వ ఆస్పత్రులు నిలుస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్, ప్లేట్ల బురుజు ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కొండాపూర్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
# SHARE IT
పలు రకాల బస్సుల్లో ప్రయాణానికి డిస్కౌంట్లు ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. HYD నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే లహరి NON-AC, సూపర్ లగ్జరీ బస్సుల్లో 15%, లహరి AC, రాజధాని AC బస్సుల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. HYD నుంచి కడప, ఒంగోలు, కందుకూరు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, విజయనగరం, రాజమండ్రి, కాకినాడ, సహా అనేక ప్రాంతాలకు వెళ్లే బస్సులకు వర్తిస్తుందన్నారు.
HYD సూరారం PS పరిధిలో 4వ అంతస్తు నుంచి ఐరన్ పైపు తలపై పడి అరవింద్ అనే వ్యక్తి చనిపోయాడని పోలీసులు తెలిపారు. అరవింద్ బిల్డింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ మల్లారెడ్డి ఆసుపత్రి ప్రాంగణంలో కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్ భవన పనులు పర్యవేస్తుండగా ఐరన్ పైప్ ఒక్కసారిగా పడిందన్నారు. తీవ్రగాయాలైన అతడిని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మరణించాడని చెప్పారు. ఈరోజు కేసు నమోదు చేశామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ దగ్గరికి వెళ్లిన ‘మన ఊరు-మన బడి’ కాంట్రాక్టర్లపై కేసు నమోదైంది. సైఫాబాద్ పీఎస్‌లో సీఐ ఫిర్యాదుతో 11 మంది కాంట్రాక్టర్లపై కేసులు నమోదయ్యాయి. ఇది కాంట్రాక్టర్లను భయపెట్టే, గొంతు నొక్కే కుట్ర మాత్రమే అని కాంట్రాక్టర్లు చెప్పారు. మమ్మల్ని కేసులతో బెదిరిస్తే వెనక్కి తగ్గమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంట్రాక్టర్లపై పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.
HYDలోని 2025-26 విద్యా సంవత్సరానికి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ (COE)TMR జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హులైన బాలికల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ ఈరోజు తెలిపారు. HYD జిల్లాలోని TMR జూనియర్ కళాశాలల్లో నిర్ణీత ఫార్మాట్స్ ఆఫ్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.