India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా డైరెక్టర్‌గా ప్రొ. ఎస్ఏ షుకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. పురాతన తాళపత్ర గ్రంథాలు, అరబిక్ గ్రంథాలను భద్రపరిచేందుకు నిజాంపాలనలో నెలకొల్పిన ఈ కేంద్రం ఓయూకు అనుబంధంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన షుకూర్ తిరిగి అదే పదవిలో నియమితులయ్యారు.
భారతీయ సంస్కృతికి చిహ్నం చీర కట్టు.. HYDలో ప్రప్రథమంగా మాంగళ్య షాపింగ్ మాల్ వారు శారీ డ్రాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. వనస్థలిపురంలోని షాపింగ్ మాల్‌లో చెన్నైకి చెందిన ప్రముఖ శారీ డ్రాపర్ కవిత చీర కట్టు ఎలా ఉండాలనే అంశాలను వివరించారు. ఆసక్తిగా గమనించిన ఫ్యాషన్ డిజైనర్స్, బ్యూటీ పార్లర్ నిర్వాహకులు యాజమాన్యాన్ని అభినందించారు. ఛైర్మన్ కాసం నమశ్శివాయ, డైరెక్టర్లు పాల్గొన్నారు.
35 ఏళ్ల తర్వాత ఒకే రోజు హోలీ, రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం ఒకేరోజు రావడంతో HYD సీపీ సీవీ ఆనంద్ అధికారులను అప్రమత్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ప్రతీ జోన్, సున్నితమైన ప్రాంతాల్లో పికెట్‌లు ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తులపై కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ చైతన్య కుమార్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI
ప్రముఖ యూనివర్సిటీ HCUకు అరుదైన గుర్తింపు లభించింది. లండన్‌కు చెందిన క్యూఎస్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలపై స్టడీ నిర్వహించి ర్యాంకింగ్స్ విడుదల చేసింది. 1700 విశ్వవిద్యాలయాల్లో సర్వే చేయగా ఏడు సబ్జెక్టుల్లో ర్యాంక్ పొందింది. లింగ్విస్టిక్స్, ఇంగ్లీష్, ఫిజిక్స్, సోషియోలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, బయోలాజికల్ సైన్స్‌లో ఉత్తమ ర్యాంకులను సాధించింది.
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.
హోలీ నేపథ్యంలో HYDలో ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 గం. నుంచి శనివారం ఉదయం 6 గం. వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వైన్సులతో సహా.. గ్రేటర్ పరిధిలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలుంటాయని ఆదేశించారు. రోడ్లపై వెళ్లే వారిపై అకారణంగా రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
HMDA పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని మండలాలను HMDA పరిధిలోకి తీసుకొచ్చింది. వీటిని చేర్చడం ద్వారా కొత్తగా HMDA పరిధిలో 3 వేల చ.కి.మీటర్ల భూ విస్తీర్ణం పెరిగింది.
యువతిపై ఫిలింనగర్ PSలో అట్రాసిటీ కేసు నమోదైంది. టోలిచౌకిలో ఒకే రూమ్‌లో ఉంటున్న తనను మరో యువతి మానసిక వేదనకు గురిచేస్తోందని, ప్రశ్నిస్తే యువకులను తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయసాగిందని బాధితురాలు తెలిపింది. ఇటీవల ఓ యువకుడికి తన ఫోన్‌తో మెసేజ్ చేసిందని, నిలదీస్తే ‘నిన్ను రేప్ చేయించి.. మర్డర్ చేయిస్తా’అంటూ బెదిరించిందని ఆమె వాపోయింది. ఈ మేరకు బాధితురాలు PSలో ఫిర్యాదు చేసింది.
హోలీ పండుగను పురస్కరించుకొని ఈనెల 14వ తేదీ ఉ.6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి గుంపులు గుంపులుగా తిరుగుతూ.. హంగామా చేస్తే చర్యలు తప్పవని హెచ్చారించారు.
Sorry, no posts matched your criteria.