India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహానగర వ్యాప్తంగా GHMCకి అనేక దుకాణాలున్నాయి. వాటిని అద్దెకు ఇచ్చి ఆదాయం పెంచుకునే ప్లాన్ చేస్తోంది. దాదాపు 954 దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా లీజు ముగిసినా చాలా మంది ఖాళీ చేయకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని గ్రేటర్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
నగరంలో నిన్న ప్రారంభమైన UPSC మెయిన్స్‌కు 3% మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. బ్లాక్- Aలో 576 మందికి 560 మంది, బ్లాక్ -Bలో 114 మంది రావాల్సి ఉండగా 109 మంది పరీక్ష రాశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని.. ఇందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వివరించారు.
నెహ్రూ జూపార్కు ఎన్‌క్లోజర్‌లోంచి ఓ సింహం బయటకు రావడంతో కలకలం రేగింది. ఎన్‌క్లోజర్ లోంచి సింహం బయటకు రావడాన్ని గుర్తించిన సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి సింహానికి మత్తు మందు ఇచ్చి లోపలకు పంపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎన్‌క్లోజర్ శుభ్రం చేసే సమయంలో సిబ్బంది బయట గడియ పెట్టకపోవడంతో సింహం బయటకు వచ్చినట్లు సమాచారం. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని క్యూరేటర్ వసంత హెచ్చరించారు.
రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి, ఛాత్ పండుగల సందర్భంగా రద్దీ ఉండనున్న నేపథ్యంలో 170 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు ఈ రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. చర్లపల్లి- రెక్సాల్, చర్లపల్లి- తిరుపతి, చర్లపల్లి- వెలాంకిణి తదితర ప్రాంతాల మధ్య ఈ రైళ్లు నడుస్తాయన్నారు.
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలోని ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ అర్షియా ఆజమ్ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ‘మనూ’ క్యాంపస్‌లోని ఐటీఐ కేంద్రం, విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. వివరాల కోసం 040–23008428, 9440692452 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.
తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ నెల 24న నృత్య నాటక సౌరభం నిర్వహించనున్నట్లు అకాడమీ ఛైర్‌పర్సన్ డా.అలేఖ్య పుంజాల తెలిపారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య, సినీ నటి జీవిత రాజశేఖర్ తదితరులు హాజరవుతారన్నారు. డా.స్మితా మాధవ్ ఆధ్వర్యంలో నృత్య రూపకంతోపాటు శరణు దాసు జానపద నాటకం ప్రదర్శన ఉంటుందని తెలిపారు.
ప్రముఖ రంగస్థల నటుడు పూర్ణచంద్రశేఖర్ (73) గుండెపోటుతో మృతి చెందారు. శేరిలింగంపల్లిలో ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దేశ, విదేశాలల్లో చంద్రశేఖర్ అనేక ప్రదర్శనతో పేరుగాంచిన ఆయన జానపద దినోత్సవం రోజే కన్నుమూయడం కళకారులను కంటితడిపెట్టించింది. 2006లో చమన్‌లాల్ అవార్డు, AP ఉగాది పురస్కారం, 6 సార్లు నంది అవార్డులు అందుకున్నారు.
ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకొస్తాయని BJP రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చాక అసలైన ఓటు చోరీకి పాల్పడింది నెహ్రూ కుటుంబమేనని విమర్శించారు.1947లో ప్రధానమంత్రి ఎన్నికకు రాజ్యాంగ పరిషత్‌లోని 15 ఓట్లకు 12 ఓట్లు సాధించిన సర్దార్ పటేల్ PM కాకుండా ఒక్క ఓటు వచ్చిన నెహ్రూ PM అయిన విషయం గుర్తెరగాలన్నారు.
మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం హర్షితరెడ్డి, రుచితారెడ్డిల భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన ఆహుతులను మైమరిపించింది. షణ్ముఖకౌత్వం, అలరిపు, జతిస్వరం, శబ్దం, పదవర్ణం, నటనం, రామచంద్రభజన, తిల్లాన, మంగళం తదితర అంశాలను ప్రదర్శించి వావ్ అనిపించారు. కర్నాటక్ సంగీత గురువు డా.మీనాక్షి పద్మనాభం, భరతనాట్యం గురువు డా.పి.ఇందిరాహేమ వారిని అభినందించారు.
కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పొందిన వారికి సెప్టెంబరు నెలలో రేషన్ పంపిణీ చేయనుంది. రేషన్ షాపులకు ఇండెంట్ ప్రకారం స్టాక్ సరఫరా చేస్తున్నారు. ఈ నెల 20 వరకు మంజూరైన కొత్త కార్డులకు బియ్యం ఇవ్వనున్నారు. HYD పరిధిలో మొత్తం కొత్తవాటితో కులుపుకుని 13.76 లక్షల కార్డులు ఉండగా 60.01 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. RRలో 4,21,400, మేడ్చల్‌లో 2,19,316 రేషన్ కార్డులు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.