India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ORR సమీపంలోని 51 గ్రామాలను మున్సిపాలిటీల్లోకి కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. తరువాత మున్సిపాలిటీలనూ జీహెచ్ఎంసీలో విలీనం చేసి ‘మహా’ బల్దియాను ఏర్పాటు చేయనున్నారు, ORR లోపల, వెలుపలున్న గ్రామాలను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు కసరత్తు చేశారు.
అవినీతికి పాల్పడటం, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులతో ఒకేసారి నలుగురు విద్యుత్తు ఇంజినీర్లపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నార్సింగి ఏఈ సందీప్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇబ్రహీంబాగ్ డీఈ శివశంకర్, ఏఏఈ జ్ఞానేశ్వరావులకు మెమోలు జారీ చేశారు. ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేడ్కర్‌ను కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు.
పార్కులు, ఆట స్థలాల కబ్జాపై అతి త్వరలో హైడ్రా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. చెరువుల్లో కబ్జాల తొలగింపు తర్వాత పార్కుల ఆక్రమణలపై కొరడా ఝళిపించే అవకాశం ఉంది. ఈ లోపు ఆక్రమణలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని లేఔట్‌లపై దృష్టి సారించింది. ఆయా లేఔట్లలో పార్కు స్థలంలో పాటు, ప్రజా అవసరాలకు కేటాయించాల్సిన స్థలాలపై దృష్టి సారించనున్నారు.
కోటి మంది మహిళలకు కృత్రిమ మేద(AI)లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలతో సవిత్ ఏఐ (సౌత్ ఏసియన్ ఉమెన్ ఇన్ టెక్) చేతులు కలిపింది. ఈ మేరకు టీ హబ్‌లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని పత్రాలు మార్చుకున్నారు. గూగుల్ ఉమెన్ టెక్ మేకర్స్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, నాస్కామ్, మీటై, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (పిక్కీ ఎఫ్ఎల్), షీరోస్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. సెప్టెంబరు 21 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.
HYD, RR, MDCL,VKB జిల్లాలలో జూన్, జూలై, ఆగస్టు లోటు వర్షపాతం నమోదు కాగా.. SEP-1 నుంచి 4 వరకు వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 4 రోజుల్లో ఏడాదికి సరిపోయేంత కురిసిందని అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు. అత్యధికంగా తాండూరులో 859.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట-843, యాలాల-824, దుండిగల్ గండి మైసమ్మ-812, శంకర్పల్లి-736.4, ఘట్కేసర్-713.9, ముషీరాబాద్-709.1, SEC-701.1 మి.మీ నమోదైంది.
తెలంగాణకు కృత్రిమ మేధ(ఏఐ)లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్ పక్కన తమ పట్టా స్థలాల రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటుకు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ బి.శరణప్పస్వామి మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టి.. ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయితి కారొబార్ & సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడrగా సాదుల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల, ముఖ్య నాయకుల కారొబార్, జీపీ సిబ్బంది సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు.
సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవానికి చేనేత వస్త్రాలను, శాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యా శాఖ అధికారులకు సూచించారు. చేనేత వస్త్రాలను ఉపయోగించినట్లైతే నేతన్నలందరికీ ఆర్థికంగా సహకరించినట్లు అవుతుందని మంగళవారం పేర్కొన్నారు. టీచర్స్‌డేకు సింథటిక్ శాలువాలకు బదులు కాటన్ శాలువాలు వాడాలన్నారు.
ఒక్కో జోన్లో 5 చెరువుల చొప్పున గుర్తించి సుందరీకరణ, అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ అధికారులను ఆదేశించారు. మహా నగరంలో చెరువుల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. కనీసం 50 చెరువులను గుర్తించి సీఎస్ఆర్ నిధులతో సుందరీకరణ, అభివృద్ధి చేపట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.