Hyderabad

News September 15, 2024

HYD: 16న నాగపూర్-సికింద్రాబాద్‌ ‘వందే భారత్’ ప్రారంభం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్(SEC) మార్గంలో ఈ నెల 16న వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగపూర్ నుంచి ఉ.5 గంటలకు బయలుదేరి మ.12:15కు SEC చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SEC నుంచి మ.1 గంటకు బయలుదేరి రా.8:20కు నాగపూర్ చేరుకుంటుంది.కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాంలో హాల్టింగ్ ఉంటుంది.

News September 15, 2024

గణపతి నిమజ్జనానికి A-Z సర్వం సిద్ధం: ఆమ్రపాలి

image

HYD సరూర్‌నగర్‌ చెరువు, జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌, బహదూర్‌పుర మీరాలం, కాప్రా ఊర చెరువులో గణేశ్ నిమజ్జనానికి A-Z సిద్ధం చేసినట్లు GHMC కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. 172 రోడ్ల మరమ్మతులు, 36 ట్రాన్స్‌పోర్ట్‌, 140 స్టాటిక్‌ క్రేన్‌లు, 295 మొబైల్‌ క్రేన్స్‌, 160 గణేశ్ యాక్షన్‌ టీమ్స్‌, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు, 308 మొబైల్‌ టాయిలెట్స్‌, 52,270 తాత్కాలిక స్ట్రీట్‌ లైట్స్‌ సిద్ధం చేసినట్లు చెప్పారు.

News September 15, 2024

సికింద్రాబాద్: 15,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

image

గ్రేటర్ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం 15,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీఆనంద్ తెలిపారు. ట్యాంక్ బండ్ సహా ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నిమజ్జనం రోజున ఉండే వేరే కార్యక్రమాలకు ప్రత్యేకంగా బందోబస్తు ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక సిబ్బందిని తెస్తున్నామన్నారు.

News September 15, 2024

HYD: శంషాబాద్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్

image

HYD శివారు శంషాబాద్ ప్రాంతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. RGIA సమీపాన దాదాపుగా 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటికే ఓ ఆఫీస్ టవర్ నిర్మాణం ప్రారంభం కాగా.. 2025-26 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ఇంజినీరింగ్ బృందం కసరత్తు చేస్తోంది. మరోవైపు నగరంలో AI సిటీ సైతం నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

News September 14, 2024

HYD: రెచ్చగొట్టే వారిని అణచివేయండి: మంత్రి

image

ఐక్యతకు హైదరాబాద్ ప్రతీకగా నిలిచిందని, అలజడలు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గ విభేదాలు సృష్టిస్తూ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణచివేయాలన్నారు.

News September 14, 2024

నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు

image

నిమ్స్‌లో ఈ నెల 22 నుంచి 28 వరకు యూకే వైద్యుల బృందం ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ సంచాలకుడు బీరప్ప శనివారం తెలిపారు. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలు అందించనున్నారు. వివరాలకు నిమ్స్‌లోని కార్డియో వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 14, 2024

గవర్నర్ వద్దకు వెళ్లిన సికింద్రాబాద్ ADRM

image

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వద్దకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే కమర్షియల్ మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాల్ వెళ్లారు. గవర్నర్ పిలుపు మేరకు వెళ్లిన అధికారి, రైల్వే అభివృద్ధి, ఇతర అంశాల గురించి విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిపారు. రైల్వే సేఫ్టీపై తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ వారికి సూచించారు.

News September 14, 2024

HYD: భార్య సహకారంతో అత్యాచారం.. ఆపై హత్య

image

భార్య సహకారంతో భర్త అత్యాచారం చేసి క్రూరంగా హింసించి హత్య చేసిన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. VKB జిల్లా పెద్దేముల్‌‌కు చెందిన భార్యభర్తలు కురువ స్వామి, నర్సమ్మ సంగారెడ్డిలో స్థిరపడ్డారు. కూలీ ఇప్పిస్తామని చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి మహిళలపై హత్యాచారం, దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రంగారెడ్డి కోర్టు భర్తకు 10ఏళ్లు, భార్యకు 7ఏళ్లు, ఇదే తరహా కేసులో మరో ఏడాది జైలుశిక్ష విధించింది.

News September 14, 2024

HYD: CM రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ..!

image

✓చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్ చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలి.
✓చర్లపల్లి పరిసర అటవీ శాఖ, పరిశ్రమల విభాగాల భూములు స్వాధీనం చేసుకోవాలి.
✓చర్లపల్లిలో పలు పరిశ్రమలను వేరే ప్రాంతానికి తరలించాలి.
✓మూసి డెవలప్మెంట్‌పై ఫోకస్ పెట్టి, బాధిత నిర్వాసితులకు భరోసా కల్పించాలి.
✓ఇంటింటికి చెత్త సేకరణ కోసం వీలైతే GIS, QR కోడ్ స్కానింగ్ సాంకేతికత ఉపయోగించండి.

News September 14, 2024

HYD: సెప్టెంబర్ 17న సెలవు.. ఆరోజు రావాల్సిందే!

image

గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 17న మంగళవారం జంట నగరాలు HYD, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ రోజున సెలవు ఇస్తుండటంతో నవంబర్ 9 రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు. అక్టోబర్‌లో దసరా సెలవులు ఉన్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు.