India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్: రోడ్ల మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) తరహాలో రోడ్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు కసరత్తు ప్రారంభించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డు ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని ఇతర రహదారులను కూడా మెరుగుపరచడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
రావిర్యాలలో SBI <<15626678>>ఏటీఎంను చోరీ<<>> ఘటనపై పోలీసులు 3 బృందాలతో గాలిస్తున్నారు. హరియాణా దొంగలుగా భావిస్తున్న పోలీసులు.. ముంబైవైపు వారు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. 2019లోనూ ఇదే తరహాలో ఆదిభట్లలో ఏటీఎం చోరీ జరిగినట్లు తెలుస్తోంది. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక అలారం మోగకుండా కేబుళ్లను తెంపేసి, సీసీ కెమెరాలపై నల్లటి స్ప్రేను చల్లి ఏటీఎం ధ్వంసం చేసి రూ.29.70 లక్షల నగదును దోచుకెళ్లారు.
రాష్ట్ర గణాంకాల నివేదిక-2024 వివరాలు విడుదలయ్యాయి. ఈ నివేదికలో కీలక అంశాలను పొందుపరిచారు. స్థూల జిల్లా జాతీయ ఉత్పత్తిలో 2022-23లో రంగారెడ్డి జిల్లా రూ.2.85 లక్షల కోట్లతో ఉండగా, హైదరాబాద్ రూ.2.30 లక్షల కోట్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రూ.88,940 కోట్లతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు.
CYB కమిషనరేట్ పరిధి 510 ప్రాంతాల్లో శనివారం DCPల ఆధ్వర్యంలో రైడ్స్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్న 380 మందిని అదుపులోకి తీసుకోగా.. గంజాయి తాగుతున్న14 మందిని పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా కేసులు 1, వ్యభిచారం 26, నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులపై2, బహిరంగ ప్రదేశాల్లో మందు తాగిన ఘటనలో 15 కేసులు, న్యూసెన్స్ 57, నంబర్ ప్లేట్ లేని 18 వాహనాలపై కేసులు నమోదు కాగా 4 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రమంత్రులతో సమాలోచనలు చేయనున్నారు. ఈ భేటీలో కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహాయం పొందేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారుడు హరిహర గోపాల్, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ఆయన పర్యటనలో పాల్గొనేందుకు అధికారులంతా సిద్ధమయ్యారు. ఉపరాష్ట్రపతికి సన్మానం చేసిన మంత్రి, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రమంత్రి సహకారం కోరారు. అనంతరం ధన్‌ఖడ్ పలువురు నేతలతో భేటీ కానున్నారు.
సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఇంకెప్పుడు ప్రారంభిస్తారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మద్దతు ధర రూ.7,280 ఉంటే.. దళారులకు రూ.5,500 నుంచి రూ.6వేలకే విక్రయించాల్సిన దుస్థితిని రైతులకు తెచ్చారని మండిపడ్డారు. క్వింటాల్‌కు రూ.వెయ్యికి పైగానే రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయంలో నూనె పంటలకు ప్రోత్సాహం.. కాంగ్రెస్ పాలనలో తిరోగమనం అని ధ్వజమెత్తారు.
ప్రశాంతంగా ఉన్న గ్రేటర్ నగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడితో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రోజుకో చోట పలువురు నేతలు ఎమ్మెల్సీ సీట్ గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. గ్రేటర్‌లో మంచి పట్టున్న బీసీ నేత అంజన్ కుమార్ యాదవ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి.. వచ్చే GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ మార్క్ చూపించేలా ఆలోచన చేయాలని పలువురు నేతలు హైకమాండ్‌కు సూచిస్తున్నట్లు పలువురు సీనియర్ నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే SLBC టర్మినల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిశాయని కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య అన్నారు. తెలంగాణ భవన్ బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులపై చిన్న చూపు చూడడం సరికాదన్నారు.
Sorry, no posts matched your criteria.