India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మోండా మార్కెట్ PS పరిధిలో జులై 30న జరిగిన ఘటనలో పాట్ మార్కెట్ మార్వాడి వ్యాపారస్తులకు ఎలాంటి సంబంధం లేదని బాధితుడు సాయి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ రోజు తనకు, ఎస్కే జ్యువెల్లర్స్ వ్యాపారుల మధ్యనే వివాదం జరిగిందన్నారు. రోడ్డుపై హారన్ కొట్టడంతో జరిగిన వివాదం SC, ST కేసు వరకు వెళ్లగా, కొందరు తమ మధ్య జరిగిన గొడవను పాట్ మార్కెట్ వ్యాపారుల అందరితో కలిపి ముడి పెట్టారన్నారు.
తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణాలు పోశాడు. మియాపూర్‌కు చెందిన కృష్ణ సుమంత్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. AUG 18న విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై, ఆస్పత్రిలో చేరాడు. బుధవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. జీవన్‌దాన్ వారు కృష్ణ తండ్రితో మాట్లాడి గుండె, కిడ్నీలు, లివర్, లంగ్స్, కళ్లు దానం చేయమన్నారు. అవయవదానం చేసి కృష్ణ ఏడుగురికి పునర్జన్మ ఇచ్చాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం EC కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదు, మార్పు చేర్పులకు అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి 17 వరకు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. 25 లోపు అభ్యంతరాలను పరిష్కరించాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30న తుది జాబితా విడుదల కానుంది. జులై 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటురు నమోదు చేసుకోవచ్చు.
SHARE IT
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు కొత్త మార్పులు వచ్చాయి. హైదరాబాద్ పోలీసులు, HCSCతో కలిసి 50 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్‌లు, 100 మంది ట్రాఫిక్ మార్షల్స్‌ను ప్రారంభించారు. ఇందులో భారతదేశంలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లను కూడా నియమించారు. ఈ మార్షల్స్ పోలీసులకు సహకరిస్తారు. ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ చర్యలు తీసుకున్నారు.
స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ బద్ద సంస్థలను BJP ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి, అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుందని CPI జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాజుల రామారం మహారాజా గార్డెన్స్‌లో జరుగుతోన్న CPI మహాసభల్లో 2వ రోజు పాల్గొని, ప్రసంగించారు. BJP ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని నారాయణ పిలుపునిచ్చారు.
TPCC ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఈరోజు గాంధీభవన్‌లో మాట్లాడారు. ‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్.. అంత గొప్ప పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా ఎవడ్రా నువ్ KTR.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే నీ అయ్య KCR ఈ జన్మలో CM కాకపోతుండే, నువ్ మంత్రి కాకపోతుండే.. థర్డ్ క్లాస్ నా కొడుకులు మీరు.. నీ అయ్య చీప్ లిక్కర్ తాక్కుంటా పండి, తాగుబోతు పార్టీ పెట్టిండు.. నీ అయ్య చరిత్ర తెలుసుకో’ అని అన్నారు.
2025-26 విద్యా సంవత్సరంలో ఇంకా ఇంటర్‌లో చేరని విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ నెల 31లోపు తమకు నచ్చిన కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవచ్చని పేర్కొంది. ఆయా కళాశాలల ప్రిన్సిపళ్లు విద్యార్థులకు సహకరించాలని కోరింది. ఇదిలా ఉండగా జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకునే సమయంలో సంబంధిత కాలేజీకి బోర్డు గుర్తింపు ఉందో, లేదో పరిశీలించాలని తల్లిదండ్రులకు సూచించింది.
జలమండలి పరిధిలో దాదాపుగా 5,000 వరకు గృహాలకు సరఫరా చేసేందుకు మెయిన్ వాల్వ్‌లు ఉన్నాయి. వీటిలో మొదట 1000 వాల్వ్‌లను స్మార్ట్ వాల్వ్‌లుగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్మార్ట్ ఆటోమేటిక్ వాల్వ్‌లతో నిర్ణీత సమయంలో నీటిని సరఫరా చేయడం, నాణ్యత గుర్తించడం, ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చనే నేపథ్యంలో వాటిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రైల్వే ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు వెళ్లేటపుడు ఏ స్టేషనుకు వెళ్లాలో చూసుకొని వెళ్లాలి. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లు ఇతర స్టేషన్ల నుంచి బయలుదేరుతున్నాయి. అక్టోబర్ 20 నుంచి వారం రోజుల పాటు ఈ మార్పులుంటాయి. పోర్బందర్ ట్రైన్ ఉందానగర్ నుంచి, సిద్దిపేట బండి మల్కాజిగిరి నుంచి, పుణె ఎక్స్‌ప్రెస్ నాంపల్లి నుంచి నడుస్తాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఒక్క పిల్లర్ నిర్మాణం వెనుక నెలల కష్టం ఉంటుందని ఇంజినీర్లు తెలిపారు. పిల్లర్ల నిర్మాణం ఇన్ సిట్యూ పద్ధతిలో అక్కడే జరుగుతుంది. పిల్లర్ల నిర్మాణంలో ఫౌండేషన్ ఒకేత్తయితే, పైభాగం(వెబ్) నిర్మాణం మరో ఎత్తు. పిల్లర్‌పై భాగం నిర్మాణానికి భారీ స్థాయిలో స్టీల్ అవసరం ఉంటుందని AE అనిల్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.