India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజలు ప్రజావాణిలో అందించిన అర్జీలపై సత్వరమే అధికారులు స్పందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ముకుంద రెడ్డి, కదిరవన్ పళని, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారితో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్‌లో గత నెల 24న భర్త హత్య చేసి, ముక్కలుగా మార్చి మూసీలో పడేసిన స్వాతి అవయవాలు ఇప్పటికీ లభించలేదు. 9 రోజులుగా DRF, హైడ్రా బృందాలు ప్రతాపసింగారం మూసీ వంతెన వద్ద జల్లెడ పట్టినా ఫలితం శూన్యమైంది. మూసీలో ఎక్కడా ఆనవాళ్లు కనిపించకపోవడంతో దర్యాప్తు మరింత క్లిష్టమైంది. గాలింపు యత్నాలు ఫలించకపోవడంతో కేసు సవాలు అవుతోంది.
బీజేపీ ఆడిస్తున్న నాటకంలో సీఎం రేవంత్ రెడ్డి కీలుబొమ్మగా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని కుత్బుల్లాపూర్ BRS ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం, రేవంత్ రెడ్డి చేసే పనితీరు తదితర విషయాలన్నీ గమనిస్తే ఇది తేటతెల్లమవుతున్నట్లుగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదన్నారు.
HYD వ్యాప్తంగా ఆర్టీసీ కార్గో సర్వీస్ హోమ్ డెలివరీ చేస్తున్నట్లుగా రాష్ట్ర IPRD తెలిపింది. కేజీ వరకు బరువు కలిగిన పార్సెల్ రూ.50కు మాత్రమే HYD వ్యాప్తంగా డెలివరీ చేస్తున్నట్లుగా వివరించింది. ఆర్టీసీ కార్గో హోమ్ డెలివరీ సంబంధించి ఆర్టీసీ వెబ్‌సైట్, ఆర్టీసీ కార్గో సర్వీస్ సెంటర్లను సందర్శిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.
HYD శివారు బీబీనగర్ AIIMS హెల్త్ కేర్ ఫెసిలిటీ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 84% నిర్మాణం పూర్తయినట్లుగా పేర్కొన్నారు. రూ.1365.95 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయని సోమవారం వివరించారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 33 విభాగాలు పనిచేస్తాయన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం HYD మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ వద్ద సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 46,000 ట్యాంకుల్లో చేపల పెంపకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.122 కోట్లు విడుదల చేసినట్లుగా తెలిపారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లుగా చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి, మెట్టు సాయి ఉన్నారు.
బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. HYD శాసనమండలి వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు కేసీఆర్ 34 శాతం బీసీలకు రిజర్వేషన్ తేవాలని చూస్తే, గోపాల్ రెడ్డి అనే వ్యక్తి కేసు వేసి ఆపాడని, నేడు మరో గోపాల్ రెడ్డి పుట్టాడా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశాలు అమలు చేయాలన్నారు.
HYD బుద్ధభవన్‌లో సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు అందాయన్నారు. వర్షాకాలం వరద ముప్పుపై ఫిర్యాదులు, కాలువల ఆటంకాలు తొలగించాలంటూ వినతులు చేశారన్నారు. సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పగించినట్లు పేర్కొన్నారు.
డ్యూటీలోని వనస్థలిపురం పోలీసులపై దాడి చేసిన వారిని రిమాండ్‌కు తరలించారు. ఈరోజు తెల్లవారుజమున 2 గంటలకు నిబంధనలకు విరుద్ధంగా చింతలకుంట దగ్గర టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసి ఉండగా కానిస్టేబుల్ R.లింగం, హోంగార్డ్ M.యాదయ్య మూసివేయమని చెప్పారు. అప్పుడే వచ్చిన బోడుప్పల్ వాసులు రాపోలు రాకేశ్, గుండవెల్లి ప్రసాద్ కలిసి పోలీసులపై దాడి చేసి బూతులు తిట్టారు. వారితోపాటు టిఫిన్ సెంటర్ యజమాని వనం పవన్‌ను అరెస్ట్ చేశారు.
తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ అన్నారు. ఈరోజు HYDలోని సెక్రటేరియట్‌లో వారు మాట్లాడారు. తెలంగాణను దేశంలో అత్యంత ఇష్టపడే గమ్యస్థానంగా నిలపడమే నూతన పర్యాటక విధాన లక్ష్యమని, వచ్చే ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15,000కోట్ల పెట్టుబడులు ఆకర్శిస్తామని, కనీసం 3లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.