India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాల్గో నగరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌ను అధికారులు, సిబ్బందితో కలిసి ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలుష్య రహిత హరిత నగరంగా, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు HMR డీపీఆర్ సిద్ధం చేస్తోందని వెల్లడించారు.
‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అనే పాట వినే ఉంటారు. చీర కట్టుతో అందంగా కనిపించడమే కాదు ఫిట్‌నెస్ కూడా సాధ్యమేనని పలువురు మహిళలు చాటి చెప్పారు. HYD నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో శారీ రన్(SAREE RUN) నిర్వహించారు. ఈ వాకథాన్‌లో 3,120 మంది మహిళలు చీరకట్టుతో పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తన బిడ్డతో పాటు పాల్గొని పరుగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.
SLBC వద్ద జరిగిన ప్రమాదంలో అనేక పరిణామాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. SLBC ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గమని, 20సార్లు మార్పులు చేయడం వల్ల సొరంగ మార్గం అంచనాలు పెరిగి మరింత ఆలస్యం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో పనులు చేపట్టకపోవడంపై కప్పు స్లాబ్ తుప్పు పట్టి ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యమన్నారు.
హైదరాబాద్ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్‌లు నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో పనులకు జీహెచ్ఎంసీ టెండర్‌లకు ఆహ్వానించింది.
HYDలో చికెన్ ధరలు పతనం అవుతున్నాయి. KG మీద ఏకంగా రూ.18 నుంచి రూ.20 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ 168, విత్‌స్కిన్ KG రూ.148గా ఉండగా.. నేడు మోరోసారి భారీగా పడిపోయాయి. KG స్కిన్‌లెస్ రూ.152, విత్ స్కిన్ రూ. 133 చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. హోల్‌సేల్ దుకాణాల్లో ఇంకా తగ్గించి విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ధర ఎంత?
జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్‌పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
అన్న, చెల్లెని గర్భవతిని చేసిన ఘటన HYDలో జరిగింది. బాధితుల వివరాలు..ప్రకాశం జిల్లాకు చెందిన భార్యభర్తలకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు విడాకులు తీసుకుని తల్లి, కుమార్తెలు విజయవాడలో, తండ్రి, కొడుకు HYDలో ఉంటున్నారు. పెద్ద చెల్లిని క్రిస్మస్‌కు సొంతూరు తీసుకెళ్లి తల్లికి అప్పజెప్పకుండా HYDకు వచ్చారు. కొన్నాళ్లకు కుమార్తె గర్భవతి అని తెలిసి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటకొచ్చింది.
గ్రేటర్ పరిధిలో సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ.. 2022 ఏప్రిల్ నెలలో నమోదైన సగటు గరిష్ఠ డిమాండ్ 3435 మెగావాట్లు. ప్రస్తుతం ఫిబ్రవరిలోనే 3456 మెగావాట్లుగా నమోదవుతోంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ ఎంత పెరుగుతుందో అని అధికారులు అంచనాలు వేశారు. దీనికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనం అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. చేయక చేయక ఒక ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదే అని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడం కాంగ్రెస్ కమిషన్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
కుషాయిగూడ PS పరిధిలో శనివారం కన్న తండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. పెద్దపల్లి జిల్లా వెన్నంపల్లి గ్రామానికి చెందిన అరెల్లి మెగిలి(45) జీవనోపాధి కోసం నగరానికి వలసవచ్చి లాలాపేటలో ఉంటున్నాడు. మద్యానికి బానిసైన మొగిలి నిత్యం తాగొచ్చి కుటుంబసభ్యులను డబ్బుల కోసం వేధించసాగాడు. విసిగిపోయిన కొడుకు సాయికుమార్ తండ్రిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ECIL బస్టాండ్ వద్ద అందరు చూస్తుండగానే నిన్న హత్య చేశాడు.
Sorry, no posts matched your criteria.